సాక్షి, తాడేపల్లి: తెలంగాణలోని చేవెళ్ల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ప్రమాదంపై వైఎస్ జగన్ స్పందించారు. రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరం, బాధాకరమని.. తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.




