భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల కేరళను సందర్శించారు. అక్కడ ఆమె వెర్మిసెల్లి(సేమ్యాలు)తో చేసిన చల్లటి డెజర్ట్‌ని ఆస్వాదిస్తునన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సునీతా పీచ్‌రంగు టీ షర్ట్ ధరించి తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సరదాగా గడుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోని ఫలుడా నేషన్ అనే అవుట్‌లెట్ స్టోర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..ఈ క్షణం ఎప్పటికీ మర్చిపోలేం.
సునీతా విలియమ్స్‌ని ఫలూడాకు స్వాగతించడం ఎంత గౌరవం. అంతరిక్షం నుంచి మా స్టోర్‌కి ఆ ఆలోచన మమ్మల్ని విస్మయానికిలోను చేస్తోంది.ఆమె మా రుచులన పంచుకోవడం..అదోక గొప్ప వరంగానూ, గర్వంగానూ ఉంది". అని పోస్ట్‌లో పేర్కొంది. ఈ వీడియోకి మిలియన్స్‌కు పైగా వ్యూస్ రావడమే గాక, ఆకామంత ఎత్తుగా కలలు కనడం నేర్పిన వ్యక్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
కాగా, సునీతా 27 ఏళ్ల సేవల అనంతరం ఇటీవలే నాసా నుంచి పదవీ విరమణ చేశారు. ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో మూడు మిషన్‌లు పూర్తి చేసిన ఘనత ఆమెది. అలాగే ఆమె కెరీర్‌లో మానవ అంతరిక్ష ప్రయాణ రికార్డులను నెలకొల్పారామె.
(చదవండి: ఇంటిపేరే ‘బెంగళూరు’..!)


