భారతీయ టీనేజర్లలో ఎక్కువ మంది "పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్" బారినపడుతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి యువకుల వరకు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అసలేంటి పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్? ఎందువల్ల వస్తుందంటే..
అధిక స్క్రీన్ సమయం, డిజిటల్ స్టిమ్యులేషన్‌తో ముడిపడి ఉన్న పరిస్థితినే పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు. సోషల్ మీడియాలో, ఆన్‌లైన్ కార్యకలాపాల్లో ఎక్కువ సేపు గడిపితే ఇలా వచ్చేస్తుందా అంటే..ఔనని చెబుతున్నారు వైద్యులు. దీనివల్ల శ్రద్ధ అనేది లోపిస్తుందట. ఒక పనిపై ఫోకస్ అనేది భారంగా మారిపోతుందట. ఇటీవల కాలంలో యువకులు, పెద్దలు స్కీన్ సమయాన్ని పెంచేస్తున్నారు.
ముఖ్యంగా యాప్‌లు, గేమ్‌లు, వీడియోలు అంటూ తదేకంగా డిజిటల్ కార్యకలాపాల్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. దాంతో ఈ బ్రెయిన్ సిండ్రోమ్ బారినడుతున్నట్లు తెలిపారు. ఏదైన అతి అయితే ప్రమాదమే అన్నది జగమెరిగిన సత్యం. అలానే డిజిటల్ ఓవర్‌లోడ్ శారీరకంగానే కాకుండా మానసికంగా హాని అని, దీనివల్ల దృష్టి లోపం, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటే..
2011లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు డేవిడ్ లెవీ ఈ పేరుని సూచించారు. ఏ విషయంపైన శ్రద్ధ, ఫోకస్ లేకపోవడాన్ని పాప్‌కార్న్ గింజలు మాదిరిగా మెదడు తన అటెన్షన్ కోల్పోయింది అనే సూచగా పరిశోధకుడు లెవీ ఇలా వ్యవహరించారు. ఈ డిజిటల్ మీడియా వల్ల ఒక వ్యక్తి ఆలోచనలు ఒకదాని నుంచి మరొకదానికి వేగంగా మారిపోతుంటాయి.
దాంతో శ్రద్ధ అనేది కరువవుతుంది. అంటే ఒకే కార్యచరణపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఎదురవుతుంది. మానసికంగా అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి స్థితినే పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటారు. అధికారికంగా వైద్య నిర్థారణ కానప్పటికీ..ఈ పరిస్థితి చాలా తీవ్రమైనదని చెబుతున్నారు నిపుణులు. ఎందువల్ల వస్తుందంటే..? తరుచుగా మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, డిజిటల్ నోటిపికేషన్ తదితరాలే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు నిపుణులు.
వాటిలో కొన్ని కారణాలు..
అధిక స్క్రీన్ సమయం
మొబైల్‌లో ఎక్కువ సమయంల గడపడం వల్ల డిజిటల్ కాని కార్యకలాపాలపై దృష్టి పెట్టడం కష్టమవుతుం
తక్షణ సంతృప్తి
ఇంటర్నెట్, సోషల్ మీడియా త్వరిత రివార్డులను అందిస్తాయి. అది మెదడులో డోపమైన్‌ను పెంచి రోజువారీ పనులను నిస్తేజంగా, ఆసక్తికరంగా కానివిగా చేస్తుంది.
నిరంతర నోటిఫికేషన్‌లు
తరచుగా వచ్చే నోటిఫికేషన్‌లు మన దృష్టిని విచ్ఛిన్నం చేస్తాయి. ఇది చాలా మానసిక అంతరాయాలను కలిగిస్తుందట. ఒకే పనిపై దృష్టి పెట్టడం కష్టతరం అవుతుందట.
మల్టీ టాస్కింగ్
వేర్వేరు యాప్‌లు లేదా పనుల మధ్య త్వరితగతిన మారడం వల్ల శ్రద్ధ తగ్గిపోతుందట
ఎవరిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందంటే?
వైద్యుల అభిప్రాయం ప్రకారం, పాప్‌కార్న్ మెదడు ఎక్కువగా టీనేజర్లు, యువకులలో కనిపిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితి ఇప్పుడు 30 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారిలో కూడా సాధారణంగా కనిపిస్తోందని చెబుతున్నారు వైద్యులు. అయితే, ఇది ఇంటర్నెట్ వ్యసనం లాంటిది కాకపోయినా.. రోజువారీ జీవితంలో పని సంబంధంల మధ్య అంతరాయం కలిగించి, సోమరిగా నిలబెట్టేంత చెడ్డదిని చెబుతున్నారు నిపుణులు. కలిగించడంలో సమానంగా చెడ్డది. ఈ పాప్‌కార్న్ బ్రెయిన్ శ్రద్ధ, భావోద్వేగ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది.
ఈ పరిస్థితి లక్షణాలు..
చిరాకు, ఆందోళన పెరగడం
నిద్రలేమి
దృష్టిని కేంద్రీకరించడంలో లేదా శ్రద్ధ వహించడంలో ఇబ్బంది
అతిగా అప్రమత్తంగా లేదా ఒత్తిడికి లోనవుతున్నట్లు అనిపించడం
ఆఫ్‌లైన్ జీవితం నీరసంగా లేదా ఆసక్తిలేనిదిగా అనిపిస్తుంది.
అధిక ఒత్తిడికి గురవ్వ్వడం
ఈ పరిస్థితిని అధిగమించాలంటే..
శ్వాస వ్యాయామాలు
ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండి
ఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టడం అనేది ప్రాక్టీస్ చేయడం అంటే సింగిల్ టాస్కింగ్‌కి ప్రాధాన్యత ఇవ్వడం లాంటిది.
జ్ఞాపకశక్తిని పెంపొందించేలా యోగా ఆసనాలు
స్క్రీన్ సమయాన్ని సర్దుబాటు చేయడం
టెక్-ఫ్రీ జోన్‌ను నియమించుకోవడం
స్వయంగా ఎవరికి వారుగా డిజిటల్ డిటాక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం
స్కీన్‌న సమయం, ఎలక్ట్రిక్ పరికరాలతో గడపడంలో సరిహద్దును ఏర్పాటు చేసుకోవడం
వంటి వాటితో ఈ సమస్యను అధిగమించగలుగుతారనా చెబుతున్నారు నిపుణులు. లేదంటే అచ్చం పాప్‌కార్న్ మాదిరిగా బ్రెయిన్ ఏపని మీద ఫోకస్, శ్రద్ధని కనబర్చడంలో విఫలమై మానసికంగా స్ట్రగులవుతారని హెచ్చరిస్తున్నారు. ఆదిలోనే ఈ పరిస్థితిని గుర్తించి రికవరీ అయ్యే ప్రయత్నాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: రుతుస్రావ బాధలు మరింత సుదీర్ఘంగా!)


