
నేడు భారత్–ఆ్రస్టేలియా మ్యాచ్
విజయంపై కన్నేసిన టీం ఇండియా మహిళల జట్టు
విశాఖ స్పోర్ట్స్: ఐసీసీ వుమెన్ వరల్డ్ కప్‌లో అత్యంత రసవత్తరమైన పోరుకు విశాఖ వైఎస్సార్ స్టేడియం సిద్ధమైంది. వరుసగా మూడుసార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో గత రన్నరప్ భారత్ ఆదివారం డే–నైట్ మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. ఈ పోరు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఐదు పాయింట్లతో ఆ్రస్టేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత జట్టు, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఆటగాళ్లు శనివారం ప్రాక్టీస్‌లో శ్రమించారు.
మంధాన రికార్డుపై దృష్టి
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో మరో 58 పరుగులు చేయగలిగితే.. వన్డేల్లో 5,000 పరుగుల మార్కును చేరుకోనుంది.
టాస్ గెలిస్తే బౌలింగ్‌కు అనుకూలం
విశాఖలో వర్షాల కారణంగా పిచ్ కొద్దిగా తడిగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గుచూపే అవకాశం ఉంది.
మిథాలీరాజ్ స్టాండ్, కల్పన ఎంట్రీల ప్రారంభం
భారత మాజీ కెపె్టన్ మిథాలీరాజ్ పేరిట ఒక స్టాండ్‌ను, ఆంధ్ర మహిళా క్రికెటర్ కల్పన పేరిట ఒక ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ స్టాండ్, ప్రవేశద్వారాలను ప్రారంభించనున్నారు.