గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు,మార్గశిర మాసం, తిథి: బ.అష్టమి సా.6.51 వరకు, తదుపరి నవమి,నక్షత్రం: పుబ్బ ఉ.8.34 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: సా.4.03 నుండి 5.43 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.34 నుండి 9.20 వరకు, తదుపరి ప.12.14 నుండి 12.58 వరకు, అమృత ఘడియలు: రా.2.01 నుండి 3.42 వరకు.
సూర్యోదయం : 6.24
సూర్యాస్తమయం : 5.23
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం... మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
వృషభం... అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. దైవదర్శనాలు. అనారోగ్యం. బంధువుల కలయిక. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
మిథునం... నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిత చింతన. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
కర్కాటకం... శ్రమ తప్పకపోవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత నిరాశ. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
సింహం... సన్నిహితుల నుంచి శుభవార్తలు. వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
కన్య... సన్నిహితులు, మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తప్పవు.
తుల... మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. నూతన పరిచయాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.
వృశ్చికం... సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
ధనుస్సు... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.
మకరం... రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమర్థత చాటుకోవాల్సి ఉంటుంది.
కుంభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వాహనయోగం. ధనప్రాప్తి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
మీనం... వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలలో మరింత ఉత్సాహం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.


