అతనికి ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే ఇష్టం. అంతేకాదు తాను చూసిన అద్బుతాలను విశేషాలను తన అభిమానులతో పంచుకోవడం అంటే మరీ మరీ ఇష్టం. అలా పాపులర్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్‌గా సోషల్ మీడియాలో మంచి పేరుతెచ్చుకున్నాడు. 10 లక్షలకుపైగా ఫాలోయవర్లతో ఇన్‌స్టాలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకడిగా మారాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, దురదృష్టవశాత్తు, 32 ఏళ్లకే ఆయన ప్రయాణం ఆగిపోయింది. కానీ తుదిశ్వాస వరకు ఆసక్తిగల ప్రయాణికుడిగానే ఉన్నాడు. ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, దుబాయ్‌కు చెందిన, అనునయ్ సూద్ ఇక లేరన్న వార్త నెటిజనులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
32 ఏళ్ల అనునయ్ సూద్ ఆకస్మికంగా మరణించారన్న వార్తను ఆయన కుటుంబం గురువారం తెల్లవారుజామున అతని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. అయితే, ఆయన మరణానికి కారణాలను వెల్లడించలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చనిపోయే సమయానికా అనునయ్ లాస్ వెగాస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడి
ఎవరీ అనునయ్ సూద్
అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్, ఇన్‌స్టాగ్రామ్‌లో1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 3.8 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఆయన సొంతం. ప్రపంచవ్యాప్తంగా పలుసందర్శనా స్థలాలకు సంబంధించి ఎంతో మంచి ట్రావెల్ కంటెంట్, అద్భుతమైన ట్రావెల్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ రీల్స్, వ్లాగ్స్‌తో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. 2022 -2024 వరకు వరుసగా మూడేళ్లు ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న అనునయ్ సూద్‌ది. లాస్ వెగాస్‌లో స్పోర్ట్స్ కారు నడుపుతూ పెట్టిన పోస్ట్ ఆయన చివరి పోస్ట్.


