మంచి ఉద్యోగం సంపాదించి, ఖరీదైన కారు తెచ్చి, ఇంటిముందు నిలిపి, గర్వంగా ఈ కారు నీదే నాన్నా చెప్పాలనే డ్రీమ్ దాదాపు పిల్లలందరికీ ఉంటుంది. తన చదువు, ఉన్నతి కోసం కష్టపడిన తండ్రి రుణం తీర్చుకోవాలనేది వారి ఆశ. అలా బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఉద్యోగి తన తండ్రిని సర్ ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
టూవీలర్ మీదే ఎక్కువ జీవితాన్ని గడిపేసిన తన తండ్రి సుఖం కోసం సరికొత్త టాటా పంచ్‌ను బహుమతిగా ఇచ్చాడు సత్యం పాండే అనే ఐటీ ఉద్యోగి. ఇన్నేళ్ల ఆయన కృషి , త్యాగానికి ప్రతిఫలంగా అభివర్ణించాడు.
🥹❤️🙏🏽 https://t.co/Bv7xYPesQk pic.twitter.com/Y3gDOAOpQb
— Satyam Pandey (@fittwithsatyam) November 5, 2025
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇటీవల తన తండ్రిని కారుతో ఆశ్చర్యపరిచాడు, మరియు ఈ ప్రక్రియలో వేలాది మంది ఇంటర్నెట్ అపరిచితులను భావోద్వేగానికి గురిచేశాడు. పాట్నా సివిల్ కోర్టులో సహాయకుడిగా పనిచేసే తన తండ్రి ముగ్గురు పిల్లల చదువు, సంక్షేమం కోసం, కొన్ని సౌకర్యాలను త్యాగం చేశాడని ,ముఖ్యంగా 14 ఏళ్లనుంచి హీరో హోండా స్ప్లెండర్‌తోనే గడిపాడని చెప్పాడు సత్యం. ముగ్గురు పిల్లల్లో పెద్దవాడిగా, తమ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుననీ, తమది సాధారణ దిగువ-మధ్యతరగతి కుటుంబం, డబ్బు ప్రాముఖ్యత నేర్పించారని గుర్తు చేసుకున్నాడు. తనకు 14 యేళ్ల వయసులోతండ్రి బక్సర్‌లో పనిచేసేవాడు. కుటుంబం పాట్నాలో ఉండేది . 120 కి.మీ. దూరం ప్రతిరోజూ జిల్లా కోర్టులో పని కోసం రైలులో ప్రయాణించేవాడు. తెల్లవారకముందే వెళ్లి, రాత్రి ఆలస్యంగా తిరిగి వచ్చేవార, తన చదువు కోసం చాలా కష్టపడ్డారంటూ ఆయనకు కృతజ్ఞత తెలిపారు.

కాగా బిట్స్-పిలానీ నుండి పట్టభద్రుడయ్యాక, సత్యంపాండే, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. దీంతపాటు ఫిట్‌నెస్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. తద్వారా తన ఎడ్యుకేషన్ లోన్‌ను తీరుస్తున్నాడు. అలాగే MBBS డిగ్రీ చదువుతున్న తన చెల్లెలికి కూడా మద్దతు ఇస్తాడు. ఇపుడిక తండ్రి కోసం కారు కొనాలని కలలు కన్నాడు. అంతేకాదు చిన్ని చిన్న యాక్సిడెంట్లనుంచి తండ్రి తప్పించుకున్నపుడు తనకు చాలా భయం వేసిందని, అందుకే బడ్జెట్‌లో, సేప్టీలో మెరుగైన టాటా పంచ్ కొన్నానని తెలిపాడు. ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు సత్యంను అభినందిస్తున్నారు. ప్రతీ కొడుకు కల ఇదే కదా , అభినందనలుబ్రో అంటూ కమెంట్ చేయడం విశేషం


