ప్రగ్యా జైస్వాల్ అంటే సింపుల్ లుక్‌తోనే మెరిసే స్టార్.ఏ రంగులోనైనా ఏ డ్రైస్‌లోనైనా, కేవలం కంఫర్ట్ ఫ్లస్ కాన్ఫిడెన్స్ కలయికతో ఫ్యాషన్ స్పార్క్ చూపించే ఆమె స్టయిలింగ్ టిప్స్ మీ కోసం!
జిమ్‌లో గంటల కొద్దీ గడపటం కంటే, శరీరానికి కావలసిన విశ్రాంతి ఇవ్వడమే ముఖ్యం. రెస్ట్, హైడ్రేషన్, హెల్తీ మీల్స్ ఇవే నా ఫిట్‌నెస్ సీక్రెట్స్. ఫ్యాషన్ విషయానికి వస్తే, సింపుల్, క్లాసీ లుక్స్‌ను ఇష్టపడతాను. రెడ్, గోల్డ్ నా ఫేవరెట్ కలర్స్.
కాని, బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు వచ్చే ఆ క్లాసిక్ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. స్టయిలింగ్ ఏదైనా వాటికి కాన్ఫిడెన్స్ కలిస్తేనే అవే బెస్ట్ లుక్ అవుతాయి అని చెబుతోంది ప్రగ్యా జైస్వాల్. ఆమె ధరించిన చీర బ్రాండ్: స్వాన్ గాంధీ, ధర: రూ. 88,000, జ్యూలరీ బ్రాండ్: రాజ్‌వాడా జ్యూలర్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
రంగురంగుల దండ!
ఏ చీర వేసుకున్నా ఈజీగా సెట్ అయిపోయే సీక్రెట్ వెపన్ కావాలా? అయితే వెంటనే ఒక మల్టీకలర్డ్ నెక్‌పీస్ రెడీ చేసుకోండి. ఇది సాధారణ ఆభరణం కాదు, నవరత్నాల ఫ్యాషన్‌లో పటాకా మోడ్ ఆన్ చేసే రంగురంగుల మణుల దండ! ఎరుపు, పచ్చ, గులాబీ, ముత్యాలు అన్నీ ఒక్కటే లైఫ్‌లో మెరిసిపోతూ, ‘నిన్ను చూడగానే దేవతా వైబ్ వచ్చిందమ్మా!’ అని చెప్పించే మ్యాజిక్ ఇది.
ఏ రంగు చీర వేసుకున్నా ఈ మల్టీకలర్డ్ నెక్లెస్ ఆటోమేటిక్‌గా మ్యాచ్ అయిపోతుంది. నలుపు చీర వేసుకుంటే నయగారంగా, పసుపు చీర వేసుకుంటే పండుగలా మారిపోతుంది! జుట్టు బన్ వేసుకుంటే ఈ నెక్లెస్ మెడ చుట్టూ మెరిసిపోతూ లుక్‌ను హైలైట్ చేస్తుంది.
ఓపెన్ హెయిర్ అయితే కంఫర్ట్ ఫీల్‌తో కూల్ లుక్ ఇస్తుంది. చెవుల్లో చిన్న జుంకాలు పెయిర్ చేస్తే లుక్‌కి ఫుల్ మార్క్స్. లిప్ కలర్‌ని నెక్లెస్‌లోని ఏదో ఒక స్టోన్ షేడ్‌కి మ్యాచ్ చేస్తే ఇక మీ లుక్ సూపర్‌హిట్ అనిపించక మానదు.


