ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 14 12 2025 To 20 12 2025 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Dec 14 2025 12:31 AM | Updated on Dec 14 2025 1:22 AM

Weekly Horoscope Telugu 14 12 2025 To 20 12 2025

మేషం... 
కొన్ని వివాదాలు తీరతాయి. ఒక ముఖ్య∙సమాచారం అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది.  స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  వ్యాపారాలలో లాభాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు.  కాలభైరవాష్టకం పఠించండి.

వృషభం...
ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి కాగలవు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. దాతృత్వాన్ని చాటుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారం. బాకీలు కొన్ని వసూలై అవసరాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త  పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామికరంగం వారి యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. బంధువుల నుంచి ఒత్తిడులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. శివాష్టకం పఠించండి.

మిథునం...
కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. మీ సత్తా పదిమందీ గుర్తిస్తారు.  భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వాహనయోగం. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. అప్పులు సైతం తీరుస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో కొన్ని మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల వారు.పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. వారం  ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం..
కార్యక్రమాలలో విజయం. బంధువర్గం నుంచి శుభవర్తమానాలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి.  స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.  రావలసిన సొమ్ము అందుకుంటారు. రుణబా«ధల నుంచి విముక్తి లభిస్తుంది. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. కళారంగంవారికి కొన్ని  అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

సింహం....
కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. బంధువులతో లేనిపోని విభేదాలు. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఇతరులనుంచి రావలసిన సొమ్ము కొంత ఆలస్యమవుతుంది. వ్యాపారాలలో  నిదానం అవసరం. లాభాలు స్వల్పంగా ఉంటాయి.  ఉద్యోగాలలో పని పనిభారం మరింత పెరిగి సతమతమవుతారు. కళారంగం వారికి కాస్త నిరాశ తప్పదు. వారం మధ్యలో  శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య...
ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు అనూహ్యంగా  పొందుతారు. జీవిత భాగస్వామితో స్వలμ వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.  వాహనాలు,  భూములు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.  వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో  కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాల వారు సంస్థల ఏరాμటుపై దృష్టి సారిస్తారు. వారం చివరిలో అనారోగ్యం. బంధువర్గంతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  హనుమాన్‌ చాలీసా పఠించండి.

తుల...
ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కార్యక్రమాలు అనుకున్న çవిధంగా  పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు.  నిరుద్యోగుల కల ఫలించే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. అప్పులు తీరతాయి. వ్యాపార విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకోని లాభాలు. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. అయితే కొంత భారం తప్పదు. కళారంగం వారి కృషి ఫలించే సమయం. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం....
కొత్త పనులు  ప్రారంభిస్తారు. బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి  మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగే సమయం.  నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి ఏర్పడి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాల వారు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. వారం మధ్యలో  కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఆదిత్యుని పూజించండి.

ధనుస్సు...
చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు ఆదరణ పొందుతారు. కొన్ని సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు.   ఆరోగ్యపరంగా కొంత చికాకులు . రావలసిన సొమ్ము అందుతుంది. బాకీలు తీరుస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొన్ని  ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. కొన్ని పదవులు దక్కించుకుంటారు. వారం చివరిలో  ధననష్టం. కుటుంబసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం...
దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.  ఆత్మీయులు సహాయసహకారాలు అందిస్తారు. వాహనాలు , భూములు కొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగార్ధుల యత్నాలలో కొంత అనుకూలత ఉంటుంది. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి.విస్తరణయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభంలో  దుబారా ఖర్చులు. బంధువులతో తగాదాలు. పసుపు, బంగారు రంగులు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కుంభం.....
పనులు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులు, మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.  ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో  పెట్టుబడులతో పాటు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఒక కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

మీనం....
పట్టుదలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. రావలసిన బకాయిలు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు.  ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో స్వల్వ వివాదాలు. నీలం, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement