సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టు మంత్రి పొన్న ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు.. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు, పోలీసులు గుర్తిస్తున్నారు. బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో ముగ్గురు సొంతూరుకు వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం కారణంగా మృతి చెందారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోస్టుమార్టం అనంతరం తనూష, సాయి ప్రియా, నందిని మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి,.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో పది మంది మహిళలు, ఒక చిన్నారి, ఎనిమిది మంది పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది.

తాజాగా పలువురి మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు.
1.దస్తగిరి బాబా, డ్రైవర్;
2.తారిబాయ్ (45), దన్నారమ్ తండా;
3.కల్పన(45), బోరబండ;
4.బచ్చన్ నాగమణి(55); భానూరు;
5.ఏమావత్ తాలీబామ్, ధన్నారం తాండ;
6.మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్ మండలం;
7.గుర్రాల అభిత (21) యాలాల్;
8.గోగుల గుణమ్మ,బోరబండ;
9.షేక్ ఖాలీద్ హుస్సేన్, తాండూరు;
10.తబస్సుమ్ జహాన్, తాండూరు.
11. తనూషా, సాయిప్రియ, నందిని(ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెల్లు)
12. అఖిల(తాండూరు).
13. ఏనుగుల కల్పన
14. నాగమణి,
15. జహంగీర్.
క్షతగాత్రులు వీరే..
- వెంకటయ్య
- బుచ్చిబాబు-దన్నారమ్ తండా
- అబ్దుల్ రజాక్-హైదరాబాద్
- వెన్నెల
- సుజాత
- అశోక్
- రవి
- శ్రీను- తాండూరు
- నందిని- తాండూరు
- బస్వరాజ్-కోకట్ (కర్ణాటక)
- ప్రేరణ- వికారాబాద్
- సాయి
- అక్రమ్-తాండూరు
- అస్లామ్-తాండూరు


