స్టాక్‌హోమ్: స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ స్టాక్‌హోమ్‌లోని ఓస్టర్‌మాల్మ్ పరిధిలోని, రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సమీపంలోని వల్హల్లావాగెన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 3.23 గంటల ప్రాంతంలో అత్యంత రద్దీ సమయంలోఒక సిటీ బస్సు అకస్మాత్తుగా బస్ స్టాప్ క్యూలో వేచి ఉన్న జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Jag har nåtts av det tragiska beskedet att flera personer har omkommit och skadats vid en busshållsplats i centrala Stockholm. Människor som kanske var på väg hem till familj, vänner eller en lugn kväll hemma.
Vi vet ännu inte orsaken till detta, men just nu är mina tankar…— Ulf Kristersson (@SwedishPM) November 14, 2025
ప్రమాదానికి గురైన బస్సు సర్వీసులో లేదని, అందులో ప్రయాణీకులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం వెనుక కారణాలను తెలుసుకునేందుకు ఆయనను ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ‘బస్ స్టాప్‌లో పలువురు మరణించడం, మరికొందరు గాయపడటం తీరని విషాదం... బహుశా వారు ఇంటికి వెళ్తున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కావచ్చు’ అని ఆయన ‘ఎక్స్’ వేదికగా రాశారు. కాగా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Bihar Election: యూట్యూబర్ అభ్యర్థి సంగతేంటి?


