క్యాట్ - 2016లో మెరిసిన ప్రకాశం జిల్లా వాసి | prakasam district person got CAT-2016 top rank | Sakshi
Sakshi News home page

క్యాట్ - 2016లో మెరిసిన ప్రకాశం జిల్లా వాసి

Jan 8 2016 11:23 PM | Updated on Sep 3 2017 3:19 PM

క్యాట్-2016 ప్రవేశ పరీక్షలో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన గొంట్లా వెంకట శ్రీచరణ్ 99.1 శాతం మార్కులను సాధించాడు.

మార్కాపురం: క్యాట్-2016 ప్రవేశ పరీక్షలో ప్రకాశం జిల్లా వాసి మెరిశాడు. మార్కాపురానికి చెందిన గొంట్లా వెంకట శ్రీచరణ్ 99.1 శాతం మార్కులను సాధించాడు. క్యాట్ 2015 ప్రవేశ పరీక్షల్లో శ్రీచరణ్‌కు 97.3 శాతం మార్కులు రాగా కళాశాలలో సీటు రాలేదు. దీంతో 2016 అర్హత పరీక్షలు రాయగా 99.1 శాతం మార్కులు వచ్చాయని అతని తండ్రి రాంబాబు తెలిపారు. శ్రీచరణ్ గౌహతిలో ఐఐటీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement