World Cup 2022: టాప్‌లో ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్‌.. భారత్‌ ఎన్నో స్థానంలో ఉందంటే!

World Cup 2022: How Points Table Stands After New Zealand India Clash - Sakshi

స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ మెగా ఈవెంట్‌లో న్యూజిలాండ్‌ మహిళా జట్టు అదరగొట్టింది. వరుసగా బంగ్లాదేశ్‌, భారత జట్లపై విజయం సాధించి ఫుల్‌ జోష్‌లో ఉంది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022లో భాగంగా సెడాన్‌ పార్కు వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో వైట్‌ ఫెర్న్స్‌ మిథాలీ రాజ్‌ సేనపై 62 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అంతకు ముందు బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో తాజా విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది న్యూజిలాండ్‌. ఇక ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన ఆస్ట్రేలియా మహిళా జట్టు 4 పాయింట్లు సాధించడంతో పాటు మెరుగైన రన్‌రేటుతో అగ్రస్థానంలో ఉంది.

మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచినప్పటికీ రన్‌రేటు పరంగా వెనుకబడ్డ వెస్టిండీస్‌ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా(ఒక మ్యాచ్‌- ఒక విజయం), భారత్‌(ఆడినవి-2 గెలిచింది 1), ఇంగ్లండ్‌ (ఆడినవి 2, ఓడినవి 2), బంగ్లాదేశ్‌(ఆడినవి 2, ఓడినవి 2), పాకిస్తాన్‌(ఆడినవి 2, ఓడినవి 2) మహిళా జట్లు ఉన్నాయి. 

ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైన నేపథ్యంలో ఫ్యాన్స్‌ మిథాలీ రాజ్‌ ఆట తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దూకుడుగా ఆడలేక చతికిలపడ్డారంటూ ట్రోల్‌ చేస్తున్నారు. పాకిస్తాన్‌పై ఘన విజయం తర్వాత మీ నుంచి ఇలాంటి ఆట తీరు ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్‌ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top