సాక్షి, విజయవాడ: తన భర్త ప్రభుత్వ ఉద్యోగి.. భార్య మాత్రం తన స్థాయిని మర్చిపోయింది. చిల్లర పనులకు దిగజారింది. బస్టాండ్‌లో తోటి ప్రయాణికురాలి వద్ద ఎంపీడీవో భార్య.. పర్సును దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. బస్సు ఎక్కే క్రమంలో ఒక నర్సు నుంచి పర్సు దొంగతనం చేసింది. ఈ విషయం తెలిసినా కూడా దొంగతనాన్ని దాచిపెట్టి భార్యను ఎంపీడీవో ప్రోత్సహించారు.

బాధిత నర్సు ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్‌లను కృష్ణలంక పోలీసులు పరిశీలించారు. నర్సు చేతిలో ఉన్న బ్యాగ్‌ను ఎంపీడీవో భార్య అదే పనిగా చూస్తుండటం.. బస్సు ఎక్కే సమయంలో నర్సు వెనుకే ఆమె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూనిఫాం ఆధారంగా కుమార్తె చదివే కళాశాలకు వెళ్లి విచారణ చేసిన పోలీసులు.. గుంటూరులో ఎంపీడీవోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని ప్రశ్నిస్తున్నారు.


