శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.షష్ఠి రా.7.09 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: ఆశ్లేష ఉ.8.07 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.8.04 నుండి 9.40 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.15 వరకు, అమృత ఘడియలు: ఉ.6.31 నుండి 8.06 వరకు, తిరిగి తె.5.41 నుండి 7.16 వరకు (తెల్లవారితే గురువారం).
సూర్యోదయం: 6.23
సూర్యాస్తమయం: 5.22
రాహుకాలం : ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో గందరగోళం. సోదరులతో వైరం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
వృషభం: మిత్రులతో సఖ్యత. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మిథునం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలలో లేనిపోని ఇబ్బందులు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనప్రాప్తి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
సింహం: ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు.. ఆధ్యాత్మిక చింతన. కష్టానికి తగిన ఫలితం కనిపించదు.. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య: పనుల్లో పురోగతి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
తుల: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. విందువినోదాలు. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కించుకుంటారు.
వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ధన వ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొత్త సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరాశ. ప్రయాణాలు.
మకరం: రుణవిముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. పనులలో విజయం. ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
మీనం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. దైవచింతన.


