తాడేపల్లి: ఏపీ మాజీ మంత్రి, దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన్ను మరోసారి గుర్తు చేసుకున్నారు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ మేరకు భావోద్వేగ సందేశాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ‘‘నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని చాలా మిస్ అవుతున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు వైఎస్ జగన్.
Remembering my dear friend, Mekapati Goutham Reddy on his birth anniversary. I miss you, Goutham! pic.twitter.com/vmogCMRTOu
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2025
కాగా, ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఏపీ ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) 2022 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్(Hyderabad) లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. వైద్యులు తీవ్రంగా శ్రమించినా.. ఫలితం లేకపోయింది. గౌతమ్ మరణంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడైన గౌతమ్ రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించారు.


