‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర.. | Carlsberg creates the world's smallest beer | Sakshi
Sakshi News home page

‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర..

Nov 2 2025 8:13 AM | Updated on Nov 2 2025 8:14 AM

Carlsberg creates the world's smallest beer

బీరు బాబులు మగ్గుల్లో బీరు పోసుకుని గుక్కలు గుక్కలుగా తాగుతారు గాని, ఈ సీసాలో ఉన్న బీరును అలా తాగడం కుదరదు గాక కుదరదు. ఎందుకంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న బీరు సీసా. ఇందులో ఉన్నది కేవలం ఒక చుక్క బీరు మాత్రమే! గొంతు తడుపుకోవడానికైనా చాలని చుక్క బీరుతో ఈ సీసాను అసలు ఎందుకు తయారు చేశారోననేగా మీ అనుమానం? స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లోని రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అతి చిన్న బీరు సీసా తయారీలో పోటీ నిర్వహించింది. 

ఈ పోటీలో గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు, డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌ కేంద్రంగా పనిచేసే బహుళజాతి బీర్ల తయారీ సంస్థ ‘కార్ల్స్‌బర్గ్‌’ ప్రధాన కార్యాలయం సందర్శనకు పంపనున్నట్లు ప్రకటించింది. 

ఈ పోటీలో పాల్గొన్న స్వీడిష్‌ మినియేచర్‌ కళాకారిణి ఆసా స్ట్రాండ్‌ ‘కార్ల్స్‌బర్గ్‌’ బీరుసీసా నమూనాలోనే ధాన్యం గింజంత పరిమాణంలో ఒక్క చుక్క బీరు మాత్రమే పట్టేంత ఈ సీసాను తయారు చేసి, విజేతగా నిలిచింది. ఈమె రూపొందించిన సీసాలో ఉన్న బీరు పరిమాణం 0.05 మిల్లీలీటర్లు మాత్రమే! దీనికి బహుమతిగా చెల్లించిన మొత్తం పదివేల స్వీడిష్‌ క్రోన్లు (రూ.93,410) కావడం విశేషం.

(చదవండి: నటి ప్రగ్యా జైస్వాల్‌ స్టైలింగ్‌ టిప్స్‌..! బ్లాక్‌ డ్రెస్‌ ధరించేటప్పుడు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement