శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం,
తిథి: బ.ఏకాదశి రా.10.04 వరకు, తదుపరి ద్వాదశి,
నక్షత్రం: చిత్త ప.12.53 వరకు, తదుపరి స్వాతి,
వర్జ్యం: రా.7.03 నుండి 8.48 వరకు,
దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.00 వరకు తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు,
అమృత ఘడియలు: తె.5.34 నుండి 7.17 వరకు (తెల్లవారితే మంగళవారం), సర్వ ఏకాదశి.
సూర్యోదయం : 6.25
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం...చేపట్టిన కార్యకమాలలో విజయం. అందరిలోనూ గౌరవం. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృషభం....నిరుద్యోగుల ప్రయత్నాలలో కదలికలు. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.
మిథునం....కార్యక్రమాలలో స్వల్ప అవరోధాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల ఒప్పందాలు వాయిదా. దేవాలయ దర్శనాలు. వత్తులు, వ్యాపారాలు ఒత్తిడుల మధ్య సాగుతాయి. దూరప్రయాణాలు.
కర్కాటకం....దూరప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
సింహం..స్నేహితుల నుంచి ధనలాభం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సోదరులు సహాయపడతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తులు, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
కన్య....పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. వథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. విచిత్రమైన సంఘటనలు. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ.
తుల....ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. యత్నకార్యసిద్ధి. శుభవర్తమానాలు. విద్యార్థులకు కీలక సమాచారం. వృత్తులు, వ్యాపారాలు మరింతగా అనుకూలిస్తాయి. కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.
వృశ్చికం...కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు...స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మకరం....అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. ప్రయాణాలు వాయిదా. స్నేహితుల నుంచి ఆçహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దేవాలయ దర్శనాలు.
కుంభం...ఆదాయం కొంత తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలలో ప్రతిబంధకాలు.వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం. దేవాలయ దర్శనాలు.
మీనం....ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో వివాదాలు. స్వల్ప ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం చెందుతారు. కళాకారులకు ఒత్తిడులు.


