 
													ఒకేసారి రెండు స్కిల్స్‌ని ప్రదర్శించడం మాటలు కాదు. అది కూడా సంగీతాన్ని, స్మిమ్మింగ్‌ని మిళితం చేస్తూ..ప్రదర్శించడానికి ఎంతో ప్రాక్టీస్ ఉండాల్సిందే. లేదంటే నీటిలో తేలుతూ..సంగీత వాయిద్యా పరికరాలను వాయించడం అంత సులువు కాదు. అదికూడా రివర్స్(బ్యాక్ స్టోక్)తో ఈత కొడుతూ వాయిద్యడం అంత ఈజీ కాదు. కానీ ఈ యువకుడు ఆ అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రికార్డు సృష్టించాడు.
ఈ ఘనతను సృష్టించింది బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మ్యూజిక్ టీచర్ రూబెన్ జాసన్ మచాడో. మంగళూరులోని సెయింట్ అలోసియస్ కాలేజ్ స్విమ్మింగ్ పూల్‌లో 700 మీటర్లకు పైగా వెనుకకు(బ్యాక్‌స్ట్రోక్) ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ ఈ 30 ఏళ్ల సంగీతకారుడు ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. ఉదయం పదిగంటలకు బ్యాక్‌స్ట్రోక్ ప్రదర్శనను ప్రారంభించి..150 మీటర్లు వరకు ఈత కొడితే చాలన్నుకున్నాడట.
కానీ అనుహ్యంగా 700 మీటర్ల వరకు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(GBWR)లకెక్కాడు. ఈ మేరకు GBWR రూబెన్‌కి అధికారిక సర్టిఫికేట్‌ను అందజేసింది. తన తండ్రి సూచన మేరకు ఈ వినూత్న రికార్డుని ప్రయత్నించానని చెబుతున్నాడు రూబెన్ జాసన్
ఎవరీ రూబెన్ జాసన్..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ సేఫ్టీ (NIWS) ధృవీకరించిన లైఫ్ సేవర్ రూబెన్‌కు హిందూస్తానీ, వెస్ట్రన్ ఫ్లూట్ రెండింటిలోనూ ప్రావీణ్యం ఉంది. అలాగే సాక్సోఫోన్, గిటార్, వంటి ఇతర వాయిద్యాలను వాయించడంలో దిట్ట. ఇక ఆయన బాలీవుడ్, శాండల్‌వుడ్, కోస్టల్  చిత్రాలలో పలు పాటలకు సంగీతం సమకూర్చారు. 
అంతేగాదు భారతదేశం అంతటా అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చారు కూడా. ఆయన 2016 వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌లో కూడా పాల్గొన్నాడు. ఇక రూబెన్‌కు ఈ ఫ్లూట్ ప్రదర్శనలో సుమారు 15 ఏళ్లకు పైగా అనుభవం ఉండటం విశేషం.
(చదవండి: ఎవరీ అయ్యలసోమయూజుల లలిత..? 'స్పెషల్ కేసు'గా ఆ మినహాయింపు..)
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
