మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకతను పెంచే ఆహారం ఏమిటో తెలుసుకుందాం.
బీ 12 ఫుడ్..: పాలు, గుడ్లు, చీజ్‌లో బీ 12 ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుందని తేలింది.
బీట్ రూట్.. ఎరుపు రంగులో ఉండే బీట్‌రూట్.. శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. దీనిని ఎలా తీసుకున్నా మంచిదే. దీని వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. క్యారెట్, బీట్‌రూట్‌ని కలిపి జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితమే ఉంటుంది.
క్యారట్: దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత, ప్లేట్‌లెట్ల కౌంట్ పడిపోయిన సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందదారని తేలింది. క్యారెట్‌ని నేరుగా లేదా సలాడ్ రూపంలో... ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది.
విటమిన్ కె ఫుడ్..: విటమిన్ కె ఉన్న ఫుడ్ కూడా ప్లేట్‌లెట్స్ సంఖ్యని పెంచుతుందని తేలింది. కేల్, గుడ్లు, ఆకుకూరలు, లివర్, మాంసం, క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది.
గుమ్మడికాయ : విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. ఇందులో ప్లేట్‌లెట్లని పెంచడమే కాదు, వాటి సంఖ్యను అదుపులో ఉంచే లక్షణాలు కూడా ఉన్నాయి. దీన్ని క్రమబద్ధంగా తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ్ర΄ోటీన్ ఉత్పత్తి అవడమంటే ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరిగినట్లే.
గోధుమగడ్డి
ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి.. ఈ గడ్డిని రసంగా చేసుకుని అందులో నిమ్మరసం కలిపి తాగడం వల్ల ప్లేట్‌లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: టీవీ డిబేట్‌లో రామ్‌దేవ్ బాబాను ఎత్తి కుదేశాడు : వైరల్ వీడియో


