బిర్లా కుటుంబ వారసుడు, పారిశ్రామికవేత్త యశోవర్ధన్ (యష్) బిర్ల , అవంతిక బిర్లా బిర్లా కుమారుడు వేదాంత్ బిర్లా (33) మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. ముంబైలో మలబార్ హిల్‌లోని బిర్లా నివాసంలో సంజీవ్ -సుప్రియా కులకర్ణిల కుమార్తె తేజల్ కులకర్ణిని వివాహం చేసుకున్నాడు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సమక్షంలో కుమార మంగళం బిర్లా ,ఆయన భార్య నీర్జా బిర్లా దగ్గరుండి ఈ వివాహ వేడుకను జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.
ఈ వెడ్డింగ్ వేడుక కోసం, తేజల్ హ్యాండ్‌మేడ్ బంధాని , సబ్యసాచి రెడ్ లెహంగాలో అందంగా కనిపించింది అద్దాలు, ముత్యాలు, సాంప్రదాయ మరోడి పనితనంతో సున్నితంగా ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఈ లెహెంగాకు వజ్రాల ఆభరణాలతో జత చేసింది, అందులో నెక్లెస్, మాంగ్ టేకు, నాథ్, సరిపోలే చెవిపోగులు, స్వల్ప మేకప్‌తో పెళ్లికళ ఉట్టిపడేలా కనిపించింది. వేదాంత్ తెల్లటి బంధ్‌గాలాలో మ్యాచింగ్ టర్బన్‌తో ముస్తాబయ్యారు.

వివాహం తర్వాత సెయింట్ రెగిస్‌లో స్టార్-స్టడెడ్ రిసెప్షన్ జరిగింది.సన్నిహిత బంధువులు, స్నేహితులు, పారిశ్రామికవేత్తలు, ముంబైలోని ఇతర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తేజల్ : విజిలింగ్ వుడ్స్ గ్రాడ్యుయేట్ , ఏజిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకురాలు, తేజల్ వ్యాపారంలో తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. సుభాష్ ఘాయ్ స్థాపించిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ నుండి డిప్లొమా ఇన్ ఫిల్మ్ స్టడీస్‌తో తేజల్ తన విద్యా ప్రయాణాన్ని ప్రారంభించింది. సినిమాలు, కథలు మీద ఆసక్తి ఉన్నప్పనటికీ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుండి బిజినెస్ అండ్ మేనేజిరియల్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ చేసింది, తరువాత పొలిటికల్ సైన్స్ అండ్ గవర్నమెంట్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది.ప్రొడక్షన్ అసిస్టెంట్ నుండి ఒక కంపెనీ సహ వ్యవస్థాపకురాలిగా తనను తాను తీర్చిదిద్దుకుంది.

వేదాంత్ బిర్లా దేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన వేదాంత్ బిర్లా పారిశ్రామికవేత్త యశోవర్ధన్ (యశ్) బిర్లా మరియు అవంతి బిర్లాల ఏకైక కుమారుడు. వేదాంత్ ప్రస్తుతం బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్‌లో బోర్డు ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ముంబైలోని కాంపియన్ స్కూల్‌లో పాఠశాల విద్యను, BD సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్నేషనల్ బాకలారియేట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశాడు. ఆతరువాత, HR కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి అకౌంటింగ్ మరియు ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. అలాగే UK లోని RBS కాలేజ్ నుండి జనరల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివాడు.
ఊర్వశి రౌతేలా , నీల్ నితిన్ ముఖేష్ ,పూనమ్ ధిల్లాన్, నీలం కొఠారి, భూమి పెడ్నేకర్, సీమా సజ్దే వరకు లాంటి సినీ ప ప్రముఖులతోపాటు, ఆదర్ జైన్, అనిస్సా మల్హోత్రా జైన్,అర్మాన్ జైన్,ఆదిత్య సీల్,అనుష్క రంజన్, ఇంకా మహారాష్ట్ర రాజకీయ ప్రముఖులు - ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే,ఆదిత్య ఠాక్రే కూడా హాజరయ్యారు.



