అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఏ మాటైనా, విమర్శ అయినా చాలా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే అందరికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వాళ్లే..అనుకోకుండా లేదా ప్రమాదావశాత్తు చిన్న మాట తూలిన అంతే సంగతులు. ఇదేంటి సారూ..! ఇలా చేశారు అని అంతా వేలెత్తి చూపించేస్తారు. పైగా విమర్శలపాలవ్వక తప్పదు. అందుకే పెద్దలు సదా అటెన్షన్, నమ్రతగా ఉండాలి అని చెబుతుండేది అందుకే కాబోలు. ఇప్పుడిదంతా ఎందుకంటే..పాపం ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఉద్దేశ్యం మరొకటి అయితే ప్రజల్లో మరొలా వెళ్లి..ఆయన ప్రవర్తననే ప్రశ్నించే పరిస్థితికి దారితీసింది.
అసలేం జరిగిందంటే..విదేశాల్లో ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ నీలేష్ చేసిన ఒక్క పోస్ట్ పెద్ద వివాదాస్పదమై, సోషల్‌మీడియాలో చర్చలకు దారితీసింది. మన దేశ రాజాధానిలో వాయు నాణ్యత ఏ పరిస్థితిలో ఉందో తెలిసిందే. ఈ విషయమై నిపుణులు ఈపాటికే ప్రజలకు హెచ్చరికలు, జాగ్రత్తలు జారీ చేశారు కూడా.
అయితే ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ తాను ఆ నేపథ్యంలోనే ఢిల్లీని వదిలి విదేశాల్లో బతుకుతున్నానంటూ..తాను అమెరికాలో ఉన్న స్థితిని, ఢిల్లీలోని పరిస్థితిని పోల్చి మరి వివరించారు. పైగా ఢిల్లీ గగన వీధుల్లో పొగమంచుతో ఉన్న స్కైలైన్‌ని, అమెరికాలోని మౌంట్ రైనర్ నేషనల్ పార్క్ ప్రకృతి దృశ్యం చూపిస్తూ..రెండింటి మధ్య ఎంత వ్యత్యాసమో గమనించండి అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ముఖ్యంగా భారతదేశ రాజధానిలోని ప్రమాదకర గాలి నాణ్యత, విదేశాలలో కాలుష్యం లేని వాతావరణం మధ్య వ్యత్యాసాన్నిరీడింగ్‌లతో సహా చూపించారు. అయితే మన రాజధానిలో గాలి నాణ్యత అంతకంతకు పడిపోతుంది అని చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ ఇలా వేరే దేశంతో పోల్చి మనల్ని మనం దిగజార్చుకుంటూ చెప్పడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
దేశానికి సేవ చేసే బాధ్యతయుతమైన వృత్తిలో ఉండి, ఇలా దేశం విడిచి వచ్చి మంచి పనిచేశాను, ఇప్పుడు నేను చాలా సురక్షితంగా ఉన్నానంటూ.. ఏదో ఘనకార్యం చేసినట్లుగా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా అంటూ మండిపడ్డారు నెటిజన్లు. అసలు సమస్య పరిష్కారంలో భాగం కావలి గానీ మీరే ఇలా చేస్తారా?. నిజానికి మీరు దేశ సేవ చేయడానికే ఐఏఎస్ చేశారనుకున్నా..కానీ.. అని మిమర్శిస్తూ పోస్టులు పెట్టారు.
If I hadn't left India, I would have had to live and breathe in this mess otherwise known as the North Block Secretariat.
Note the stark contrast. 🤯 https://t.co/vBKuC0Te7p pic.twitter.com/GHUUtJfQNQ— LV Nilesh (@LVNilesh) November 2, 2025
(చదవండి: ఆ రూ. 500 కోట్లు డీల్..దెబ్బకు డ్రైవర్ తీరు మారిందిగా..!)


