ఎట్ హోం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి, పొన్నం, సీతక్క, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి
రాష్ట్రపతి తేనీటి విందుకు గవర్నర్, సీఎం తదితరుల హాజరు
సాక్షి, హైదరాబాద్: బోల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ఎట్ హోం కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. శీతాకాల విడిది కోసం ఈనెల 17న రాష్ట్ర పర్యటనకు వచ్చినన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఇచ్చినన తేనీటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము అతిథులను పలుకరిస్తూ సందడి చేశారు. కార్యక్రమ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ వారితో మాట్లాడారు.
కిన్నెర మొగిలయ్యను ఆప్యాయంగా పలకరించడంతో పాటు కిన్నెర వాయిద్యాన్ని వాయించాలని కోరారు. కాగా మంత్రులను, ఇతర ప్రముఖులను రాష్ట్రపతికి సీఎం పరిచయం చేశారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.


