టీమిండియాతో ఐదో టీ20లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆతిథ్య భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగులు చేసింది.
భారత్ విధించిన 232 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. హైలైట్స్
👉10 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 118-1
విజయానికి 60 బంతుల్లో 114 కావాలి. బ్రెవిస్ 14 బంతుల్లో 29, డికాక్ 34 బంతుల్లో 65 పరుగులతో ఉన్నారు.
👉6.3 తొలి వికెట్ డౌన్: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో హెండ్రిక్స్ (13) అవుట్. స్కోరు: 70-1(7). డెవాల్డ్ బ్రెవిస్ క్రీజులోకి వచ్చాడు.
👉ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 60-0
హెండ్రిక్స్ 10, డికాక్ 42 పరుగులతో ఉన్నారు.
భారత్ భారీ స్కోరు: 231-5(20)
ఓపెనర్లు సంజూ శాంసన్ (37), అభిషేక్ శర్మ (34) రాణించగా.. తిలక్ వర్మ (42 బంతుల్లో 73), హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకాలతో మెరిశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి విఫలం అయ్యాడు.
ఆఖర్లో శివం దూబే 3 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్‌మన్ చెరొక వికెట్ పడగొట్టారు. ప్రొటిస్ జట్టు లక్ష్యం 232 పరుగులు.
భారత్ బ్యాటింగ్.. హైలైట్స్
👉19.3 నాలుగో వికెట్ డౌన్: బార్ట్‌మన్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)
19.3 నాలుగో వికెట్ డౌన్: బార్ట్‌మన్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)
👉16 బంతుల్లో హార్దిక్ పాండ్యా అర్ధ శతకం
బాష్ బౌలింగ్‌లో సిక్స్ బాది 50 పరుగులు పూర్తి చేసుకున్న హార్దిక్
👉15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 170-3
తిలక్ 57, హార్దిక్ 8 బంతుల్లో 32 పరుగులతో ఉన్నారు.
👉14.4 తిలక్ వర్మ హాఫ్ సెంచరీ: ఎంగిడి బౌలింగ్‌లో ఫోర్ బాది.. ఆరో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసిన తిలక్ వర్మ (30 బంతుల్లో).
👉12.1 మూడో వికెట్ డౌన్: బాష్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య (5) అవుట్. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా. స్కోరు: 115-3(12.1)
👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 101-2
తిలక్ 24, సూర్య 2 పరుగులతో ఉన్నారు.
👉9.1 రెండో వికెట్ డౌన్: లిండే బౌలింగ్‌లో శాంసన్ బౌల్డ్ (22 బంతుల్లో 37; 4ఫోర్లు, 2 సిక్సర్లు). రెండో వికెట్ డౌన్. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్.
👉8.4: సంజూ బాదిన షాట్‌తో అంపైర్‌కు గాయం
ఫెరీరా బౌలింగ్‌లో స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు సంజూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు ఇచ్చిన క్యాచ్‌ను ఫెరీరా డ్రాప్ చేయగా.. అంపైర్ రోహన్ పండిట్ మోకాలికి తలిగింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోగా.. ఫిజియోలు వచ్చి చెక్ చేశారు.
👉పవర్ ప్లేలో భారత్ స్కోరు: 67-1(6)
సంజూ 27, తిలక్ వర్మ 4 పరుగులతో ఉన్నారు.
👉5.4- తొలి వికెట్ డౌన్: కార్బిన్ బాష్ బౌలింగ్‌లో కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34; ఆరు ఫోర్లు, ఒక సిక్స్) అవుట్. తొలి వికెట్ డౌన్. క్రీజులోకి తిలక్ వర్మ. స్కోరు: 63-1(5.4)
👉ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 56-0
👉అభిషేక్ శర్మ 17 బంతుల్లో 28, సంజూ శాంసన్ 13 బంతుల్లో 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తుదిజట్లలో మార్పులు ఇవే
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. అన్రిచ్ నోర్జే స్థానంలో జార్జ్ లిండేను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది.
మరోవైపు.. టీమిండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి రాగా.. హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్, శుబ్‌మన్ గిల్ గాయాల బెడదతో దూరం కాగా.. వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్ వారి స్థానాలను భర్తీ చేశారు.
కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కటక్‌లో భారత్, ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా గెలవగా.. ధర్మశాలలో భారత్ మరోసారి జయకేతనం ఎగురవేసింది. లక్నోలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దైపోగా.. అహ్మదాబాద్‌లో గెలిచి 3-1తో సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా ఐదో టీ20 తుదిజట్లు
టీమిండియా
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్
సౌతాఫ్రికా
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవాన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.


