breaking news
Pragya Jaiswa
-
‘అమెరికా’ జర్నీ వాయిదా!
ఆచారి అమెరికా యాత్ర వాయిదా పడింది. ఈ నెల 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలరీత్యా వేసవికి వాయిదా పడినట్లు హీరో మంచు విష్ణు ట్విట్ చేశాడు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు మంచు విష్ణు సోమవారం తన ట్విటర్ అకౌంట్లో పేర్కొన్నాడు. అయితే కారణాలు మాత్రం వెల్లడించలేదు. దేనికైనా రెడీ, ఆడోరకం ఈడోరకం లాంటి వినోదాత్మక చిత్రాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. అంతేకాకుండా బ్రహ్మానందం చాలా కాలంగా కమెడియన్గా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. మళ్లీ ఈ సినిమాతో తనేంటో చూపించాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఈ సినిమా వాయిదా పడింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించిగా, సింగం3 అనూప్ సింగ్ థాకూర్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. -
లైన్ నచ్చితేనే కథ వింటానన్నా!
– హీరో మనోజ్ మిర్చి యార్డులోని ఆ కుర్రాడి కొట్టుడు చూసి... వీడెవడు గుంటూరు ఘాటు మిరపకాయ్ అమ్మా మొగుడిలా ఉన్నాడని అక్కడున్నవాళ్లు అంటారు. ఆ కుర్రాడు ‘నేను కొడితే ఒంట్లోని 206 ఎముకలు ఒకేసారి విరిగిపోతాయ్’ అని వార్నింగ్లు ఇస్తున్నాడు. అతడి కథేంటో ‘గుంటూరోడు’లో చూడాలి మరి! మంచు మనోజ్, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో శ్రీవరుణ్ అట్లూరి నిర్మిస్తున్న సినిమా ‘గుంటూరోడు’. సోమవారం టీజర్ విడుదల చేశారు. మనోజ్ మట్లాడుతూ – ‘‘నాకు కొత్త కథలంటే ఆసక్తి. సత్య పక్కా కమర్షియల్ సినిమా చేద్దామన్నాడు. లైన్ నచ్చితేనే కథ వింటానన్నా. అందమైన ప్రేమకథకు మాస్ కమర్షియల్ అంశాలు జోడించి మంచి కథ చెప్పాడు. సినిమాను కూడా అద్భుతంగా తీశాడు. నిర్మాత వరుణ్ నా స్నేహితుడే. నిర్మాణంలో రాజీ పడలేదు’’ అన్నారు. ‘‘మనోజ్ ప్రేమించి చేసిన చిత్రమిది. టీజర్ కంటే ట్రైలర్ బాగుంటుంది. సినిమా అంత కంటే బాగుంటుంది’’ అన్నారు ఎస్.కె. సత్య. ‘‘జనవరి నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు శ్రీవరుణ్ అట్లూరి. దర్శకులు బాబీ, కాశీ విశ్వనాథ్, నిర్మాత అనిల్ సుంకర, చిత్ర సంగీత దర్శకుడు శ్రీవసంత్ పాల్గొన్నారు.