కొన్ని ఇంటి పేర్లు, ఊర్లు, గ్రామాల పేర్లుగా ఉండటం చూశాం. అంతేగానీ మెట్రో నగరాల్లాంటి మహా నగరాల పేరే ఇంటిపేరుగా ఉండటం గురించి విన్నారా?. వాట్ సీటీ పేరు ఇంటి పేరుగానా అని అనుకోకండి. ఇది నమ్మక తప్పని నిజం. ఓ మహిళ ఇంటిపేరే బెంగళూరు. ఎందుకలా వింటే.. ఆలోచన వేరేలెవెల్ అని అంటారు. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకుందో ఆమె చకచక చదివేయండి మరి..!.
బెంగళూరుకు చెందిన విప్రా బెంగళూరు అనే మహిళ తను పుట్టి.. పెరిగిన నగరంతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఓ వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించడమేకాదు ఆమె తాత ఆలోచనకు ఫిదా అయ్యారు కూడా. మీ తాతగారి ముందుచూపుకి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
ఆమె తన వాయిస్ ఓవర్‌తో వివరించి వ్యక్తిగత కథ అందరి మనసులను తాకింది. ఆ వీడియోలో క్లిప్‌లో విప్రా ఇలా చెప్పడం ప్రారంభించింది. తన ఇంటి పేరు బెంగళూరు అని ఉండటం గమనించారా. ఇదేంటని అనుకుంటున్నారా..?. అయితే నగరం పేరు ఇంటిపేరుగా ఎలా మారిందో మీకు తెలియాలి అంటూ వివరించడం మొదలుపెట్టింది ఆమె.."మా తాతయ్య నిజానికి తన పిల్లలకు అంటే మా నాన్నకు ఇంటి పేరు పెట్టలేదు.
ప్రజలు వారి ఇంటి పేరుని బట్టి వారి నేపథ్యం, హోదాను అంచనా వేస్తారనే ఉద్దేశంతో తన పిల్లలకు ఇంటిపేరు పెట్టేందుకు ఇష్టపడ లేదు. దాంతో మా నాన్నకు ఇంటిపేరు లేదు. ఇక నా వద్దకు వచ్చేటప్పటికీ..ఇంటి పేరు తప్పనిసరి కావడంతో..నేను పుట్టిన బెంగుళూరు నగరమే నా ఇంటి పేరుగా మారింది అని వివరించింది "విప్రా బెంగళూరు.
ఈ మహిళ కథ తన తాతయ్య సామాజిక కట్టుబడులకు దూరంగా ఉంచడానికి ఆయన ఎలాంటి స్పృహతో వ్యవహరించారో అవగతమవుతోంది. తన పిల్లలకు ఇంటి పేరు పెట్టకుండా..వ్యక్తిగతంగా వారి నేపథ్యం, గుర్తింపుతోనే బతికేలా చేసేందుకు ఆయన ప్రయత్నించిన తీరు నిజంగా ప్రశంసనీయం. అలాగే ఇంటి పేరు తప్పనిరి పరిస్థితులో తను పుట్టిన నగరమే తన గుర్తింపుగా మార్చుకోవడం కూడా తాత ఆశయాలకు అనుగుణంగా చాలా అర్థవంతంగా ఉంది కదూ..!. నెటిజన్లు కూడా ఆ మహిళ ఇంటి పేరు వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పగా, ఆదర్శంగా ఉందంటూ ఆమె తాతపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పోస్టులు పెట్టారు.
(చదవండి: ఒత్తిడికి మూలం డబ్బేనా..!)


