న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ గెలిచి, చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టును దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అభినందించారు. ప్రపంచ కప్ గెలిసి చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారంటూ జట్టు సభ్యులను ప్రశంసించారు.
#WATCH | Harmanpreet Kaur, the Captain of the World Cup-winning Indian Women's Cricket Team, presents the team jersey to President Droupadi Murmu at Rashtrapati Bhavan in Delhi pic.twitter.com/iAKDtEaYc7
— ANI (@ANI) November 6, 2025
ఇదీ చదవండి: స్కిన్ కేర్‌పై క్రికెటర్ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?
గురువారం రాష్ట్రపతి భవన్‌లో మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విజేతలను ద్రౌపది ముర్ము కలిశారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీడాకారులందరూ సంతకం చేసిన జట్టు జెర్సీని ఆమెకు అందజేశారు. ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేశారు. ఆ బృందం బుధవారం ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసింది.
ఇదీ చదవండి: తండ్రి త్యాగం, కొడుకు సర్‌ప్రైజ్ : నెటిజనుల భావోద్వేగం
కాగా ఆదివారం నవీ ముంబైలో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్ మహిళా క్రికెట్‌లో తొలి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.


