breaking news
women world cup
-
దివ్యమైన విజయం
అంతర్జాతీయ చదరంగ వేదికపై మరోసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి దివ్య దేశ్‌ముఖ్ రూపంలో తొలిసారి చాంపియన్ ఆవిర్భవించింది. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న క్రీడాకారిణులు బరిలో ఉండటం... ఫేవరెట్ ముద్ర లేకపోవడం... 19 ఏళ్ల ఈ మహారాష్ట్ర అమ్మాయికి కలిసొచ్చింది. ఫలితంగా... ఆరంభం నుంచి స్వేచ్ఛగా ఆడుతూ... అందరి అంచనాలను తారుమారు చేస్తూ... మేధో క్రీడలో ఏకాగ్రతతో ఆడితే... పక్కా ప్రణాళికతో చకచకా ఎత్తులు వేస్తే... ప్రత్యర్థి ఎంతటి మేధావి అయినా... ఒకానొక దశలో ఒత్తిడికి గురై అనవసర తప్పిదాలు చేస్తారని.... చివరకు చేతులెత్తేస్తారని... దివ్య తన అద్భుతమైన ఆటతీరుతో నిరూపించింది. వెరసి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకే గెలుపుతో... దివ్య స్వర్ణ పతకాన్ని దక్కించుకోవడంతోపాటు...మరోవైపు ఊహ కందని విధంగా గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను కూడా ఖాయం చేసుకోవడం విశేషం. బతూమి (జార్జియా): అనుభవంపై యువతరం గెలిచింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీలో భారత్‌కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం), 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ విజేతగా అవతరించింది. రెండు సార్లు ర్యాపిడ్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా దిగ్గజ చెస్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, 38 ఏళ్ల కోనేరు హంపితో జరిగిన ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్ ఓవరాల్‌గా 2.5–1.5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం క్లాసికల్ ఫార్మాట్లో నిరీ్ణత రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ నిర్వహించారు. ర్యాపిడ్ ఫార్మాట్లో 15 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు జరిగాయి. తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన దివ్య 81 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో టైబ్రేక్‌లో తొలి గేమ్ ముగిశాక ఇద్దరూ 0.5–0.5తో సమంగా నిలిచారు. రెండో గేమ్‌ను హంపి తెల్ల పావులతో ప్రారంభించింది. ఒకానొక దశలో ఈ గేమ్ కూడా ‘డ్రా’గా ముగిసేలా అనిపించింది. చాంపియన్‌ను నిర్ధారించేందుకు మరో రెండు ర్యాపిడ్ గేమ్‌లు అవసరం పడతాయనిపించింది. అయితే సమయాభావం వల్ల కీలక దశలో హంపి ఒత్తిడికిలోనై పొరపాట్లు చేయడం... వాటిని దివ్య సది్వనియోగం చేసుకుంది. ఫలితంగా రెండో గేమ్‌లో దివ్య 75 ఎత్తుల్లో గెలుపొంది 1.5–0.5తో విజయాన్ని ఖాయం చేసుకుంది. టైబ్రేక్‌లో తొలి రెండు ర్యాపిడ్ గేముల్లోనే విజేత తేలిపోవడంతో తదుపరి గేమ్‌లు నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఈ గెలుపుతో ప్రస్తుతం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) టైటిల్‌తో ఉన్న దివ్యకు గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్ ఖాయమైంది. విజేత దివ్య దేశ్‌ముఖ్‌కు స్వర్ణ పతకంతోపాటు 50 వేల డాలర్లు (రూ. 43 లక్షల 38 వేలు)... రన్నరప్ హంపికి రజత పతకంతోపాటు 35 వేల డాలర్లు (రూ. 30 లక్షల 36 వేలు)... మూడో స్థానం పొందిన చైనా గ్రాండ్‌మాస్టర్ టాన్ జోంగికి కాంస్య పతకంతోపాటు 25 వేల డాలర్లు (రూ. 21 లక్షల 68 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గాలివాటమేమీ కాదు... 46 దేశాల నుంచి మొత్తం 107 మంది ప్లేయర్లు పోటీపడ్డ ఈ ప్రపంచకప్ నాకౌట్ టోర్నీలో 2463 రేటింగ్ పాయింట్లు ఉన్న దివ్య 15వ సీడింగ్‌తో బరిలోకి దిగింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ నాగ్‌పూర్ అమ్మాయి టైటిల్ గెలిచే క్రమంలో తన కంటే ఎంతో మెరుగైన రేటింగ్ పాయింట్లు, గ్రాండ్‌మాస్టర్ హోదా ఉన్న నలుగురు ప్లేయర్లను ఓడించి ఈ విజయం గాలివాటమేమీ కాదని నిరూపించుకుంది. ఫైనల్లో హంపి (2543 రేటింగ్ పాయింట్లు), సెమీఫైనల్లో టాన్ జోంగి (చైనా; 2546), క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్; 2483), ప్రిక్వార్టర్ ఫైనల్లో జు జినెర్ (చైనా; 2547 రేటింగ్)లపై దివ్య గెలిచింది. దివ్య 2005లో జన్మించగా... హంపి 2002లోనే గ్రాండ్‌మాస్టర్ హోదా పొందింది. ఇప్పటికి రెండుసార్లు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ (2019లో, 2024లో) నిలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో హంపినే ఫేవరెట్ అనుకున్నారంతా... కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అద్భుత విజయంతో ‘దివ్య’మైన చెస్ ప్రపంచాన్ని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన వెంటనే దివ్య తన భావోద్వేగాన్ని తల్లితో పంచుకుంది. డాక్టర్ల ఫ్యామిలీ నుంచి... దివ్య తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్ముఖ్లిద్దరూ డాక్టర్లు. 2005 డిసెంబర్ 5న నాగ్‌పూర్‌లో జన్మించిన దివ్య ఐదేళ్ల ప్రాయంలో చెస్‌లో అడుగు పెట్టింది. దివ్య సోదరి బ్యాడ్మింటన్ శిక్షణకు వెళుతున్న సమయంలో అక్కడే జరుగుతున్న చెస్ శిబిరంలో దివ్య చేరింది. ఆ తర్వాత చెస్‌పై మక్కువ ఏర్పడటంతో ఆటను సీరియస్‌గా తీసుకుంది. 2020లో ఆన్లైన్లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న దివ్య 2021లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా పొందింది. ఆ తర్వాత 2022లో జాతీయ చాంపియన్‌గా నిలిచింది. 2022 చెస్ ఒలింపియాడ్‌లో వ్యక్తిగత కాంస్య పతకం... 2023లో ఆసియా చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. 2023లోనే జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో హారిక, హంపి, సవితాశ్రీ, వంతిక అగర్వాల్, ఇరీనా క్రష్లను ఓడించిన దివ్య వరల్డ్ చాంపియన్ జు వెన్జున్తో, అనా ఉషెనినాతో గేమ్‌లు ‘డ్రా’ చేసుకొని టోర్నీ విజేతగా నిలిచింది. 2024లో గాంధీ నగర్లో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గిన దివ్య... హంగేరిలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టుకు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వ్యక్తిగత విభాగంలోనూ ఆమె బంగారు పతకాన్ని సాధించింది.ప్రస్తుత వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ అయిన హంపి ఓటమి ఊహించలేనిది. ఎండ్గేమ్లో ఆమె వరుసగా తప్పులు చేసింది. 54వ ఎత్తులో చిన్న పొరపాటు చేసి హంపి వెనుకబడినా... ఆమెకు కోలుకునే అవకాశం కూడా వచి్చంది. అయితే సమయాభావ ఒత్తిడి ఆమెపై ప్రభావం చూపించింది. 67వ ఎత్తు వేసే సమయానికి దివ్యకు సానుకూల పరిస్థితి ఏమీ లేదు. దీనిని హంపి జాగ్రత్తగా వేసి ఉంటే గేమ్ డ్రా వైపు వెళ్లేది. కానీ ఇక్కడే హంపి మళ్లీ మరో పెద్ద తప్పు చేసింది. కొత్త తరానికి ప్రతినిధి అయిన దివ్య కొత్తగా నేర్చుకోవడంలో, దూసుకుపోవడంలో సహజంగానే కాస్త ఎక్కువ చురుకుదనాన్ని ప్రదర్శించింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన హంపిని ఎదుర్కొనేందుకు దివ్య పక్కాగా కొత్త ప్రణాళికలతో సిద్ధమై వచ్చినట్లు కనిపించింది. –చంద్రమౌళి, ఇంటర్నేషనల్ చెస్ ఆర్బిటర్ -
మూడో రౌండ్లో వంతిక
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి వంతిక అగర్వాల్ మూడో రౌండ్లోకి ప్రవేశించగా... పద్మిని రౌత్, ప్రియాంక రెండో రౌండ్లోనే ని్రష్కమించారు. ప్రపంచ మాజీ చాంపియన్ అన్నా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన రెండో రౌండ్లో వంతిక 4.5–3.5తో విజయం సాధించింది. గురువారం రెండో రౌండ్లో రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్‌లో వంతిక 3.5–2.5తో గెలిచింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో పద్మిని 3.5–4.5తో ఓడిపోయింది. గురువారం రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించగా... కొస్టెనిక్ 3.5–2.5తో పద్మినిని ఓడించింది. కులోన్ క్లౌడియా (పోలాండ్)తో జరిగిన పోటీలో ప్రియాంక 1–3తో ఓటమి పాలైంది. నేడు జరిగే మూడో రౌండ్ తొలి గేమ్‌లలో కులోన్ క్లౌడియాతో కోనేరు హంపి; టియోడొరా ఇంజాక్ (సెర్బియా)తో దివ్య దేశ్‌ముఖ్; కాటరీనా లాగ్నోతో వంతిక; స్టావ్రూలాతో ద్రోణవల్లి హారిక; కరిస్సా యిప్తో వైశాలి తలపడతారు. -
టీ20 అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో జగజ్జేత భారత్
-
నాన్న కల నెరవేర్చింది
‘కలలు కనడం కష్టం కాదు. కాణీ ఖర్చు కాదు’ లాంటి వెటకారాల మాట ఎలా ఉన్నా.... ఆ కలలే భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.వందమందిలో ఒకరిగా ప్రత్యేకతతో వెలిగిపోయేలా చేస్తాయి. ‘నా కూతురు ఆడితే పరుగులు వెల్లువెత్తాల్సిందే’ ‘మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం... అంటూ నా కూతురు గురించి అందరూ ఘనంగా చెప్పుకోవాలి’... ఇలాంటి కలలు ఎన్నో కనేవాడు భద్రాచలానికి చెందిన రామిరెడ్డి.అయితే ఆయన కలలకు మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం తన కలల సాకారానికి ప్రయత్నించాడు. ఆ ఫలితమే స్టార్ క్రికెటర్... త్రిష గొంగడి(Trisha Gongadi). మలేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్ అండర్ 19, టీ 20 వరల్డ్ కప్(Women World Cup)లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి రామిరెడ్డి క్రికెట్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశించినా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల నెరవేరలేదు. దీంతో ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తూనే పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించేవాడు. ‘మా అమ్మాయిని బాగా చదివించాలి’... అనేది సగటు తండ్రి కోరిక.రామిరెడ్డి మాత్రం అలా కాదు... ‘మా అమ్మాయిని బాగా ఆడించాలి. క్రికెట్లో స్టార్‌ని చేయాలి’ అనుకునేవాడు. సినిమాలు, కామేడీ షోలు కాకుండా టీవీలో క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ ఎక్కువగా చూపించేవాడు. చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల బ్రెయిన్, మజిల్స్ ఆటకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతాయని ఫిటెనెస్ ట్రైనర్‌గా ఆయన బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చిన్నతనం నుంచే త్రిష క్రికెట్లో ప్రతిభ కనబరిచేది. దీంతో తన కల విషయంలో మరింత పట్దుదల పెరిగింది. కూతురిని ప్రోఫెషనల్ క్రికెటర్‌గా చూడాలనే లక్ష్యంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు రామిరెడ్డి. అప్పుడు త్రిష వయసు ఏడేళ్లు. సికింద్రాబాద్‌లోని ‘సెయింట్ జాన్ ్స క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకునేది.ఎంతో ఆశ... చివరికి నిరాశ!్రపోఫెషనల్ ట్రైనింగ్‌లో ఆరితేరిన త్రిష పన్నెండేళ్ల వయస్సులో హైదరాబాద్ అండర్ 19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్ 19 ఇండియా తరఫున సౌత్ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్ర పోషించింది. అయితే త్రిషకు ఈ టోర్నీలో ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. ఆ ఫలితం ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో స్పష్టంగా కనిపించింది. విమెన్ ఐపీఎల్ వేలంలో త్రిషాను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. అ గెలుపులో తాను ఒకరిగా ఉండటం కంటే ‘గెలుపుకు మూలం’ అనిపించేలా ప్రదర్శన చేయాలనే పట్టుదల త్రిషలో పెరిగింది.ఇక చూస్కోండివిమెన్ ఐపీఎల్లో ఎదురైన చేదు అనుభవం ‘పవర్ హిట్టింగ్’పై పట్టు సాధించేందుకు త్రిషకు తోడ్పడింది. గత డిసెంబరులో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో వరుసగా 58 నాటౌట్, 32, 52 పరుగులు సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసిన త్రిష 230 పరుగులు సాధించింది. ఇందులో స్కాట్లాండ్పై చేసిన 110 నాటౌట్ సెంచరీ కూడా ఉంది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ సెంచరీతో అండర్ 19 టోర్నీలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీసింది.అందనంత ఎత్తులో...టోర్నీలో మిగతా అమ్మాయిలకు అందనంత ఎత్తులో బ్యాటింగ్ యావరేజ్ 76.77తో త్రిష కొనసాగుతోంది. ఆమె తర్వాత రెండోస్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ డావినా పేరిన్ ఉంది. ఈ టోర్నీలో రెండుసార్లు త్రిష 40కి పైగా స్కోర్లు సాధించింది. అయితే అప్పటికే ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించే అవకాశం త్రిషకు దక్కలేదు. కానీ స్కాట్ల్యాండ్తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో త్రిష బ్యాట్ నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ (53 బంతుల్లో) జాలువారింది. బ్యాటింగ్ యావరేజ్‌తో పాటు మోస్ట్ రన్స్, హయ్యెస్ట్ స్కోర్ విభాగంలోనూ త్రిష టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ మహిళల అండర్ 19 జట్టు సెమీస్‌కు చేరుకుంది.ఏజెన్సీప్రాంతం నుంచి మొదలైన త్రిష విజయపరంపర అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవిమెన్ వరల్డ్ కప్‌లో ఇండియాకు ఆడాలి అండర్ 19, విమెన్ టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. విమెన్ అండర్ 19 టోర్నీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇండియా మహిళల జట్టుకు ఎంపిక కావాలి. రాబోయే వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో నా పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చాను. నా లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నాను. – గొంగడి త్రిష -
టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై
ICC Under 19 Womens T20 World Cup 2023: అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో షఫాలీ వర్మ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాలో బుధవారం ‘సూపర్ సిక్స్’ దశ మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్–1లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. సెమీస్ చేరిన జట్లు ఇవే అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన భారత్ (+2.844), ఆస్ట్రేలియా (+2.210) సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఇక గ్రూపు- 2లో ఉన్న ఇంగ్లండ్ వెస్టిండీస్‌పై బుధవారం ఘన విజయం సాధించింది. 95 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఇదే గ్రూపులో ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే పాకిస్తాన్‌పై 103 పరుగుల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్ ఎప్పుడంటే ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 27) జరుగనున్న మొదటి సెమీస్ మ్యాచ్‌లో భారత్- న్యూజిలాండ్ తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో సెమీస్ విజేతల మధ్య ఆదివారం ఫైనల్ జరుగనుంది. కాగా ఈ మెగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకోలేక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ.. Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి! -
కీలకపోరులో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్
మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు నేడు పూల్ ‘బి’లో పటిష్టమైన న్యూజిలాండ్‌తో కీలక సమరానికి సిద్ధమైంది. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన గత రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గోల్‌కీపర్ సవితా పూనియా కెప్టెన్సీలో భారత్.. ఇంగ్లండ్‌తో, చైనాతో మ్యాచ్‌లను 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే... లేదంటే కనీసం ‘డ్రా’ చేసుకుంటేనే క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉంటాయి. -
World Cup 2022: ఎదురులేని ఆసీస్.. బంగ్లాను చిత్తు చేసి.. ఏడింటికి ఏడు గెలిచి
ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. మెగా ఈవెంట్లో ఆడిన ఏడింటికి ఏడు మ్యాచ్‌లు గెలిచి తిరుగులేని జట్టుగా అవతరించింది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించి అజేయ రికార్డును పదిలం చేసుకుంది. తద్వారా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో మెగ్ లానింగ్ బృందం నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్ కుదించిన నేపథ్యంలో 5 వికెట్ల తేడాతో గెలుపొంది బంగ్లాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా మహిళా జట్టు నిర్ణీత 43 ఓవర్ల(వరణుడి ఆటంకం)లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్ షర్మిన్ అక్తర్(24), లతా మొండల్(33) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆదిలో తడబాటు.. అయితే.. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలీసా హేలీ, రేచల్ హేన్స్ వరుసగా 15, 7 పరుగులకే నిష్క్రమించారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్ బ్యాటర్, కెప్టెన్ మెగ్ లానింగ్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో గట్టి షాక్ తగిలింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెత్ మూనీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. మూనీ అజేయ అర్ధ శతకంతో ఆసీస్ 32.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. బెత్ మూనీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు: బంగ్లాదేశ్- 135/6 (43) ఆస్ట్రేలియా 136/5 (32.1) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: పాక్‌ను చిత్తు చేసి.. టాప్-4లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్‌ను చిత్తు చేసి టాప్-4లోకి చేరి సెమీస్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకుంది. కాగా పాకిస్తాన్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆదిలోనే ఓపెనర్ నహీదా ఖాన్ అవుట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మరూఫ్ 9 పరుగులకే పెవిలియన్ చేరింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ అమీన్ 32 టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా వాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 105 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు స్టార్ ఓపెనర్ టామీ బీమౌంట్ 2 పరుగులకే నిష్క్రమించడం షాకిచ్చింది. అయితే మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్ ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చింది. మరో ఎండ్‌లో కెప్టెన్ హీథర్‌నైట్ సహకారం అందించడంతో 76 పరుగుల(68 బంతుల్లో- 11 ఫోర్ల సాయం)తో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌కు సునాయాస విజయం అందించింది. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌తో 19.2 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయి ఇంగ్లండ్ పాక్‌పై గెలుపొందింది. డానియెల్ వ్యాట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ మరో మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ స్కోర్లు: పాకిస్తాన్- 105 (41.3 ఓవర్లు) ఇంగ్లండ్- 107/1 (19.2 ఓవర్లు) View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై సంచలన విజయం.. వరల్డ్‌కప్ సూపర్ లీగ్ టాప్‌లో బంగ్లాదేశ్! టీమిండియా ఎక్కడ? View this post on Instagram A post shared by ICC (@icc) -
Women World Cup 2022: టీమిండియా రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్ మహిళా జట్టు
Women World Cup 2022- వెల్లింగ్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఆరో విజయం నమోదు చేసిన ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ రికార్డు సాధించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గిన మెగ్ లానింగ్ బృందం ఛేజింగ్‌లో భారత పురుషుల జట్టు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. కాగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (130 బంతుల్లో 135 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో 15 సెంచరీ సాధించి ఆసీస్‌ను విజయతీరానికి చేర్చింది. ఈ గెలుపుతో ఛేజింగ్‌లో 17 వరుస విజయాలతో టీమిండియా(భారత పురుషుల జట్టు) పేరిట ఉన్న రికార్డును ఆస్ట్రేలియా జట్టు తిరగరాసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అంతకుముందు దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది. లౌరా (90; 6 ఫోర్లు), సునె లుస్ (52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. కాగా ప్రపంచకప్-2022 టోర్నీలో ఇప్పటికే సెమీస్ చేరిన ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: వారెవ్వా.. కష్టమనుకున్న మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించిన కెప్టెన్!
Women's World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా దూసుకుపోతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ చేరిన మెగ్ లానింగ్ బృందం తాజాగా మరో విజయం నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఆరూ గెలిచి అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలుపుకొంది. View this post on Instagram A post shared by ICC (@icc) బౌలింగ్ ఎంచుకుని టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు లీ(36), వొల్వార్ట్(90) శుభారంభం అందించారు. కెప్టెన్ సునే లాస్ 52 పరుగులతో రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా జట్టు 271 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) మొదట తడబడినా.. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రేచల్ హేన్స్(17), అలీసా హేలీ(5) తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో మెగ్ లానింగ్ 130 బంతుల్లో 135 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును ముందుకు నడిపింది. లానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్ 45.2 ఓవర్లలో 5 వికెట్లు మిగిలి ఉండగానే విజయఢంకా మోగించింది. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన లానింగ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా ఆమెకు వన్డేల్లో ఇది 15వ సెంచరీ కావడం విశేషం. View this post on Instagram A post shared by ICC (@icc) -
అదరగొట్టిన భారత్.. బంగ్లాను చిత్తు చేసిన మిథాలీ సేన(ఫొటోలు)
-
World Cup 2022: అదరగొట్టిన మిథాలీ సేన.. బంగ్లాపై భారీ విజయంతో..
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. హామిల్టన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42)కు తోడు యస్తికా భాటియా అర్ధ శతకంతో రాణించడంతో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. అయితే, గత మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ మిథాలీ రాజ్(0) మరోసారి నిరాశపరిచింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షర్మీన్ అక్తర్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా.. 15 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో భారత బౌలర్లు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. దీంతో 40.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన 110 పరుగులతో సునాయాస విజయం సాధించి సెమీస్ మార్గాలను సుగమం చేసుకుంది. ఇక బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్ 2, జహనారా ఆలం ఒక వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా అత్యధికంగా 4 వికెట్లు తీసి సత్తా చాటింది. ఝులన్ గోస్వామికి రెండు, రాజేశ్వరీ గైక్వాడ్‌కు ఒకటి, పూజా వస్త్రాకర్‌కు రెండు, పూనమ్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇక అర్ధ శతకంలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తికా భాటియాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు: భారత మహిళా జట్టు: 229/7 (50) బంగ్లాదేశ్ మహిళా జట్టు: 119 (40.3) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం' -
World Cup 2022: నిరాశ పరిచిన మిథాలీ రాజ్.. రాణించిన మంధాన, షఫాలీ, యస్తికా
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత జట్టు మెరుగైన స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పరుగులు సాధించింది. కాగా హామిల్టన్ వేదికగా సాగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలీ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) శుభారంభం అందించారు. దీంతో 14 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. అయితే, బంగ్లా బౌలర్ నహీదా అక్తర్ మంధానను అవుట్ చేయగా.. రీతూ మోనీ వరుసగా రెండు వికెట్లు పడగొట్టింది. ఫామ్‌లో ఉన్న షఫాలీ వర్మను, కెప్టెన్ మిథాలీ రాజ్(0)ను పెవిలియన్‌కు పంపింది. View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో ఐదు పరుగుల వ్యవధిలోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యస్తికా భాటియా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. అర్ధ శతకం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్(14), రిచా ఘోష్(26), పూజా వస్త్రాకర్(30), స్నేహ్ రాణా(27) పరుగులు సాధించారు. ఈ క్రమంలో భారత్ 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్ 2, జహనారా ఆలం ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. సెమీస్ ఆశలు సజీవం
ICC Women ODI World Cup 2022 Ind W Vs Ban W : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌లో సెమీస్ ఆశలు సజీవంగా భారత్ నిలుపుకుంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి 119 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్నేహ్ రానా నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించింది. అదే విధంగా గోస్వామి, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు సాధించి తమ వంతు పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో సల్మా ఖతూన్(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. 12: 53 PM బంగ్లాదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఒక వికెట్ దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మిథాలీ సేన సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. 12: 42 AM బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఇంకా రెండు వికెట్ల దూరంలో నిలిచింది. 12: 37 AM ఏడో వికెట్ డౌన్ బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. 98 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 12: 12 AM ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ఝులన్ గోస్వామి బౌలింగ్‌లో సల్మా ఖతూన్ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. లతా మొండాల్, రీతూ మోనీ క్రీజులో ఉన్నారు. 28 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 76-6 11: 59 AM 25 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు: 69-5 11: 31 AM: భారత బౌలర్లు జోరు మీదున్నారు. వరుస విరామాల్లో వికెట్లు కూలుస్తూ బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. స్నేహ్ రాణా బౌలింగ్‌లో రుమానా ఐదో వికెట్‌గా వెనుదిరిగింది. దీంతో 40 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. 11: 25 AM బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో ముర్షీదా ఖతూన్ అవుట్ అయింది. రుమానా అహ్మద్, లతా మొండాల్ క్రీజులో ఉన్నారు. స్కోరు- 35-4(17 ఓవర్లు) View this post on Instagram A post shared by ICC (@icc) 11: 14 AM: మూడో వికెట్ డౌన్ ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. స్నేహ్ రాణా బౌలింగ్‌లో నిగర్ సుల్తానా హర్మన్‌ప్రీత్ కౌర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. అంతకుముందు గైక్వాడ్ షర్మిన్ అక్తర్‌ను, పూజా వస్త్రాకర్ ఫర్గాగాను అవుట్ చేశారు. 14 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు: 28/3 10: 52 AM: 15 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో ఫర్గానా హోక్ ఎల్బీగా వెనుదిరిగింది. 9 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) 10: 40 AM: 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ షర్మిన్ అక్తర్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. 5 పరుగులు చేసిన అక్తర్..గైక్వాడ్ బౌలింగ్‌లో స్నేహ్ రానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. 6 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) 10: 30 AM: 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. 09: 51 AM: ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇక బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్ 2, జహనారా ఆలం ఒక వికెట్ పడగొట్టారు. 09: 17 AM:అయ్యో.. యస్తికా హాఫ్ సెంచరీ సాధించిన మరుసటి బంతికే భారత బ్యాటర్ యస్తికా భాటియా అవుట్ అయింది. రీతూ మోని బౌలింగ్‌లో నహీదా అక్తర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. యస్తికా రూపంలో మిథాలీ సేన ఆరో వికెట్ కోల్పోయింది. పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా క్రీజులో ఉన్నారు. స్కోరు 180-6(44 ఓవర్లలో). 09: 16 AM: అర్ధ శతకం పూర్తి చేసుకున్న యస్తికా ఓవైపు వికెట్లు పడుతున్నా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ భారత బ్యాటర్ యస్తికా భాటియా హాఫ్ సెంచరీ చేసింది. 79 బంతులు ఎదుర్కొన్న ఆమె 50 పరుగులు పూర్తి చేసుకుంది. సల్మా బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం సాధించింది. భారత్ స్కోరు:176-5(43) View this post on Instagram A post shared by ICC (@icc) 09: 00 AM: ఐదో వికెట్ కోల్పోయిన భారత్ రిచా ఘోష్ రూపంలో మిథాలీ సేన ఐదో వికెట్ కోల్పోయింది. నహీదా అక్తర్ బౌలింగ్‌లో నిగర్ సుల్తానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ప్రస్తుతం పూజా వస్త్రాకర్, యస్తికా భాటియా(44) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 163-5(39 ఓవర్లలో) 08: 43 AM: 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 147/4 యస్తికా భాటియా 37 పరుగులు, రిచా ఘోష్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. 08: 20 AM: 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 121/4. యస్తికా భాటియా(20), రిచా ఘోష్(9) బ్యాటింగ్ చేస్తున్నారు. 08: 11 AM: హర్మన్ అవుట్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళా జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. లతా మొండాల్ బౌలింగ్‌లో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్(14)గా వెనుదిరిగింది. యస్తికా భాటియా, రిచా ఘోష్ క్రీజులో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) 08: 04 AM: ఆచితూచి ఆడుతున్న యస్తికా, హర్మన్ భారత బ్యాటర్లు యస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ ఆచితూచి ఆడుతున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ సింగిల్స్ తీస్తున్నారు. ఈ క్రమంలో 25 ఓవర్లు ముగిసే సరికి మిథాలీ సేన 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. 7: 45 AM: కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ వరుసగా రెండు వికెట్లు కూల్చి జోరు మీదున్న బంగ్లా బౌలర్ రీతూ మోని, నహీదా అక్తర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరి బౌలింగ్‌లో సింగిల్స్ కూడా తీయలేక యస్తికా, హర్మన్ డిఫెన్స్ ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 80/3 7: 40 AM: 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 79-3. యస్తికా భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులో ఉన్నారు. 7: 33 AM: వరుసగా వికెట్లు పడగొడుతున్న బంగ్లా బౌలర్లు ఆరంభంలో తడబడ్డా బంగ్లా బౌలర్లు వరుసగా వికెట్లు కూలుస్తూ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నారు. రీతూ మోని మరోసారి భారత్‌ను దెబ్బకొట్టింది. క్రీజులోకి వచ్చీ రాగానే భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ను అవుట్ చేసింది. 16 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 74-3 View this post on Instagram A post shared by ICC (@icc) 7: 30 AM: మిథాలీ సేనకు మరో షాక్ తగిలింది. అర్ధ శతకానికి చేరువవుతున్న షఫాలీ వర్మ(42)ను రీతూ మోని పెవిలియన్‌కు పంపింది. షఫాలీ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. యస్తికా భాటియా, మిథాలీ రాజ్ క్రీజులో ఉన్నారు. 7: 28 AM: జోరు మీదున్న భారత జట్టుకు బంగ్లా బౌలర్ నహీదా అక్తర్ షాకిచ్చింది. 30 పరుగులతో క్రీజులో ఉన్న మంధానను అవుట్ చేసింది. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 7: 22 AM: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిథాలీ సేనకు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అదరగొడుతున్నారు. ఈ క్రమంలో 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 72-0 View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. -
World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా మరోసారి అదరగొట్టింది. భారత మహిళా జట్టుతో ఆక్లాండ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీలో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు.. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైన మిథాలీ సేనకు నిరాశ తప్పలేదు. టాస్ గెలిచి.. మిథాలీ సేనతో మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన 10 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (12 పరుగులు) నిరాశపరిచింది. అయితే, యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68) స్కోరు బోర్డును పరిగెత్తించారు. View this post on Instagram A post shared by ICC (@icc) కానీ ఆసీస్ బౌలర్ డార్సీ బ్రౌన్ వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టి జట్టును దెబ్బకొట్టింది. ఆ తర్వాత వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 57 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఇక ఆఖర్లో బ్యాట్ ఝులిపించిన పూజా వస్త్రాకర్ 34 పరుగులు సాధించింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు స్కోరు చేసింది. ఆది నుంచి దూకుడుగా.. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు రేచల్ హేన్స్(43), అలీసా హేలీ(72) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరికి తోడు కెప్టెన్ మెగ్ లానింగ్ 97 పరుగులు సాధించి జట్టు విజయానికి బాటలు వేసింది. అయితే, మధ్యలో వరుణుడి ఆటంకం, గెలుపునకు 31 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఆసీస్ మూడో వికెట్ కోల్పోవడం ఉత్కంఠను పెంచాయి. View this post on Instagram A post shared by ICC (@icc) సగర్వంగా సెమీస్‌కు ఈ క్రమంలో సెంచరీకి చేరువైన లానింగ్‌ను మేఘనా సింగ్ అవుట్ చేయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, ఆఖరి మూడు బంతుల వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌దే పైచేయి అయింది. ఝులన్ గోస్వామి బౌలింగ్‌లో బెత్ మూనీ వరుస ఫోర్లు కొట్టి ఆసీస్ విజయాన్ని ఖరారు చేసింది. ఫోర్ బాది జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చింది. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు: ఇండియా- 277/7 (50) ఆస్ట్రేలియా- 280/4 (49.3) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: మిథాలీ సంచలనం.. ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని ఫీట్!
ICC Women World Cup 2022 Ind Vs Aus- Mithali Raj: గత కొన్ని రోజులుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతూ వరల్డ్‌కప్-2022 టోర్నీలో నిరాశ పరిచిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించింది. ప్రపంచకప్ ఈవెంట్లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అర్ధ శతకం బాదింది. 77 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించింది. కాగా మిథాలీ కెరీర్లో ఇది 63వ అర్ధ శతకం. ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. మహిళా ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సార్లు(12) హాఫ్ సెంచరీ ప్లస్ స్కోరు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ రికార్డును అధిగమించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ఇక కెప్టెన్‌గానూ మిథాలీకి ఈ మెగా ఈవెంట్లో యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎనిమిదోసారి. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సారథిగా మిథాలీ నిలిచింది. ఆమె తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో రెండో స్థానంలో ఉంది. కాగా ప్రపంచకప్ సెమీస్ చేరాలంటే, బలమైన జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియాతో కీలక పోరులో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68), హర్మన్ ప్రీత్ కౌర్ (57) అర్ధ శతకాలతో రాణించారు. ఇక అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. తద్వారా ఆస్ట్రేలియా సారథి బెలిండా క్లార్క్(23 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును ఆమె బ్రేక్ చేసింది. చదవండి: Women WC 2022- Mithali Raj: 5 పరుగులకే అవుట్ అయినా.. ప్రపంచకప్ టోర్నీలో మిథాలీ అరుదైన రికార్డు View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: ఆసీస్‌తో పోరు.. అదరగొట్టిన మిథాలీ, యస్తికా, హర్మన్..!
ICC Women World Cup 2022 IND W Vs AUS W: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మంచి స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది. కాగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిగింది. గత రెండు మ్యాచ్‌లలో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ స్మృతి మంధాన 10 పరుగులకే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత మరో ఓపెనర్ షఫాలీ వర్మ 12 పరుగులు సాధించి అవుట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక వనౌడౌన్‌లో వచ్చిన యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68) కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసిన ఆసీస్ బౌలర్ డార్సీ బ్రౌన్ మంచి ఫామ్‌లోకి వచ్చిన యస్తికాను అవుట్ చేసింది. ఆ తర్వాత మిథాలీ అలనా కింగ్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 57 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖర్లో 34 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన పూజా వస్త్రాకర్ రనౌట్ కావడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.ఇక ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్కు మూడు, జెస్ జొనాసెన్‌కు ఒకటి, అలనా కింగ్‌కు 2 వికెట్లు దక్కాయి. View this post on Instagram A post shared by ICC (@icc) భారత్ స్కోరు: 277-7 (50 Ov) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: నరాలు తెగే ఉత్కంఠ.. 4 పరుగుల తేడాతో విజయం!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. కాగా మౌంట్ మాంగనీ వేదికగా విండీస్‌తో తలపడిన బంగ్లాదేశ్ మహిళా జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు డియేండ్ర డాటిన్(17 పరుగులు), హేలీ మ్యాథ్యూస్(18 పరుగులు) శుభారంభం అందించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన విలియమ్స్(4), ఆ తర్వాత కెప్టెన్ టేలర్(4) సింగిల్ డిజిట్ స్కోరు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ వికెట్ కీపర్ బ్యాటర్ కాంప్‌బెల్ నేనున్నానంటూ భరోసా ఇచ్చింది. 107 బంతులు ఎదుర్కొన్న ఆమె ఓపికగా పరుగులు తీస్తూ 53 పరుగులు సాధించింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టును విండీస్ బౌలర్ హేలీ మ్యాథ్యూస్ ఆదిలోనే దెబ్బకొట్టింది. ఓపెనర్లను వెనక్కి పంపింది. మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి బంగ్లా పతనాన్ని శాసించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 136 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా 4 పరుగుల తేడాతో విజయం విండీస్ సొంతమైంది. హేలీ మ్యాథ్యూస్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022 వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు వెస్టిండీస్- 140/9 (50) బంగ్లాదేశ్- 136 (49.3) చదవండి: View this post on Instagram A post shared by ICC (@icc) -
Jhulan Goswami: టీమిండియా పేసర్ ప్రపంచ రికార్డు.. అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సాధించింది. వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ ఓపెనర్ టామీ బీమౌంట్‌ను అవుట్ చేసి ఈ ఘనత సాధించింది. ఎల్బీడబ్ల్యూగా ఆమెను వెనక్కి పంపి.. తద్వారా 250వ వికెట్ మైలురాయిని చేరుకున్న ఝులన్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. కాగా 198 ఇన్నింగ్స్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. ఇక వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఝులన్ తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ కాథరిన్ ఫిజ్పాట్రిక్(180 వికెట్లు), వెస్టిండీస్ బౌలర్ అనీసా మహ్మద్(180 వికెట్లు), దక్షిణాఫ్రికా క్రికెటర్ షబ్నమ్ ఇస్మాయిల్(168 వికెట్లు), ఇంగ్లండ్ బౌలర్ కేథరీన్ బ్రంట్(164 వికెట్లు), ఆస్ట్రేలియా బౌలర్ ఎలిస్ పెర్రీ(161 వికెట్లు) ఉన్నారు. ఇక బీమౌంట్ వికెట్‌ను కూల్చడం ద్వారా ఝులన్ మరో రికార్డు కూడా సాధించింది. వన్డేల్లో 250 వికెట్ల మైలురాయిని అందుకున్న ఏడో భారత బౌలర్(పురుషులు, మహిళా క్రికెటర్లు కలిపి)గా నిలిచింది. అనిల్ కుంబ్లే(334),జవగళ్ శ్రీనాథ్(315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్‌దేవ్(253)ల సరసన నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ 2022 టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. చదవండి: Ruturaj Gaikwad - IPL 2022: సీఎస్కేకు బిగ్‌షాక్.. ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం! View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
పోరాడినా... తప్పని ఓటమి!
స్ఫూర్తిదాయక ఆటతో వెస్టిండీస్‌పై భారీ విజయం సాధించి ఆశలు రేపిన భారత మహిళల ఆట ఒక్కసారిగా గతి తప్పింది. పేలవ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ ముందు మన జట్టు తలవంచింది. ఒక్కరూ కూడా కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఆరంభంలోనే రెండు వికెట్లు తీసినా... చివరకు ప్రత్యర్థి గెలుపును ఆపలేకపోయారు. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు బలమైన ప్రత్యర్థులే కావడంతో సెమీస్ చేరేందుకు భారత్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. మౌంట్ మాంగనీ: గత వన్డే వరల్డ్ కప్ ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన సమరం దాదాపు ఏకపక్షంగా సాగింది. ఇంగ్లండ్ కూడా గొప్పగా ఆడకపోయినా చేవ లేని భారత బ్యాటింగ్ ఆ జట్టుకు కలిసొచ్చింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత మహిళలపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 36.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన (58 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచా ఘోష్ (56 బంతుల్లో 33; 5 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చార్లీ డీన్ (4/23) భారత్‌ను పడగొట్టింది. అనంతరం ఇంగ్లండ్ 31.2 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. కెప్టెన్ హీతర్ నైట్ (72 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో పాటు నాట్ సివర్ (46 బంతుల్లో 45; 8 ఫోర్లు) రాణించింది. టపటపా... తన రెండో ఓవర్లోనే ఓపెనర్ యస్తిక భాటియా (8)ను అవుట్ చేసి భారత్ పతనానికి శ్రీకారం చుట్టిన ష్రబ్సోల్ తన తర్వాతి ఓవర్లో మిథాలీ రాజ్ (1)ను కూడా వెనక్కి పంపించింది. ఆ వెంటనే లేని సింగిల్‌కు ప్రయత్నించి దీప్తి శర్మ (0) రనౌటైంది. డీన్ వేసిన ఒకే ఓవర్లో హర్మన్ (14), స్నేహ్ రాణా (0) కూడా పెవిలియన్ చేరడంతో 61 పరుగుల వద్దే భారత్ సగం వికెట్లు కోల్పోయింది. దాంతో మరో ఎండ్‌లో స్మృతి తన సహజశైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడుతూ ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎకెల్‌స్టోన్ బౌలింగ్‌లో స్మృతి వికెట్ల ముందు దొరికిపోగా, పూజ వస్త్రకర్ (6) కూడా ఇదే తరహాలో అవుటైంది. ఈ దశలో రిచా, జులన్ గోస్వామి (20) కొంత ధాటిని ప్రదర్శించడంతో స్కోరు వంద పరుగులు దాటింది. మేఘనకు 3 వికెట్లు... సునాయాస ఛేదనలో ఇంగ్లండ్ తడబాటుకు గురైంది. 4 పరుగులకే ఆ జట్టు వ్యాట్ (1), బీమాంట్ (1) వికెట్లు కోల్పోయింది. మేఘన తన తొలి స్పెల్‌లో ప్రత్యర్థిని కట్టిపడేసింది. 4 ఓవర్లలో ఆమె 20 డాట్ బంతులు వేయడం విశేషం. అయితే నైట్, సివర్ చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్‌ను గెలుపు దిశగా నడిపించారు. సివర్ను అవుట్ చేసి పూజ ఈ జోడీని విడదీయగా...66 బంతుల్లో నైట్ అర్ధసెంచరీ పూర్తయింది. విజయానికి చేరువైన దశలో ఒకే ఓవర్లో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయినా, కెప్టెన్ నైట్ అజేయంగా నిలిచి తన బాధ్యతను పూర్తి చేసింది. చదవండి: 46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్ హీరోయిన్ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: కుప్పకూలిన మిడిలార్డర్.. విఫలమైన మిథాలీ.. కేవలం
ICC Women World Cup 2022 Ind W Vs Eng W: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా భారత మహిళా జట్టు బుధవారం ఇంగ్లండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేన 134 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యస్తికా భాటికా 11 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆమె స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ 5 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు సాధించింది. దీప్తి శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ ఇంగ్లండ్ బౌలర్ చార్లెట్ డీన్ భారత్‌ను దెబ్బకొట్టింది. ఒకే ఓవర్ హర్మన్‌తో పాటు ఆమె స్థానంలో క్రీజులోకి వచ్చిన స్నేహ్ రాణాను పెవిలియన్‌కు పంపింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆ తర్వాత సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించింది. ఇక నిలకడగా ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్(33 పరుగులు) రనౌట్ కావడంతో భారత్ మరింతగా కష్టాల్లో కూరుకుపోయింది. ఝులన్ గోస్వామి కాసేపు బ్యాట్ ఝులిపించినా ఆమెకు సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. View this post on Instagram A post shared by ICC (@icc) పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్ ముగ్గురూ కలిసి కేవలం 10 పరుగులు మాత్రమే సాధించారు. ఈ క్రమంలో భారత్ 36.2 ఓవర్లలో 134 చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లెట్ డీన్‌కు నాలుగు, శ్రుబ్సోలేకు రెండు, సోఫీకి ఒకటి, కేట్ క్రాస్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ స్కోరు: 134-10 (36.2 ఓవర్లు). -
World Cup 2022: నిరాశలో మిథాలీ సేన.. భారత్‌పై ఇంగ్లండ్ విజయం
England Women vs India Women Updates: మహిళల వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా మిథాలీ సేనపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. సోఫీ ఎక్లెస్టోన్ ఫోర్ బాది ఇంగ్లండ్ విజయాన్ని ఖరారు చేసింది. కాగా వరల్డ్‌కప్-2022లో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు: ఇండియా- 134 (36.2ఓవర్లు) ఇంగ్లండ్- 136/6 (31.2 ఓవర్లు) 11: 30 AM: ఆరో వికెట్ డౌన్ మేఘనా సింగ్ వరుసగా రెండో వికెట్ తీసింది. సోఫీ స్థానంలో క్రీజులోకి వచ్చిన బ్రంట్‌ను అవుట్ చేసింది. 11: 29 AM: ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సోఫీ డన్క్లేను మేఘనా సింగ్ పెవిలియన్‌కు పంపింది. దీంతో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 11: 17 AM 26 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 104-4 జోన్స్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 10: 53 AM: 20 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 80/3 విజయానికి ఇంకో 55 పరుగులు అవసరం 10: 48 AM: క్రీజులో నిలదొక్కుకున్న నటాలి సీవర్‌ను భారత ప్లేయర్ పూజా వస్త్రాకర్ పెవిలియన్‌కు పంపింది. అర్ధ శతకానికి చేరువైన నటాలిని అవుట్ చేసింది. దీంతో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె క్రీజును వీడింది. హైథర్నైట్, అమీ ఎలెన్ జోన్స్ క్రీజులో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) 15 ఓవర్లలో ఇంగ్లండ్ 59/2 10:35 AM: ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ మహిళల జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. నటాటీ సివర్ 41, హెథర్ నైట్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10:05 AM: 8 ఓవర్లలో ఇంగ్లండ్ 23/2 టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. హెథర్‌నైట్, నటాలి సీవర్ 11 పరుగులతో ఆడుతున్నారు. 9: 48 AM: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ భారత బౌలర్ మేఘనా సింగ్ భారత జట్టుకు శుభారంభం అందించింది. ఇంగ్లండ్ ఓపెనర్ వ్యాట్‌ను ఒక్క పరుగుకే పెవిలియన్ చేర్చింది. దీంతో భారత్‌కు తొలి వికెట్ లభించింది. ఝులన్ గోస్వామి అద్భుత బంతితో ఇంగ్లండ్ మరో ఓపెనర్ టామీ బీమౌంట్‌ను పెవిలియన్‌కు చేర్చింది. 10 బంతులు ఎదుర్కొన్న బీమౌంట్ ఒకే ఒక్క పరుగు చేసి ఝులన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ఈ క్రమంలో 3 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే సాధించిన ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 9: 00 PM: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 134 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి మంధాన(35), హర్మన్‌ప్రీత్ కౌర్(14), రిచా ఘోష్(33), ఝలన్ గోస్వామి(20) మినహా మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. 8: 52 AM: తొమ్మిది వికెట్లు కోల్పోయిన భారత్ ఝులన్ గోస్వామి రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసి ఝులన్ పెవిలియన్ చేరింది. రాజేశ్వరీ గైక్వాడ్, మేఘనా సింగ్ క్రీజులో ఉన్నారు. 8: 48 AM: ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ బ్యాట్ ఝులిపిస్తూ భారత శిబిరంలో నిరాశను పోగొట్టిన రిచా ఘోష్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయింది. దీంతో మిథాలీ సేన ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 8: 35 AM: రిచా ఘోష్, ఝులన్ గోస్వామి బ్యాటింగ్ చేస్తున్నారు. 31 ఓవర్లలో భారత్ స్కోరు: 108/7 8: 17 AM: ఏడో వికెట్ కోల్పోయిన భారత్ పూజా వస్త్రాకర్(6 పరుగులు) రూపంలో భారత మహిళా జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. చార్లెట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. రిచా ఘోష్, ఝులన్ గోస్వామి క్రీజులో ఉన్నారు. భారత స్కోరు: 88-7 8: 03 AM: మంధాన అవుట్ వరుసగా వికెట్లు కోల్పోతున్న వేళ భారత జట్టు ఆశాకిరణంగా నిలిచిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్‌కు తెరపడింది. సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. రిచా ఘోష్, పూజా వస్త్రాకర్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 72-6 View this post on Instagram A post shared by ICC (@icc) ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హర్మన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన స్నేహ్ రాణా డకౌట్ అయింది. ఆమె రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. స్మతి మంధాన, రిచా ఘోష్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 64/5 (17.5) View this post on Instagram A post shared by ICC (@icc) 7: 46 AM: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ ఇంగ్లండ్ బౌలర్ చార్లెట్ భారత్ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది. క్రీజులో కుదురుకున్నట్లుగా అనిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌ను పెవిలియన్‌కు పంపింది. దీంతో భారత్ కీలక వికెట్ కోల్పోయింది. 7: 33 AM: నిలకడగా ఆడుతున్న స్మతి మంధాన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(26 పరుగులు) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తోంది. మరో ఎండ్‌లో వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(12 పరుగులు) ఆమెకు చక్కటి సహకారం అందిస్తోంది. కాగా మెగా టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు అద్భుత సెంచరీలు సాధించి భారత్‌కు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) 7: 18 AM: మూడు వికెట్లు కోల్పోయిన భారత్ పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు- 37-3 దీప్తి రనౌట్ భారత జట్టుకు మరో షాక్ తగిలింది. బ్యాటర్ దీప్తి శర్మ రనౌట్‌గా వెనుదిరిగింది. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. ఏంటిది మిథాలీ! ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ యస్తికా భాటికా నిరాశపరిచింది. 8 పరుగులకే నిష్క్రమించింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం మరోసారి విఫలమైంది. 5 బంతులు ఎదుర్కొన్న ఆమె ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరగడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత మహిళా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. మిథాలీ బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పంతం నీదా.. నాదా సై సుమారు ఐదేళ్ల క్రితం... వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టును ఇంగ్లండ్ ఓడించింది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడినా...మిథాలీ సేన 9 పరుగులతో ఓడిపోకతప్పలేదు. దీంతో రన్నరప్‌గానే మిగిలిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రపంచకప్-2022లో మరోసారి ఇరు జట్లు తొలిసారిగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే, ఇంగ్లండ్‌లో పేరుకు గొప్ప ప్లేయర్లు ఉన్నా ప్రస్తుత ఈవెంట్లో జట్టుకు ఒక్క విజయం కూడా దక్కలేదు. ఈ మ్యాచ్‌లోనూ గనుక ఓడితే ఇంగ్లండ్ సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయినట్లే. మరోవైపు.. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయంతో భారత్ ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి ఈ ప్రతీకార మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! -
World Cup 2022: ఎదురులేని ఆసీస్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
ICC Women ODI World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్- 2022 టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతోంది. మెగ్ లానింగ్ సారథ్యంలో ఆసీస్ వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. విండీస్‌ను చిత్తు చేసి మెగా ఈవెంట్లో వరుసగా నాలుగో విజయం సాధించింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆదిలోనే విండీస్ జట్టుకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ డకౌట్ కాగా.. డియేండ్ర డాటిన్ 16 పరుగులకే పెవిలియన్ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన నైట్ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. ఈ క్రమంలో 50 పరుగులు చేసిన స్టెఫానీ టేలర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. వికెట్ కీపర్ కాంప్‌బెల్ 20 పరుగులు చేయగా మిగతా వాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 131 పరుగులకే విండీస్ ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లు పెర్రీ, గార్డెనర్ మూడేసి వికెట్లు కూల్చగా.. స్కాట్ ఒకటి, జొనాసెన్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆదిలోనే ఓపెనర్ అలీసా హేలీ వికెట్ కోల్పోయినప్పటికీ... మరో ఓపెనర్ రేచెల్ హేన్స్ 83 పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుబాట పట్టించింది. రేచెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో 30.2 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో విజయం ఆసీస్ సొంతమైంది. ఇక ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పెర్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మహిళల ప్రపంచకప్- ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ వెస్టిండీస్- 131 (45.5) ఆస్ట్రేలియా- 132/3 (30.2) చదవండి: Rohit Sharma: అతడి ఆట తీరు ఎలా ఉన్నా స్వీకరిస్తాం.. అయితే, అనవసర షాట్లు వద్దని చెప్పాం: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
అదరగొట్టిన మిథాలీ సేన (ఫోటోలు)
-
World Cup 2022: శెభాష్ స్మృతి, హర్మన్.. ఇదే అత్యధిక స్కోరు!
ICC Women ODI World Cup 2022 Ind W Vs WIW: ఐసీసీ మహిళా వన్డే కప్-2022లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మిథాలీ సేన అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా శుభారంభం అందించారు. మంధాన 119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేయగా.. యస్తికా 31 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ 5 పరుగులకే పెవిలియన్ చేరగా, దీప్తి శర్మ 15 పరుగులకే అవుట్ అయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, మంధానతో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించింది. 107 బంతుల్లో 109 పరుగులు సాధించింది. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక మంధాన, హర్మన్ అద్భుత సెంచరీలతో ఆకట్టుకోవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. కాగా ఈ వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక చివర్లో 53 పరుగులకే విండీస్ ఐదు వికెట్లు తీసినప్పటికీ అప్పటికే భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. వెస్టిండీస్‌తో మ్యాచ్: భారత మహిళా జట్టు స్కోరు: 317-8 (50 ఓవర్లలో) మంధాన, హర్మన్ సెంచరీలు స్మృతి మంధాన- 119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు హర్మన్‌ప్రీత్ కౌర్- 107 బంతుల్లో 109 పరుగులు చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్‌లోకి రీఎంట్రీ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) The HIGHEST total of #CWC22 India put on a fabulous show with the bat 🙌 West Indies picked up 5 wickets for 53 runs near the end, but the damage was already done by then.#WIvIND SCORECARD ⬇️ — ESPNcricinfo (@ESPNcricinfo) March 12, 2022 -
Smriti Mandhana: మంధాన క్లాసీ సెంచరీ.. వన్డేల్లో ఎన్నోదంటే!
ICC Women ODI World Cup 2022 Ind W Vs WIW- Smriti Mandhana Classy Century: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. న్యూజిలాండ్ వేదికగా వెస్టిండీస్ మహిళా జట్టుతో మ్యాచ్‌లో శతకం బాదింది. ఈ క్రమంలో వన్డేల్లో తన ఐదో సెంచరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 119 బంతులు ఎదుర్కొన్న మంధాన 123 పరుగులు (13 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసింది. ఫోర్ బాది శతకం పూర్తి చేసుకోవడం విశేషం. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి నిలకడగా ఆడుతూ భారత జట్టు భారీ ఇన్నింగ్స్ సాధించడంలో మంధానది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో మంధానకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుత ఇన్నింగ్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే.. ‘‘స్మృతి మంధాన నుంచి అద్భుత ఇన్నింగ్స్.. సో క్లాసీ.. చూడముచ్చటగా అనిపించింది’’ అంటూ ఆమెను కొనియాడాడు. చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్‌లోకి రీఎంట్రీ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: అదరగొట్టిన మిథాలీ సేన.. విండీస్‌పై భారీ విజయం.. ఏకంగా
ICC Women ODI World Cup 2022: Updates: 1: 23 PM ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల భారీ తేడాతో విండీస్‌పై గెలుపొందింది. 1: 10 PM తొమ్మిదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. విజయానికి అడుగుదూరంలో భారత మహిళా జట్టు. స్కోరు: 158/9 (37) 1: 05 PM: ఎనిమిదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 12: 58 PM 34 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ స్కోరు: 155/7. 12: 34 PM వెస్టిండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ మిడిలార్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో 28 ఓవర్లకే టేలర్ బృందం 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుత స్కోరు: 145/7 (28). ఇక భారత్‌పై విజయం సాధించాలంటే 173 పరుగులు అవసరం. 12: 21 PM: వెస్టిండీస్ మహిళా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓపెనర్లు మెరుపులు మెరిపించినా.. మిడిలార్డర్ విఫలం కావడంతో 24 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో చినెలె హెన్రీ ఆరో వికెట్‌గా వెనుదిరిగింది. 12: 15: వెస్టిండీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే స్నేహ్ రాణా, మేఘన రెండేసి వికెట్లు తీయగా... కాంప్‌బెల్‌ను ఐదో వికెట్‌గా పూజా వస్త్రాకర్ పెవిలియన్‌కు పంపింది. 11: 55 AM: ఆరంభంలో ధాటిగా ఆడిన విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతోంది. హేలీ మాథ్యూస్ రూపంలో నాలుగో వికెట్ డౌన్ అయింది. స్నేహ్ రాణా అద్భుత బౌలింగ్‌లో హేలీ 43 పరుగుల వద్ద నిష్క్రమించింది. విండీస్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసిన ఇద్దరు ఓపెనర్లు డాటిన్, హేలీని స్నేహ్ పెవిలియన్‌ను పంపి భారత్‌కు బ్రేక్ ఇచ్చింది. 11: 52 AM: కెప్టెన్ టేలర్ రూపంలో విండీస్ మూడో వికెట్ కోల్పోయింది. మేఘనా సింగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 11: 49 AM: 17 ఓవర్లలో విండీస్ స్కోరు: 112/2 స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్న విండీస్ బ్యాటర్లకు భారత బౌలర్లు మేఘనా సింగ్, స్నేహ్ రాణా బ్రేకులు వేశారు. డాటిన్(62 పరుగులు)ను స్నేహ్ పెవిలియన్‌కు చేర్చగా.. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన నైట్‌ను మేఘన అవుట్ చేసింది. 11: 07 AM: దీటుగా బదులిస్తున్న వెస్టిండీస్ మహిళా జట్టు ఆతిథ్య న్యూజిలాండ్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌లపై సంచలన విజయాలు సాధించిన విండీస్ భారత్‌తో మ్యాచ్‌లోనూ సత్తా చాటుతోంది. 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 10 ఓవర్లలో 81 పరుగులు చేసింది. భారత్ విసిరిన సవాల్‌కు దీటుగా బదులిస్తోంది. ఓపెనర్ డియాండ్ర డాటిన్ 36బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ హేలీ 32 పరుగులు చేసింది. పది ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 81-0 స్మృతి, హర్మన్ మెరుపులు.. భారత్ భారీ స్కోరు 10: 08 AM న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత మహిళా జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(123), వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(109) అద్భుత సెంచరీలతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మిగతా వాళ్లలో యస్తికా భాటియా(31 పరుగులు), పూజా వస్త్రాకర్(10) తప్ప మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 10: 03 AM ఎనిమిదో వికెట్డౌన్ ఝులన్ గోస్వామి రూపంలో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 10 AM: ఆఖర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. అనిసా మహ్మద్ బౌలింగ్‌లో పూజా వస్త్రాకర్ అవుట్ కాగా.. అలియా హర్మన్‌ను పెవిలియన్‌కు పంపింది. దీంతో 49 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. 9: 52 AM: భారత్ ప్రస్తుత స్కోరు: 296/5 (47) 9: 49 AM: విండీస్ బౌలర్ అలియా రిచా ఘోష్‌ను పెవిలియన్‌కు పంపింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిచా క్రీజు వీడింది. తద్వారా భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. రిచా స్థానంలో పూజా వస్త్రాకర్ మైదానంలో దిగింది. 9: 46 AM: హర్మన్ చేసెను అద్భుతం భారత బ్యాటర్, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత సెంచరీ సాధించింది. 100 బంతుల్లో 100 పరుగులు చేసింది. 9: 32 AM: 44 ఓవర్లలో భారత్ స్కోరు: 268/4 (44) హర్మన్ ప్రీత్ కౌర్-83, రిచా ఘోష్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9: 25 AM: స్మృతి అవుట్: సెంచరీ సాధించి జోరు మీదున్న స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. షమీలియా బౌలింగ్‌లో సెల్మాన్కు క్యాచ్ ఇచ్చి 123 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె నిష్క్రమించింది. రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. స్కోరు: 264/4 (42.5) 9: 23 AM: దంచి కొడుతున్న స్మృతి, హర్మన్ విండీస్‌లో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ దంచి కొడుతున్నారు. 42 ఓవర్లలో భారత్ స్కోరు: 257-3 9: 16 AM: శెభాష్ మంధాన విండీస్‌తో మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన శతకం సాధించింది. విండీస్ బౌలర్ హేలీ బౌలింగ్‌లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు వైస్ కెప్టెన్ హర్మన్ కూడా అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు మీదుంది. 9: 06 AM శతకానికి చేరువవుతున్న స్మృతి మంధాన. 99 బంతుల్లో 94 పరుగులు 9: 00 AM: 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు: 190-3 మంధాన, హర్మన్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. 8: 33 AM: 30 ఓవర్లలో భారత్ స్కోరు: 160/3 స్మృతి మంధాన 65, హర్మన్‌ప్రీత్ కౌర్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. మంధాన హాఫ్ సెంచరీ 8: 18 AM: అర్ధ శతకం పూర్తి చేసుకున్న స్మృతి మంధాన 67 బంతుల్లో 53 పరుగులు సాధించిన భారత ఓపెనర్ ధాటిగా ఆడుతున్న మంధాన 8:15 AM: 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 125-3 స్మృతి మంధాన 44, హర్మన్‌ప్రీత్ కౌర్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. 7: 55 AM: 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు- 100-3. స్మృతి మంధాన 32 పరుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ల శుభారంభం.. కానీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సెడాన్ పార్కు వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా(31 పరుగులు) శుభారంభం అందించారు. అయితే, కెప్టెన్ మిథాలీ రాజ్ మరోసారి నిరాశ పరిచింది. కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరింది. తుది జట్లు: భారత్: యస్తికా భాటియా, స్మృతి మంధాన, దీప్తి శర్మ, మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్ వెస్టిండీస్: డియేండ్ర డాటిన్, హేలీ మాథ్యూస్, కైసియా నైట్(వికెట్ కీపర్), స్టెఫానీ టేలర్(కెప్టెన్), షిమానె కాంప్‌బెల్, చెడాన్ నేషన్, చినెల్లె హెన్రీ, అలియా అలెన్, షమీలియా కానెల్, అనిసా మహ్మద్, షకేరా సెల్మాన్. చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్‌లోకి రీఎంట్రీ View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: టాప్‌లో ఆస్ట్రేలియా.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే!
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ మెగా ఈవెంట్లో న్యూజిలాండ్ మహిళా జట్టు అదరగొట్టింది. వరుసగా బంగ్లాదేశ్, భారత జట్లపై విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉంది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా సెడాన్ పార్కు వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో వైట్ ఫెర్న్స్ మిథాలీ రాజ్ సేనపై 62 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అంతకు ముందు బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది న్యూజిలాండ్. ఇక ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన ఆస్ట్రేలియా మహిళా జట్టు 4 పాయింట్లు సాధించడంతో పాటు మెరుగైన రన్‌రేటుతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచినప్పటికీ రన్‌రేటు పరంగా వెనుకబడ్డ వెస్టిండీస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా(ఒక మ్యాచ్- ఒక విజయం), భారత్(ఆడినవి-2 గెలిచింది 1), ఇంగ్లండ్ (ఆడినవి 2, ఓడినవి 2), బంగ్లాదేశ్(ఆడినవి 2, ఓడినవి 2), పాకిస్తాన్(ఆడినవి 2, ఓడినవి 2) మహిళా జట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన నేపథ్యంలో ఫ్యాన్స్ మిథాలీ రాజ్ ఆట తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దూకుడుగా ఆడలేక చతికిలపడ్డారంటూ ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్‌పై ఘన విజయం తర్వాత మీ నుంచి ఇలాంటి ఆట తీరు ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే! -
World Cup 2022: భారత్‌కు తప్పని ఓటమి.. న్యూజిలాండ్ ఘన విజయం
ICC Women ODI World Cup 2022 Ind W Vs Nz W: న్యూజిలాండ్ చేతిలో భారత మహిళా జట్టుకు మరోసారి పరాభవం తప్పలేదు. గత రికార్డులను కొనసాగిస్తూ న్యూజిలాండ్ మహిళా జట్టు భారత్ మీద అద్భుత విజయం సాధించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా న్యూజిలాండ్‌లోని సెడాన్ పార్కు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయంతో జోరు మీదున్న వైట్ ఫెర్న్స్ సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలీ సేన.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించకపోయినా.. అమీలియా కెర్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఇన్నింగ్స్ గాడిన పడింది. ఆ తర్వాత అమీ సాటర్త్‌వైట్ 75 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. వీరికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ కేటే మార్టిన్ కూడా 41 పరుగులు సాధించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి వైట్ ఫెర్న్స్ 260 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మిథాలీ రాజ్ బృందానికి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ 71 పరుగులు, కెప్టెన్ మిథాలీ రాజ్ 31 పరుగులు తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022 భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు న్యూజిలాండ్- 260/9 (50) భారత్- 198 (46.4) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అమీ సాటర్త్‌వైట్(న్యూజిలాండ్) చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే! -
NZ Vs IND: సరిపోని హర్మన్‌ప్రీత్ మెరుపులు.. టీమిండియా పరాజయం
-
ICC Womens World Cup: కివీస్‌తో తేల్చుకోవాల్సిందే
హామిల్టన్: ప్రపంచకప్ సన్నాహాల కోసమే న్యూజిలాండ్‌కు వచ్చిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడిపోయింది. అయితే అసలైన వరల్డ్‌కప్‌లో మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి మిథాలీ రాజ్ బృందం శుభారంభం చేసింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో జైత్రయాత్ర సాగించాలని టీమిండియా ఆశిస్తోంది. గురువారం భారత్ తమ రెండో లీగ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. పాక్‌తో తొలి మ్యాచ్‌లో నెగ్గినప్పటికీ బ్యాటింగ్ గొప్పగా అయితే లేదు. టాపార్డర్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ సహా మిడిలార్డర్ బ్యాటర్స్ కెప్టెన్ మిథాలీ, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఇలా ఏ ఒక్కరూ పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు. వీరంతా కలిసి చేసింది 15 పరుగులే! లోయర్ ఆర్డర్లో స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్ రాణించకపోతే టీమిండియా కష్టాల్లో పడేది. ఇప్పుడు పటిష్టమైన న్యూజిలాండ్‌తో ఏ ఒకరో ఇద్దరో ఆడితే ఏ మాత్రం సరిపోదు. పాక్‌తో ఆడినట్లు ఆడితే అసలు కుదరనే కుదరదు. ముఖ్యంగా మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాలి. ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్‌లో ఉండటం సానుకూలాంశమైనప్పటికీ మిగతావారు కూడా జట్టు స్కోరులో భాగం కావాలి. అప్పుడే ఆతిథ్య జట్టుకు సవాల్ విసరొచ్చు. లేదంటే ద్వైపాక్షిక సిరీస్‌లో ఎదురైన ఫలితమే ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పటిష్టంగా కివీస్ మరోవైపు కివీస్ తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో చివరి ఓవర్లో ఓడింది. కానీ వెంటనే తేరుకున్న న్యూజిలాండ్... బంగ్లాదేశ్‌ను సులువుగా ఓడించింది. ఓపెనర్లు సోఫీ డివైన్, సుజీ బేట్స్, అమెలియా కెర్ సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టుకు బలం. బౌలింగ్‌లోనూ లియా తహుహు, జెస్ కెర్, అమీ సాటర్త్‌వైట్ ప్రత్యర్థి బ్యాటర్స్‌పై నిప్పులు చెరుగుతున్నారు. సొంతగడ్డ అనుకూలతలు ఎలాగూ ఉన్నాయి. ఇలా ఏ రకంగా చూసిన కూడా భారత్, న్యూజిలాండ్‌ల మధ్య గురువారం ఆసక్తికర పోరు జరగడం ఖాయం. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఓవరాల్‌గా ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగాయి. 2 మ్యాచ్‌ల్లో భారత్, 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
ఐసీసీ సెల్ఫీ డే స్పెషల్
జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం మాత్రమే కాదు, సెల్ఫీ ప్రేమికులు ఈ రోజును సెల్ఫీ డేగా (2014 నుంచి) జరుపుకుంటున్నారు. సెల్ఫీ డే సందర్బంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొన్ని ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది. ‘మీ అభిమాన క్రికెట్లర్ల సెల్ఫీ ఫోటోలు చూడండి’ అంటూ ఐసీసీ ఆ షేర్లో పేర్కొంది. గత ఏడాది కాలంగా ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న జట్లతో పాటు, మాజీ దిగ్గజ క్రికెట్లర్లు దిగిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి. ఐసీసీ షేర్ చేసిన ఫోటోల్లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత బృందం ఉంది. 2017 మహిళల ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు సెల్ఫీ ఫోటో, 2018లో చాంపియన్ ట్రోఫీ నెగ్గిన పాకిస్తాన్ జట్టు ఫోటో, ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు దిగ్గిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. To celebrate World #SelfieDay, let's see some of your favourite cricket-related selfies! 😁🤳 pic.twitter.com/d4RbB5Rols — ICC (@ICC) 21 June 2018 -
పేర్లు చెప్పండి చూద్దాం!
అబ్బో... మగాళ్లు మహిళలకిచ్చిన గౌరవం తక్కువేం కాదు. అదేదో అన్నారు. ఏమన్నారూ... ఆకాశంలో సగం! మరి భూమ్మీద? ముప్పైమూడు పర్సెంట్ కూడా ఇవ్వలేకపోతున్నాం. మనం ఇస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత? మహిళలు వరల్డ్ కప్ ఫైనల్‌కి వచ్చేశారంటే.. గెలవడానికి ఫిఫ్టీ–ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నట్లే. అంటే.. భూమ్మీద కూడా సగం ఛాన్స్. మరి ఇంత కాన్ఫిడెంట్‌గా, బలంగా బ్యాట్‌తో బాల్ని కొట్టి మరీ చెప్తున్నాం కదా.. ఏదీ.. ఇంటర్నెట్ చూడకుండా.. మన మహిళా టీమ్‌లోని ప్లేయర్ల పేర్లు చెప్పుకోండి. అందరి పేర్లూ అక్కర్లేదు.. ఆకాశంలో సగంలా.. కనీసం సగం చెప్పండి చూద్దాం?! ఇట్స్ ఓకే! ఉమెన్ టీమ్‌లో ఎవరి పేర్లు ఏమిటో మీకు తెలికపోవడాన్ని అలా ఉంచండి. సాక్షాత్తూ విరాట్ కొహ్లికే తెలియదంటే ఏమనుకోవాలి?! ఉమెన్ క్రికెట్‌ని ఆయన క్రికెట్‌గా గుర్తించడం లేదనా? మగాళ్లు ఆడితేనే అది క్రికెట్ అని కోహ్లి కూడా అనుకుంటున్నాడనా?! ఇప్పుడు ఇంగ్లండ్‌లో జరుగుతున్న మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ మిథాలీరాజ్ మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. కోహ్లి నిజంగా వీళ్ల ఆటను చూశాడో లేక ఎవరైనా అంటుంటే విన్నాడో ‘వావ్ మిథాలీ’ అని ట్విట్టర్లో కాంప్లిమెంట్ ఇచ్చాడు. ‘ఎ గ్రేట్ మూమెంట్’ అంటూ మొదలైన ఆ ప్రశంస.. ‘చాంపియన్ స్టఫ్’ అంటూ నాలుగు చిన్నచిన్న లైన్లలో ముగిసింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఆ కాంప్లిమెంట్‌కి ఆయన పెట్టిన ఫొటోలో ఉన్నది నిజానికి మిథాలీ కాదు... పూనమ్ రౌత్! కోహ్లి ఒక్కడే కాదు! అప్పటికి (మిథాలీ రికార్డు సాధించే రోజుకు) ఉమన్ వరల్డ్ కప్ మొదలై ఇరవై రోజులు అవుతున్నా.. వరల్డ్ కప్‌లో మహిళల ఆటకు చిన్న ట్వీట్ ముక్క ఇచ్చిన క్రికెట్ సెలబ్రిటీలే లేరు! కోహ్లి పెట్టిన ఆ ఒక్క ట్వీట్‌కైనా రీట్వీట్స్ ‘సున్నా’. టెండూల్కర్ పాపం ఉదారంగా 5 ట్వీట్లు ఇచ్చాడు. దానికి వచ్చిన రీ ట్వీట్లు కూడా ‘సున్నా’నే! హర్భజన్ 3, లక్ష్మణ్ 5 ట్వీట్లు ఇస్తే హర్భజన్‌కి మాత్రం ఒక్క రీ ట్వీట్ వచ్చింది. ఇక రవీంద్ర జడేజా, రవిశాస్త్రి ఒక్క ట్వీట్ కూడా ఇవ్వలేదు. టీవీ ప్రెజెంటర్లు మందిరా బేడి, మయంతి, అర్చన ఒక్కో ట్వీట్ చొప్పున ఇస్తే మాయంతికి మాత్రం ఓ రీట్వీట్ వచ్చింది. శివానీ జీరో ట్వీట్. ఇక్కడో పాయింట్ గమనించాలి. మహిళా క్రీడా ప్రముఖులు కూడా మహిళల క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. జూలై 2న ఇండియా–పాక్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ‘వావ్.. వాటే షాట్..’ అని పెద్దగా షౌట్ చేసిన అర్చన, బేడీ.. ఉమెన్ క్రికెట్‌కు ఒకటంటే ఒకటే షౌట్ ఇచ్చారు. మిథాలీ రాజ్ 6 వేల పరుగుల మైలు రాయిని దాటినప్పుడు మయంతి మాత్రం చిన్న ట్వీట్ మేసేజ్ ఒకటి వదిలారు. ఆ క్షణానికే అప్రిసియేషన్ రేపటితో ముగుస్తున్న ఉమన్ వరల్డ్ కప్‌కు ఇంతవరకు ఒక్క సెహ్వాగే ఎక్కువ ట్వీట్లు ఇచ్చారు. అయితే అది ఆయన సహజ స్వభావం. క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ.. వాళ్లు మగవాళ్లు కానివ్వండి, మహిళలు కానివ్వండి.. బాగా ఆడితే సెహ్వాగ్ ఇన్స్పైరింగ్ ట్వీట్లు ఇస్తుంటారు. జూన్ 24న ఇండియన్ ఉమెన్స్ వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి టీమ్‌లో ప్రతిభ కనబరిచిన ప్రతి అమ్మాయినీ సెహ్వాగ్ మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూనే ఉన్నాడు. అయితే ఇలాంటివన్నీ ఆ క్షణానికే అప్రిసియేషన్లు తప్ప మహిళా క్రీడాకారిణుల ప్రతిభకు, కృషికి, సామర్థ్యానికి తగిన గుర్తింపు కానే కాదు. గుర్తింపు అంటే ప్రతిఫలం, ప్రాధాన్యం, ప్రోత్సాహం. ఇవి మూడూ మన మహిళా క్రికెటర్లకు లేవన్నది నిజం. వీళ్లకూ వాళ్లేనా హీరోలు?! కోహ్లి తన పొర పాటును తెలుసుకుని (అది కూడా ఎవరో తెలియజెబితే) వెంటనే ట్విట్టర్‌లోంచి పూనమ్ రౌత్ ఫొటోను తొలగించినప్పటికీ.. మహిళల ఆటలపై మన సమాజంలో ఎంత ఆసక్తి, ఎంత శ్రద్ధ ఉన్నాయో ఆయన పోస్ట్ వల్ల మరోసారి స్పష్టం అయింది. 18 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న మిథాలీ రాజ్‌ని కోహ్లి ఎలా గుర్తించలేకపోతాడు? 2006లో తమిళనాడుతో కోహ్లి తన తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడేనాటికే మిథాలీ స్టార్ క్రికెటర్. ఆ సంగతి మర్చిపోయాడనే అనుకుందాం. ఈ మధ్యే కదా కోహ్లి.. మిథాలీతో కలిసి పద్మశ్రీకి నామినేట్ అయింది! ఇదీ గుర్తు లేదనుకుందాం. తామిద్దరూ నామినేట్ అయినప్పుడు మిథాలీకి ఆ అవార్డు రావడమైనా కోహ్లి ఎలా మరచిపోగలడు? కోహ్లిని తప్పు పట్టడం కాదు. అసలు క్రికెట్‌కు ఉన్నంత ప్రాధ్యాన్యం మన దగ్గర మిగతా ఆటలకు ఉండదు. అదీ మగవాళ్ల క్రికెట్‌పైనే. మగవాళ్లు డకౌట్ అయి, మహిళలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నా వాళ్లకేం గుర్తింపు ఉండదు. అంతెందుకు? ఈ వరల్డ్ కప్‌లో మిథాలీని ‘మీ ఫేవరెట్ మేల్ క్రికెటర్ ఎవరు?’ అని అడిగేశారు ఎవరో. మిథాలీ కడిగేశారు ఆ అడిగినవాళ్లని. ‘ఇదే మాటను వాళ్లన అడగ్గలరా?’ అని. నిజమే కదా! విరాట్ కోహ్లిగానీ, ఇంకో మగ క్రికెటర్‌గానీ చెప్పగలరా.. తమ అభిమాన మహిళా క్రికెటర్ ఎవరో! అక్కడి వరకూ వద్దు బాస్. మన ఉమెన్ టీమ్‌లో ఉన్న వాళ్లలో ఓ ఐదుగురు పేర్లు చెప్పమనండి చాలు. కోహ్లి ది గ్రేట్ అవుతాడు. చులకన.. చిన్న చూపు క్రికెట్లో ఉన్నంత సెక్సిజం మిగతా ఆటల్లో లేదు. సెక్సిజం అంటే.. మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువ అనే భావం. ఆడవాళ్ల శక్తి సామర్థ్యాలను చులకన చేయడం. దీనికి కారణం.. క్రికెట్ మగాళ్ల ఆట అనుకోవడం! ఈ సెక్సిజం నుంచే.. ‘మీ మేల్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు?’ అనే అర్థం లేని ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి. దీనిని మిథాలీ బాగానే తిప్పకొట్టారు. మగాళ్లు మళ్లీ నోరెత్తలేదు. మిథాలీ అలా అనగానే నటి అదాశర్మ వెంటనే బయటికి వచ్చారు. క్రికెట్లోనే కాదు, అన్ని చోట్లా ఈ వివక్ష ఉంది. దీన్ని మనమొక ఛాలెంజ్‌గా తీసుకుని ఫైట్ చెయ్యాలి అంటూ మిథాలీకి సపోర్ట్ చేశారు. గుత్తా జ్వాల అయితే బ్యాట్ పట్టుకుని వచ్చేశారు. ‘మనం ఏదైనా సాధిస్తే చాలు.. యారోగెంట్ అనేస్తారు? ఏమీటీ సెక్సిజం’ అని ఫోర్స్‌గా ఓ షాట్ కొట్టారు. ఆ వెంటనే వీవీఎస్ లక్ష్మణ్ పిచ్‌లోకి వచ్చేశాడు. నో.. డౌట్ బాస్.. మిథాలీ, జులన్, సానియా, సైనా, సిం«ధు.. ఇవాళ్టి హీరోలు. మనం ఒప్పుకోవాలి’ అని మిథాలీ ఆగ్రహాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు. అందరికీ అంత బ్రాడ్ మైండ్ ఉంటుందా? పురుషాహంకారం మహిళ ప్రతిభకు ప్రణమిల్లుతుందా? లేదు. మహిళా క్రికెటర్లపై అన్నిట్లో చిన్నచూపే. ప్రోత్సాహం ఉండదు. ప్రతిఫలం ఉండదు. ప్రచారం ఉండదు. డబ్బు పెట్టేవాళ్లుండరు. ప్రైజ్ మనీ కూడా భారీగా ఉండదు. ఇవన్నీ అలా ఉంచండి. ఒక షాట్ కొడితే, ఒక క్యాచ్ పడితే.. స్టేడియంలో కానీ, ఇంట్లో టీవీ ముందు కానీ ఒక కదలిక ఉండదు. ఇన్ని అనా సక్తులను, అననుకూలతలను, అవరోధాలను విజయ వంతంగా దాటుకుని రేపు ఆదివారం మన ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడబోతోంది. ఇందులో ఏ జట్టు గెలిచినా.. అది ఉమెన్ ప్లేయర్లు లైంగిక వివక్షపై సాధించిన గెలుపే అవుతుంది. భలే ‘ఇచ్చింది’ మంధన ప్రస్తుతం ఆడుతున్న ఇండియన్ టీమ్‌లో స్మృతీ మంధన అనే అమ్మాయి ఉంది. జస్ట్ ఇరవై ఏళ్ల అమ్మాయి. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇంత చిన్న వయసులో ఎవరూ సెంచరీ కొట్టలేదు. స్మృతి కొట్టింది. తొమ్మిదేళ్ల వయసుకే ఈ మహారాష్ట్ర అమ్మాయి అండర్ 15లో ఆడింది. అండర్–19లో మహారాష్ట్ర టీమ్‌లో ఆడింది. పదహారేళ్ల వయసులో వెస్ట్ జోన్ తరఫున వన్డే గేమ్‌లో డబుల్ సెంచరీ చేసింది. ఇవన్నీ కాదు కానీ... ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఇచ్చింది చూడండీ.. ఓ ఆన్సర్.. అదో పెద్ద సిక్సర్. ‘మీరు ప్రపంచకప్ గెలుస్తామని అనుకుంటున్నారా?’ అని బీబీసీ జర్నలిస్టు.. టోర్నీకి ముందు స్మృతిని అడిగాడు. ‘ఏం.. మీరు అనుకోవడం లేదా?’ అని స్మృతి ఏ మాత్రం తడుముకోకుండా అనేసింది. ఈ సమాధానానికి ఎక్కడో ఉన్న ధోని ఇంప్రెస్ అయి, నెట్లో ‘ఐ యామ్ ఇంప్రెస్డ్’ అని కామెంట్ పెట్టాడు. ఉమెన్ టీమ్లలోని (అది ఏ టీమ్ అయినా) విజయస్ఫూర్తికి.. స్మృతి ఒక నిదర్శనం. వాళ్లకు కోట్లలో... వీళ్లకు లక్షల్లో..! భారత పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళల క్రికెటర్లకు లభించే మొత్తం నామమాత్రమే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గత ఫిబ్రవరిలో పురుషుల క్రికెటర్లకు ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ వివరాల ప్రకారం... గ్రేడ్ ’ఎ’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 2 కోట్లు, గ్రేడ్ ’బి’లో ఉన్న వారికి ఏడాదికి రూ. కోటి, గ్రేడ్ ’సి’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 50 లక్షలు చెల్లిస్తారు.ఇక ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డే ఆడితే రూ. 7 లక్షలు, టి20 మ్యాచ్ ఆడితే రూ. 3 లక్షలు ఇస్తారు. దేశవాళీ రంజీ ట్రోఫీలో మ్యాచ్‌కు రూ. 40 వేలు చొప్పున అందజేస్తారు. ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెటర్లకు 2016–2017 సీజన్ వార్షిక కాంట్రాక్ట్ వివరాలను ఇంకా ప్రకటించనే లేదు. 2015–2016 సీజన్ ప్రకారమైతే గ్రేడ్ ’ఎ’లో ఉన్న వారికి ఏడాదికి మరీ అధ్వాన్నంగా రూ. 15 లక్షలు, గ్రేడ్ ’బి’లో ఉన్న వారికి రూ. 10 లక్షలు అందించారు. ఉమెన్స్ వరల్డ్ కప్ 2017 ఇండియా–టీమ్ నిలబడి ఉన్నవారు (ఎడమ నుంచి) : శిఖా పాండే, జులన్ గోస్వామి, మాన్సీ జోషి, మోనా మేష్రమ్, వేద కృష్ణమూర్తి, మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతీ మంధన, హర్మన్ ప్రీత్‌కౌర్, సుష్మా వర్మ (వికెట్ కీపర్) కూర్చున్నవారు (ఎడమ నుంచి): పూనమ్ యాదవ్, పూనమ్ రౌత్, నుజ్హత్ పర్వీన్, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, ఏక్తా బిస్త్ -
భారత్ విజయలక్ష్యం 245
కొలంబో:మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఇక్కడ భారత్ జరుగుతున్న టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆది నుంచి దూకుడుగానే ఆడింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు లిజెల్లా లీ(37; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), లౌరా వొల్వార్త్త్(21; 43 బంతుల్లో 3 సిక్సర్లు) సమయోచితంగా ఆడారు. ఆ తరువాత ప్రీజ్ (40), చెట్టీ(22), ట్రయాన్(23), నీకెర్క్(37), సున్ లూస్(35)లు బాధ్యతాయుతంగా ఆడటంతో దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 244 పరుగులు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా మహిళలు కొన్ని విలువైన భాగస్వామ్యాలు నమోదు చేయడంతో గౌరవప్రదమైన స్కోరును సాధించకల్గింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ కు మూడు వికెట్లు లభించగా, శిఖా పాండేకు రెండు వికెట్లు దక్కాయి. పూనమ్ యాదవ్, దీప్తి శర్మలకు తలో వికెట్ లభించింది. -
ఆసీస్ సెమీస్ ఆశలు సజీవం
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. గ్రూప్ ఏ నుంచి సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్ లో నెగ్గి ఆరు పాయింట్లతో న్యూజీలాండ్ తో సమానంగా ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేయగా, ఛేజింగ్ కు దిగిన ఆసీస్ మరో 6.4 ఓవర్లు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఐర్లాండ్ జట్టులో కిమ్ గార్త్(27), జాయ్స్ (23) మాత్రమే రాణించగా మిగిలిన మహిళా ప్లేయర్స్ విఫలమయ్యారు. ఎలైస్ విల్లాని (43), ఎల్లీస్ పెర్రీ 29 నాటౌట్ రాణించడంతో ఆసీస్ చాలా వేగంగా లక్ష్యాన్ని సాధించింది. ఐర్లాండ్ బౌలర్లలో కిమ్ గార్త్(2/24) మాత్రమే కొంత మేరకు ప్రభావం చూపించింది. ఆసీస్ బౌలర్లలో మెగాన్ స్కట్ 3 వికెట్లు తీయగా, రెనె ఫార్రెల్ 2 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ పతనాన్ని శాసించారు.