విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు మోంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.
మోంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలను వైఎస్సార్‌సీపీ నేతలు తలశిల రఘురాం, పేర్ని నానిలు వెల్లడించారు.
ఉచిత పంటల బీమాతో రైతులకు శ్రీరామ రక్ష: వైఎస్ జగన్


