అందరు లక్షల్లో వేతనం అందుకునే స్థాయికి చేరుకోవాలనుకుంటారు. అందుకోసం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చదివి మరి అనుకున్న డ్రీమ్‌ని నెరవేర్చుకుంటుంటారు. అలానే ఈ వ్యక్తి కూడా 17 ఏళ్ల వయసులో ఐఐటీలో చేరడమే లక్ష్యంగా చదివాడు. కానీ లక్షల్లో ర్యాంకు రావడంతో ఆ కల చేజారిపోయింది. పోనీలే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు. అది కూడా విఫలమే. ఇన్ని ఫెయ్యిల్యూర్స్ ఎదురైనా..నా వల్ల కాదని చేతులెత్తేయలేదు. చివరికి అనుకున్న లక్ష్యానికి చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచాడు.
అతడే డ్రీమ్‌లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్. పాపం చిన్నప్పటి నుంచి తను కన్న ప్రతి కల నీరుగారిపోయేది. అడుగడుగునా వైఫల్యాలే. చిన్నప్పటి నుంచి ఐఐటీలో చేరడమే హర్షిల్ లక్ష్యం . కానీ లక్షల్లో ర్యాంకు రావడంతో మరోసారి ప్రయత్నించాడు. అప్పుడు కూడా 75 వేల ర్యాంకు తెచ్చకున్నాడు. దీంతో ఆ ఐఐటీ డ్రీమ్ కలగానే మిగిలిపోయింది. చివరికీ మాములు కాలేజ్‌లో చేరి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పోనీలే 20 ఏళ్లకే అందరికంటే మంచి పొజిషన్‌లో ఉండేలా లక్షల వేతనంతో కూడిన జాబ్ కొట్టేయాలనుకున్నాడు.
కానీ అది కూడా సాధ్యం కాలేదు. చివరికి నెలకు రూ. 30 వేలు సంపాదించే సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని అతికష్టం మీద తెచ్చుకున్నాడు. ప్రతి రోజు తనను తాను అసహ్యించుకుంటూ..ఇదేం ఉద్యోగం అని బాధపడిపోతుండేవాడు. అయినా సరే తన డ్రీమ్‌ని వదిలిపెట్టకుండా..అలా చాలా ఉద్యోగాలు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకుంటూనే ఉండేవాడు. అలా చేస్తుండగా ఏ కంపెనీ నుంచి రిప్లై వచ్చేది కాదు.
అలా ఆరు నెలలుగా కేవలం చదువుకోవడం, వ్యాయామాలు చేయడం, ఉద్యోగం కోసం వేట. ఇంతలా చేసినా..ఎలాంటి ఫలితం లేదు. అయితే ఒకరోజు నుంచి ఆకస్మికంగా ఇటర్వ్యూ కాల్స్ రావడం ప్రారంభించాయి. అలా 2024 నాటికి ఓ చిన్న ఆన్‌లైన్ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఇంటర్న్‌షిప్‌నే పూర్తి సమయం ఉద్యోగంగా మార్చుకున్నాడు. తొందరలో ఆ ఉద్యోగానికి స్వస్తి పలకక తప్పలేదు. అయినా తన ప్రయత్నం ఆపలేదు.
అలా పెద్దపెద్ద సంస్థలతో స్పాన్సర్ షిప్‌లు చేసే స్థాయికి చేరుకుని.. సొంతంగా కంపెనీకి పెట్టుకునే రేంజ్‌కి ఎదిగాడు. ఇవాళ ఏకంగా రూ. 54 లక్షలు అధిక వేతనానన్ని అందుకుంటూ తన కలను నెరవేర్చుకున్నా అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో తన సక్సెస్ జర్నీ గురించి వివరించాడు డ్రీమ్‌లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్.
ఇది నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. బ్రో మీది చాలా స్ఫూర్తిదాయకమైన స్టోరీ, ఎదురుదెబ్బలను ఎలా ఇంధనంగా మార్చుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. దృఢ సంకల్పంతో ఉండేవాడికి అదృష్టమే ఒళ్లోకొచ్చి వాలుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచారు అంటూ హర్షిల్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: డ్రీమ్‌లాంచ్ సీఈవో హర్షిల్ తోమర్)


