రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ 62వ పుట్టినరోజు జామ్‌నగర్‌లో తన ఉద్యోగుల మధ్య ఘనంగా జరిగింది. నవంబరు 2, శనివారం నాడు 62వ బర్తడే సందర్బంగా సిబ్బంది బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో ఆమెను సర్‌ప్రైజ్ చేశారు. నీతా పుట్టిన రోజును ఆమె స్టాఫ్ అంతా కలిసి ఆనందంగా నిర్వహించిన నెట్టింట సందడిగా మారింది.
సిబ్బంది పాటలు, కేరింతలు కరతాళ ధ్వనుల మధ్య కేక్ ఉన్న టేబుల్ వద్దకు ఆమె పువ్వులపై నడిచి వచ్చారు.
కేక్‌ను కట్ చేసిన అనంతరం సిబ్బందితో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు. అంతే కాదు ఒక మహిళా ఉద్యోగి ఆమ నీతా ముక్కుపై కేక్ పూయడంలాంటివి ఈ సరదా వేడుకలో చూడవచ్చు.
మరోవైపు పుట్టిన రోజు సందర్భంగా దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే భర్త అంబానీ కాళ్లకు మొక్కి తన ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు తనకు జన్మనిచ్చిన తల్లి పాదిభి వందనం చేసి, ఆమె ఆశీస్సులు కూడా తీసుకున్నారు నీతా.
ఇష్టమైన పింక్ కలర్ డ్రెస్‌లో నీతా
అద్భుతమైన చీరలు, డైమండ్‌నగలు, ఖరీదైన వాచీలు, లగ్జరీ బ్యాగులకు పెట్టింది పేరైనా నీతా అంబానీ తన 62 బర్త్‌డే కోసం తన ఫ్యావరెట్ పింక్ కుర్తా సెట్‌లో మెరిసారు. ఆరుగజాలతో అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేసిన రాణి పింక్ సూట్ సెట్ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. ఫుల్ స్లీవ్స్‌తో, జరీ ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్, బ్రోకేడ్ ఎంబ్రాయిడరీ , పట్టీ వర్క్ తో ఆమెను లుక్‌ను మరింత ఎలివేట్ చేశారు.దీనికి జతగా బంగారు బ్రాస్‌లెట్‌లు, భారీ డైమండ్ సెంటర్‌పీస్, స్టేట్‌మెంట్ రింగ్, పోల్కీ బంగారు చెవిపోగులు గులాబీ రంగు స్ట్రాపీ చెప్పులు, ధరించారు.
కాగా భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు,రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్. ముఖేష్-నీతా దంపతుల పిల్లలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ , అనంత్ అంబానీ రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో భాగంగా ఉన్నారు. 2016లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగ. 2023లో, ఆమె నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ను స్థాపించారు. దీని ద్వారా భారతీయ కళలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో కళలు, చేతిపనులు, సంస్కృతి, క్రీడలు, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రపంచంలోని బెస్ట్ సర్వీసులకు భారతదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.



