ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ధనలాభం పొందుతారు | Today Telugu Horoscope On November 1st, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ధనలాభం పొందుతారు

Nov 1 2025 4:08 AM | Updated on Nov 1 2025 9:34 AM

Rasi Phalalu: Daily Horoscope On 01-11-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తిక మాసం, తిథి: శు.ఏకాదశి రా.2.50 వరకు, తదుపరి ద్వాదశి,నక్షత్రం: శతభిషం ప.2.28 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.8.44 నుండి 10.18 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.58 నుండి 7.38 వరకు, అమృత ఘడియలు: ఉ.7.17 నుండి 8.54 వరకు, సర్వ ఏకాదశి.

సూర్యోదయం :    6.02
సూర్యాస్తమయం:  5.27
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు.  వ్యాపారాలు,ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృషభం: ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల ద్వారా శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో  అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు.  వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

సింహం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గుతాయి. ధనలాభ సూచనలు.

కన్య: కార్యక్రమాలు  విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

తుల: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృశ్చికం: అనుకోని ప్రయాణాలు. కుటుంబసమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. బంధువులతో వివాదాలు.

ధనుస్సు: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. ధనలబ్ధి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గుతాయి.

మకరం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళాకారులకు ఒత్తిళ్లు.

కుంభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. శుభవార్తలు వింటారు.

మీనం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement