జపాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా దూకుడు
తామూ సిద్ధంగానే ఉన్నామన్న తైవాన్
బీజింగ్: తైవాన్ ఎప్పటికీ తమదేనంటున్న డ్రాగన్ దేశం చైనా తైవాన్ జలసంధిలో తాజాగా సైనిక విన్యాసాలకు తెరతీసింది. తైవాన్‌కు మద్దతుగా జపాన్ ప్రధానమంత్రి తకాయిచీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు, తైవాన్‌కు అమెరికా ఇటీవల భారీగా ఆయుధాలను విక్రయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ పరిణామాల నడుమ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్‌ఏ) ఈస్టర్న్ థియేటర్ కమాండ్ సోమవారం యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లతోపాటు లాంగ్ రేంజ్ క్షిపణులతో తైవాన్ జలసంధి మధ్యప్రాంతంలో సముద్రజలాలతోపాటు గగనతలంలోనూ విన్యాసాలు చేపట్టింది. ఈ విషయాన్ని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. కీలకమైన లక్ష్యాలను కచి్చతంగా ఛేదించేలా బలగాల సామర్థ్యాలకు పదును పెట్టడమే వీటి ఉద్దేశమని పేర్కొంది.
చైనా చర్యలపై తైవాన్ వెంటనే స్పందించింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ విన్యాసాలను చేపట్టామని తైవాన్ రక్షణ మంత్రి తెలిపారు. చైనా మిలటరీ చర్యలను శాంతికి తీవ్ర విఘాతం కలిగించే దుందుడుకు వైఖరిగా ఆయన అభివరి్ణంచారు. తైవాన్ వైమానిక స్థావరంలో ల్యాండవుతున్న పలు మిరేజ్ 2000 యుద్ధ విమానాల వీడియోను విడుదల చేశారు. దీంతో, సోమవారం పీఎల్‌ఏ చేపట్టిన విన్యాసాలు ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచినట్లయిందని పరిశీలకులు అంటున్నారు.
ఓ వైపు జపాన్.. మరో వైపు అమెరికా
నవంబర్ 7న జపాన్ పార్లమెంటులో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తైవాన్‌లో తలెత్తే ఏదైనా అత్యవసర పరిస్థితి జపాన్ మనుగడకే ముప్పు కలిగించే పరిస్థితిగా మారవచ్చని, అటువంటప్పుడు అమెరికాకు మద్దతుగా జపాన్ సైన్యం రంగంలోకి దిగాల్సిన అవసరం రావచ్చని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తకాయిచీ తకైచి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. చైనా విమా న వాహక నౌకలు, విమానాల సంచారంపై ఓ కన్నేసి ఉంచేందుకు ఒకినావాలోని సుదూర తూర్పు ద్వీపంలో మొబైల్ సర్వైలెన్స్ రాడార్ యూనిట్‌ను మోహరించాలనే జపాన్ నిర్ణయాన్ని కూడా చైనా విమర్శించింది. తైవాన్‌కు సమీపంలో జపాన్ లకి‡్ష్యత సైనిక మోహరింపులను బలోపేతం చేయడా న్ని, మధ్యశ్రేణి క్షిపణులను మోహరించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చైనా తీవ్రంగా తప్పుబట్టింది. సైనిక శక్తిని బలోపేతం చేసుకునేందుకు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడు తోందని ఆరోపించింది. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే ఈ నెల 18వ తేదీన తైవాన్‌కు రూ.లక్ష కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు.
ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఆమోదం తెలిపిన పక్షంలో తైవాన్‌కు ఇచ్చే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీ అవుతుంది. అమెరికా చర్య తైవాన్ స్వాతంత్య్రం కోరే, వేర్పాటువాద శక్తులకు ఊతమిచి్చనట్లేనని చైనా కన్నెర్ర చేసింది. తైవాన్ స్వాతంత్య్ర శక్తులు ఆ దీవిని పేలేందుకు సిద్ధంగా ఉన్న బాంబులాగా మారుస్తారంటూ వ్యాఖ్యానించింది. చైనా స్వాతంత్య్రాన్ని, సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడు కునేందుకు అవసరమైన అన్ని చర్యలను తప్పక తీసుకుంటుందని స్పష్టం చేసింది. 2022లో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌కు మద్దతు తెలిపేందుకు వచి్చనప్పటి నుంచి డ్రాగన్ దేశం విన్యాసాల పేరుతో తైవాన్‌ను పలుమార్లు దిగ్బంధనం చేసింది.


