ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Telugu Horoscope On Nov 2nd To Nov 8th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Nov 2 2025 12:13 AM | Updated on Nov 2 2025 10:59 AM

Weekly Horoscope In Telugu From 02-11-2025 To 08-11-2025

మేషం...
పనులు మరింత వేగంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సోదరులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. వ్యాపారాలలో చికాకులు తొలగి లాభాలు అందుకుంటారు.  ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత విముక్తి. పారిశ్రామికరంగం వారికి  శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం...
ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలను కొలిక్కి తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు.  భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి.  వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.  ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి కార్యసిద్ధి. గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మిథునం...
పనులు సమయానికి పూర్తి చేస్తారు. అంతా హడావిడిగా గడిచిపోతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగుచూస్తుంది. కొందరుæ మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికరంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. వారం చివరిలో భూవివాదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం...
ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు అనుకూల  సమాచారం అందుతుంది. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది.  రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

సింహం...
వ్యవహారాలను చక్కదిద్దడంలో నైపుణ్యం చూపుతారు. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. పెండింగ్‌ బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.   వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.  ఉద్యోగాలలో క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది.  కళారంగం వారికి కొంత ఊరట లభించే సమయం.  వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.

కన్య....
ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగవుతుంది. సన్నిహితుల నుంచి మాట సాయం అందుతుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు నూతనోత్సాహం. ఒక సమాచారంతో మరింత ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలను అత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు.  పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  వారం మధ్యలో ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. పసుపు, గులాబీ రంగులు.  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల....
కొత్త కార్యక్రమాలు  చేపడతారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఖర్చులను అదుపు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింత పురోగతిలో సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడుల నుంచి విముక్తి.  వారం చివరిలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. గులాబీ, నేరేడు రంగులు. పం^è ముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం..
ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు.  కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి.  విస్తరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి  ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు.....
ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి. కొత్త పనులు  సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలలో లాభాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట చెందుతారు. కళారంగం వారి కృషి కొంతమేర ఫలిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. గులాబీ, లేత నీలం రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మకరం...
కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. రావలసిన సొమ్ము సమయానికి అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు.  ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు గతం కంటే  లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో వివాదాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి..

కుంభం....
ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఖర్చులు ఎదురై ఇబ్బంది పడతారు. పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు  శ్రమ పెరుగుతుంది.  వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.  ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొంత ఊరట లభించే సమయం. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.

మీనం..
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త పనులు  ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. భాగస్వాముల నుంచి మరింత సానుకూలత. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు కొన్ని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement