మహిళా క్రికెటర్లకు నీతా అంబానీ స్పెషల్‌ విషెస్‌ : సింపుల్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌లో | Nita Ambani congratulates Indian women cricket team on World cup win | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెటర్లకు నీతా అంబానీ స్పెషల్‌ విషెస్‌ : సింపుల్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌లో

Nov 3 2025 11:46 AM | Updated on Nov 3 2025 12:47 PM

Nita Ambani congratulates Indian women cricket team on World cup win

వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 (ICC Womens World Cup 2025) భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించింది.  దక్షిణాఫ్రికా-ఇండియా జట్ల మధ్య నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో  ఆదివారం జరిగిన తొలి ప్రపంచ కప్ ట్రోఫీని భారత మహిళా క్రికెట్ జట్టు గెలుచుకున్న సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ క్రికెట్‌ ప్రేమికురాలు,  ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీఅభినందనలు తెలిపారు.దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసినందుకు జట్టుకు కృతజ్ఞతలు  తెలిపారు నీతా. 

హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌ను తిలకించడానికి  వచ్చిన నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  టీమిండియా మహిళల ప్రపంచ కప్ సాధించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జట్టుకు ప్రత్యేక అభినంనదనలు తెలిపారు. అర్ధరాత్రి వేళ, మన అమ్మాయిలు మొట్టమొదటి ఐసీసీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. ధైర్యం, దృఢ నిశ్చయం, ఆత్మవిశ్వాసంతో ఆడిన తీరుతో, మొత్తం దేశాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశారని భావిస్తున్నాఅన్నారు. మీ విజయం పట్ల చాలా గర్వపడుతున్నాం. ధన్యవాదాలు, జై హింద్  అని ఉత్సాహంగా చెప్పారు. 

 రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు , చైర్‌పర్సన్ నీతా అంబానీ  మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు భారత జెండాను ఊపుతూ, జట్టుకు ఉత్సాహపరుస్తూ, అమ్మాయిలు ప్రపంచ కప్ గెలుచుకోగానే పట్టరాని సంతోషంగా కనిపించారు.  మ్యాచ్‌ ఆద్యంత ఆమె ఎంజాయ్‌ చేసిన ఫోటోలు, వీడియోలు  నెట్టింట తెగ సందడి మారాయి. 

 

 సింపుల్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌
సింపుల్‌ అండ్‌  స్టైలిష్ దుస్తులలో నీతా అంబానీ అదరగొట్టారు. సమయానికి తగ్గట్టు అన్నట్టగా  క్లాసిక్ వైట్‌ షర్ట్‌ , నీలిరంగు డెనిమ్ జీన్స్‌లో మెరిసారు. అలాగే విలాసవంతమైన బంగారు బ్రాస్‌లెట్ వాచ్, భారీ డైమండ్ సెంటర్ స్టోన్‌ పొదిగిన స్టేట్‌మెంట్ గోల్డ్ రింగ్, డైమండ్ ఇయర్ స్టడ్‌లను ఆమె ఎంచుకున్నారు.


ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రపంచ కప్‌  ఫైనల్‌ పోరుకు ఆకాష్ అంబానీ  కూడా హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్,  భార్యతో కలిసి రోహిత్ శర్మ, ఇతర టీమిండియా మాజీ క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఆదివారం జరిగిన  మ్యాచ్‌లో ఇండియా మహిళల సేన  దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి  టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement