డబ్బు దేన్నైనా మార్చేయగలదు. అది మనుషుల దగ్గర ఉంటే..ఒక్కసారిగా వారి రేంజే మారిపోతుంది. మాట తీరు మారిపోతుంది. అందుకు నిదర్శనం ఈ సీఈవోకి ఎదురైన ఘటనే. అప్పటి వరకు సీఈవో దగ్గర నార్మల్‌గా పనిచేసిన వ్యక్తిలో..ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు. విస్తుపోవడం సీఈవో వంతైంది. ఆ తర్వాత గానీ తెలియదు అసలు కారణం ఇది అని.
ఇంతకీ ఏం జరిగిందంటే..ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా ఇటీవల కొత్తగా కారు డ్రైవర్‌ని నియమించుకున్నారు. పనిలో జాయిన్ అయిన రెండు రోజులు సాధారణంగానే పనిచేశాడు. మూడోవ రోజు..ఏకంగా ఆఘ మేఘాల మీద పునీత్ గుప్తాకి ఎదురొచ్చి డోర్ ఓపెన్ చేసి స్వాగతం పలికాడు. ఈ అనుహ్య చర్యకు విస్తుపోయిన సీఈవో..ఇంత హడావిడి ఏం అవసరం లేదు. కారు స్టార్ట్ చేసి ఉంటే తాను ఎక్కగానే కారు వెళ్లిపోయేది కదా అని చీవాట్లు పెట్టారు పునీత్ గుప్తా.
పైగా మరోసారి రిపీట్ అవ్వనివ్వద్దు, కేవలం టైం వేస్ట్ అవ్వకుండా చూసుకో చాలు అని కాస్త గట్టిగా చెప్పారు. కానీ కారు డ్రైవర్ మాత్రం తన పనే తాను చేసుకుంటున్నానని చెప్పే యత్నం చేసినా..గుప్తా అలా వద్దని వారించారు. ఆ తర్వాత ఇన్ని రోజులు నార్మల్‌గా ఉన్న వ్యక్తి ఈ రోజు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటా అని ఆలోచించారు గుప్తా. అప్పుడే గుర్తొచ్చింది. ఇందాక ఫోన్ కాల్‌లో రూ. 500 కోట్ల ఒప్పందం గురించి మాట్లాడానని, బహుశా దానివల్లే ఇతడిలో ఇంత మార్పు వచ్చిందా అని విస్తుపోయారాయన.
డబ్బు నిజానికి ఎవ్వరినైనా మార్చేస్తుంది. అంటూ తనకు జరిగిని అనుభవాన్ని నెట్టింట షేర్ చేసుకున్నారు. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌పై మిశ్రమంగా స్పందించారు. కొందరు డ్రైవర్ అంకితభావంతో పనిచేస్తున్నాడని పేర్కొనగా, మరికొంతమంది కోట్లు గురించి వినగానే బ్రో 'కార్పొరేట్ డ్రైవర్ మోడ్'ని అన్‌లాక్ చేసాడు" అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: Success Story: ఐఐటీలో సీటు నుంచి డ్రీమ్ జాబ్ వరకు అన్ని ఫెయిలే..! కానీ ఇవాళ..)


