వేగన్‌ వేవ్‌..! సస్టైనబుల్‌ లైఫ్‌స్టైల్‌గా వేగనిజం! | Veganism: Sustainable Lifestyle Beyond Trends | Sakshi
Sakshi News home page

వేగన్‌ వేవ్‌..! సస్టైనబుల్‌ లైఫ్‌స్టైల్‌గా వేగనిజం!

Nov 3 2025 10:23 AM | Updated on Nov 3 2025 10:39 AM

Veganism: Sustainable Lifestyle Beyond Trends

నగరంలో ఇటీవల వేగన్‌ ప్లీ మార్కెట్, వేగన్‌ ఫుడ్‌ డొనేషన్, వేగన్‌ వాక్స్‌ వంటి వినూత్న కార్యక్రమాలు జరుగుతుండడం విధితమే. అంతేకాకుండా రానున్న రోజుల్లో నగరంలో వేగన్‌ కమ్యూనిటీ అవేర్నెస్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. పదేళ్ల క్రితం నగరంలోని కొద్దిమంది మాత్రమే పాటించే ‘వేగన్‌ జీవనశైలి’ ప్రస్తుతం హైదరాబాద్‌ యువత, ఫిట్‌నెస్‌ ప్రేమికులు, జంతు ప్రేమికులు, పర్యావరణ హిత జీవనశైలిని ఆచరించే వారందరి మధ్య వేగంగా విస్తరిస్తోంది. రెస్టారెంట్ల మెనూలో ‘వేగన్‌ ఆప్షన్‌’లు  కొత్తగా చేరడం, షాపింగ్‌ మాల్స్‌లో ప్లాంట్‌ బేస్డ్‌ ప్రొడక్ట్స్‌కు ప్రత్యేక కౌంటర్లు రావడం, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వేగన్‌ ఫుడ్‌ను ప్రమోట్‌ చేయడం ఈ మార్పుకు ప్రతికూలంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్‌ ఇప్పుడు దేశంలో వేగన్‌ హబ్‌గా ఎదుగుతున్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. స్థానిక ఫుడ్‌ బ్రాండ్లు, క్లౌడ్‌ కిచెన్లు, ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ కూడా ప్లాంట్‌ బేస్డ్‌ సెగ్మెంట్‌ విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. 

హైదరాబాద్‌లో వేగనిజం ఇప్పుడు ఒక ట్రెండ్‌ కాదు, ఒక చైతన్యం. జంతువుల పట్ల మమకారం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, భూమి పట్ల బాధ్యత కలిపి ఏర్పడిన ఈ వేగన్‌ వేవ్‌ నగర జీవనశైలిని కొత్త దిశలో నడిపిస్తోంది. ఈ మార్పు కేవలం ఫ్యాషన్‌ కోసం కాదు.., పర్యావరణం, జంతు సంరక్షణ, ఆరోగ్యానికి దోహదపడే విలువలపై ఆధారపడి ఉంది. వేగనిజం అనేది కేవలం స్వచ్ఛమైన శాకాహారం స్వీకరించే పద్ధతి మాత్రమే కాదు.. ఇది ఒక జీవన తత్వం. 

జంతువులకు హానికరమైన ఏ (ఎనిమల్‌ బెస్ట్‌ ప్రొడక్ట్స్‌) ఉత్పత్తినీ ఉపయోగించకుండా జీవించడమే దీని మంత్రం. అంటే పాలు, మాంసం, గుడ్లు, తేనె వంటి ఉత్పత్తులు తినకుండా, లెదర్, సిల్క్‌ వూల్‌ వంటి జంతు ఆధారిత వ్రస్తాలను వాడకుండా జీవించడం. పచ్చి ఆహారం, ప్లాంట్‌ బేస్డ్‌ ఫుడ్‌ ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలూ పొందడమే దీని లక్ష్యం.

నగరంలో వేగన్‌ కల్చర్‌.. 
దశాబ్దం క్రితం హైదరాబాద్‌లో వేగన్‌ రెస్టారెంట్లు అరుదు. కానీ ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచి్చ»ౌలి, హైట్‌టెక్‌ సిటీ ప్రాంతాల్లో అనేక వేగన్‌ కేఫేలు తెరుచుకున్నాయి. ఈ స్పాట్స్‌ వేగన్‌ ఫుడ్‌ ప్రేమికుల అడ్డాగా మారాయి. వీటిలో సోయా మిల్క్‌ లాటేలు, టోఫూ బర్గర్లు, క్వినోవా బౌల్స్, ప్లాంట్‌–బేస్డ్‌ పిజ్జాలు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. 

సోషల్‌ మీడియా, ఎన్జీవోల ప్రభావం.. 
జంతు హక్కుల కోసం పనిచేసే పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ ( పీఎఫ్‌ఏ), బ్లూ క్రాస్‌ హైదరాబాద్, వేగన్‌ ఇండియా మూమెంట్‌ వంటి సంస్థలు వేగన్‌ లైఫ్‌స్టైల్‌పై విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. అదే సమయంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో స్థానిక వేగనిస్టులు తమ రోజువారీ ఫుడ్‌ హ్యాబిట్స్, రెసిపీలు, షాపింగ్‌ టిప్స్‌ పంచుకుంటున్నారు. వేగన్‌ హైదరాబాద్‌ వంటి కమ్యూనిటీ గ్రూప్‌ సోషల్‌ మీడియాలో వేల మందికి పైగా సభ్యులను, ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. 

వేగన్‌ ఫెస్టివల్స్, మార్కెట్లు.. 
హైదరాబాద్‌లో ప్రతి యేటా వేగన్‌ ఫెస్టివల్‌ ఘనంగా జరుగుతోంది. ప్లాంట్‌ బేస్డ్‌ ఫుడ్‌ స్టాల్స్, వేగన్‌ క్లాతింగ్, జీరో వేస్ట్‌ ప్రొడక్ట్స్, పర్యావరణ హిత జీవన పద్ధతులపై వర్క్‌షాప్స్‌ జరుగుతాయి. గచి్చ»ౌలి స్టేడియం, ట్యాంక్‌ బండ్‌ ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకలు ప్రజల్లో భారీగా ఆదరణ పొందుతున్నాయి. తద్వారా వేగన్‌ పాప్‌ అప్‌ మార్కెట్లు కూడా కొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడ స్థానిక బ్రాండ్లు హస్తకళలతో చేసిన ప్లాంట్‌ బేస్డ్‌ ఉత్పత్తులను అమ్ముతాయి.

వేగన్‌ ఫుడ్‌ – హెల్తీ బెనిఫిట్స్‌.. 
ఫిట్‌నెస్‌ ప్రియులు, యోగా ప్రేమికులు ఈ జీవనశైలిని ఎక్కువగా అంగీకరిస్తున్నారు. రక్తపోటు, కొలె్రస్టాల్, మధుమేహం వంటి వ్యాధులను తగ్గించడంలో వేగన్‌ ఆహారం సహాయపడుతుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. వేగన్‌ డైట్‌లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి డిటాక్సిఫై ప్రభావాన్ని ఇస్తుంది. కానీ సరైన మార్గదర్శకత్వంతో మాత్రమే దీని ప్రయోజనం పూర్తవుతుందని హైదరాబాద్‌ ఆధారిత న్యూట్రిషన్‌ ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు.  

ఎకో ఫ్రెండ్లీ ఫ్యాషన్‌ వైపు..
వేగన్‌ ఫ్యాషన్‌ కూడా హైదరాబాద్‌ యువతలో కొత్త ట్రెండ్‌గా మారింది. లెదర్‌కు బదులుగా కార్క్, పైనాపిల్‌ ఫైబర్, రీసైకిల్‌ చేసిన కాటన్‌తో తయారు చేసిన బ్యాగులు, షూలు, బెల్టులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని బొటిక్‌ స్టోర్లలో వీటికి భారీ డిమాండ్‌ ఉంది.   

(చదవండి: సెన్స్‌లెస్‌ సెల్ఫీ..! ఆందోళన వ్యక్తం చేస్తున్న పోలీసులు, నిపుణులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement