న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా చేపట్టిన ‘నో పీయూసీ.. నో ఫ్యూయెల్’ అమలు గురువారం ప్రారంభమైంది. మొదటి రోజునే 2,800 వాహనాలకు చమురు నిరాకరించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో 210 ఎన్‌ఫోర్స్ మెంట్ బృందాలను ఏర్పాటు చేశారు.
ఇక, పోలీసులతో కలిసి ఎన్‌ఫోర్స్ మెంట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. డ్రైవ్‌లో భాగంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలవరకు పీయూసీ (పొల్యూషన్ అండ్ కంట్రోల్) నిబంధనలు ఉల్లంఘించిన వారికి 3,746 చలాన్లు జారీ చేసినట్లు తెలిపారు. గురువారం నుంచి ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్’అమలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ప్రకటించిన తరువాత నో పీయూసీ సర్టిఫికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. డిసెంబర్ 17న 31వేలకు పైగా సర్టిఫికెట్లు జారీ చేశారు.


