మెగాస్టార్ 47.. రామ్ చరణ్ 18.. బుచ్చిబాబు స్పెషల్ విషెస్! | Director Buchi Babu Special Wishes To Ram Charan ahead of 18 years | Sakshi
Sakshi News home page

Ram Charan: మెగాస్టార్ 47.. రామ్ చరణ్ 18.. బుచ్చిబాబు స్పెషల్ విషెస్!

Sep 28 2025 1:48 PM | Updated on Sep 28 2025 1:52 PM

Director Buchi Babu Special Wishes To Ram Charan ahead of 18 years

మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవలే తన సినీ ప్రయాణంలో 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగాస్టార్‌గా ఎదిగిన చిరు.. తన మొదటి సినిమా ప్రాణం ఖరీదును గుర్తు చేసుకుంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. నేటికి సరిగ్గా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చెర్రీకి అభినందనలు చెబుతున్నారు. 

ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు స్పెషల్ డే కావడంతో పెద్ది మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్‌కు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.. అరంగేట్రం నుంచి మీ సినీప్రయాణం అద్భుతమంటూ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ట్వీట్ చేశారు. ఈ అద్భుతమైన జర్నీలో నేను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. రామ్ చరణ్ కెరీర్‌లో పెద్ది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చెర్రీ అభిమానులకు బుచ్చిబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రత్యేక పోస్టర్‌ మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న పెద్ది చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడికల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా అలరించనుంది. మెగా హీరో రామ్ చరణ్.. చిరుత మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివరాజ్‌ కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement