స్కిన్‌ కేర్‌పై క్రికెటర్‌ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా? | Harleen Deol Asks PM Modi About His Skincare Secret During ICC Women’s WC Meet | Sakshi
Sakshi News home page

స్కిన్‌ కేర్‌పై క్రికెటర్‌ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?

Nov 6 2025 12:34 PM | Updated on Nov 6 2025 1:18 PM

 Cricketer Harleen Kaur Deol aks PM Modi about his secret skincare routine know what PM said

న్యూఢిల్లీ: భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు.  భారత్‌కు ఘన విజయాన్ని అందించిన  కెప్టెన్‌ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను  ప్రధాని అభినందించారు. అలాగే టోర్నమెంట్ ఆరంభంలో ఎదురైన ఎదురుదెబ్బలు, ఆన్‌లైన్ ట్రోలింగ్‌ల గురించి ప్రస్తావిస్తూ, వాటన్నింటినీ  తట్టుకుని నిలబడి అద్భుతమైన విజయాన్ని అందించారంటూ వారిని మోదీ ప్రశంసించారు.

అయితే  ఈ ఉత్సాహభరితమైన సంభాషణల మధ్యలో  క్రికెటర్ హర్లీన్ కౌర్ డియోల్  మోదీని అడిగిన ప్రశ్న నెట్టింట ఆసక్తికరంగా మారింది. తన రహస్య చర్మ సంరక్షణ దినచర్య గురించి ప్రధాని మోదీని  ఆమె ప్రశ్నించింది. దీనికి  ప్రధాని ఏమి సమాధానం ఇచ్చారో  తెలుసా?  (ఇన్‌ఫ్లూయెన్సర్‌ హఠాన్మరణం : షాక్‌లో ఫ్యాన్స్‌)

 ఇంత  షైనీగా, యవ్వనంగా కనిపించే ఆయన   చర్మ సౌందర్య వెనుక సీక్రెట్‌  ఏంటి అంటూ  స్టార్ బ్యాటర్ ప్రధాని మోదీని అడిగింది. దానికి ప్రధాని చిరునవ్వుతో స్పందిస్తూ, చర్మ సంరక్షణ లేదా వస్త్రధారణపై తాను ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ చూపలేదన్నారు. ప్రత్యేకంగా ఏమీ చేయను. దాదాపు  పాతికేళ్లుగా  ప్రభుత్వ పాలనలో మునిగి ఉన్నా, ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలే శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతానని చెప్పారు. దీంతో అక్కడంతా అభిమానంతో చప్పట్లు మారుమోగాయి. నవ్వులు విరబూశాయి.  (మమ్దానీ లవ్‌ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్‌ యువరాణి డయానా)

అలాగే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2017లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత ప్రధాని మోదీని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ట్రోఫీతో వచ్చినందున ప్రత్యేకంగా అనిపించిందన్నారు. "భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలతో మిమ్మల్ని కలుస్తూనే ఉండాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేవారు. ప్రధాన మంత్రి మోదీ ప్రోత్సాహం తమకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చిందని, ఆయన స్థిరమైన మద్దతు, సాధికారత చొరవ కారణంగా దేశవ్యాప్తంగా మహిళలు వివిధ రంగాలలో రాణిస్తున్నారని వైస్-కెప్టెన్ స్మృతి మంధాన ప్రశంసించారు. మహిళా క్రికెట్‌ టీం గురువారం  దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కలవనున్నారు.

ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement