న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు , తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భారత రాజకీయలపై కీలక వ వ్యాఖ్యలు చేశారు.‘భారత రాజకీయాలు ఒక కుటుంబ వ్యాపారం’ అనే వ్యాసంలో వంశపార్యంపర్యంగా వస్తున్న రాజకీయ అధికారం, నాయకత్వ సంస్కృతిపై కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. అంతేకాదు ఈ ధోరణి భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పును కలిగిస్తుందన్నారు. కాంగ్రెస్ నేతగా కాంగ్రెస్ పై స్పష్టమైన విమర్శలు చేయడం చర్చకు దారి తీసింది.
దశాబ్దాలుగా, ఒకే కుటుంబం భారత రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించింది అంటూ కాంగ్రెస్ వారసత్వం రాజకీయాలపై విమర్శలనెక్కుపెట్టారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం చరిత్రలో గొప్ప ప్రభావం ఉన్నప్పటికీ స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ .రాజీవ్ గాంధీ, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ,ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలతో సహా నెహ్రూ-గాంధీ వంశానికి జన్మతః హక్కుగా ఉండిపోయింది. క్రమంగా ఈ ఆలోచన ప్రతి పార్టీలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి స్థాయిలోనూ భారత రాజకీయాల్లోకి చొచ్చుకుపోయిందంటూ వ్యాఖ్యానించారు.
'భారత రాజకీయాలు కుటుంబ వ్యాపారంగా మారాయి, ఇక్కడ నాయకత్వం జన్మతః హక్కుగా పరిగణించబడుతోంది’ అని అభిప్రాయపడిన శశి థరూర్ వంశపారంపర్యంగా సంక్రమించే రాజకీయ అధికారం పాలన , జవాబుదారీతనాన్ని దెబ్బతీస్తుందని వాదించారు. ఎందుకంటే ఈ విధంగా ఎంపికైన నాయకులు తరచుగా ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్ల నుండి డిస్‌కనెక్ట్ చేయబడతారని విమర్శించారు. మమతా బెనర్జీ ,,మాయావతి వంటి ప్రత్యక్ష వారసులు లేని మహిళా రాజకీయ నాయకులు కూడా మేనల్లుళ్లను తమ వారసులుగా ఎంచుకున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ సిండికేట్‌లో ప్రచురించిన ఈ వ్యాసంలో శశి థరూర్, భారతీయ రాజకీయ రంగంలో రాజకీయ నాయకత్వం జన్మతః హక్కు అనే ఆలోచన స్థిరపడిపోయిందని, ఇది గ్రామ సభల నుండి పార్లమెంటు అత్యున్నత స్థాయి వరకు భారత పాలనలో ఇదే ధోరణి లోతుగా అల్లుకుపోయిందన్నారు. కానీ రాజకీయ వారసులే పాలనకు సరిపోతారనే విశ్వాంస పాతుకుపోయిందనీ. దీని పాలన నాణ్యత తప్పనిసరిగా దెబ్బతింటుందని థరూర్ రాసుకొచ్చారు.
చదవండి: ఫెస్టివ్ సీజన్‌లో రికార్డ్ షాపింగ్ రూ.6 లక్షల కోట్లు, ఎందుకో?
భారతదేశం రాజవంశాన్ని మెరిటోక్రసీగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి ప్రాథమిక సంస్కరణలు అవసరం, చట్టబద్ధంగా తప్పనిసరి చేసిన పదవీకాల పరిమితులను విధించడం మొదలు, అర్థవంతమైన అంతర్గత పార్టీ ఎన్నికలు దాకా మెరిట్ ఆధారంగా నాయకులను ఎన్నుకునేలా ఓటర్లకు అవగాహన కల్పించడానికి, అధికారం ఇవ్వడానికి సమిష్టి కృషి కావాలన్నారు. భారత రాజకీయాలు కుటుంబ సంస్థగా ఉన్నంత కాలం, ‘ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే’ అనే నిజమైన ప్రజాస్వామ్య కల పూర్తిగా సాకారం కాబోదని ఆయన చెప్పారు.
కాగా సీనియర్ కాంగ్రెస్ నేతగా ఆయన ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీపైనే తన విమర్శలను ఎక్కుపెట్టడం చర్చకు దారి తీసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గతంలో ఆయన గతంలో పోటీని దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: నో ఫోటో షూట్, నో హగ్స్ : వరుడి10 డిమాండ్లు, నెట్టింట చర్చ


