నేటి తరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయిన పదం ఏ.ఐ.ఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్).. ఇదే టైటిల్‌తో ఒక వెబ్ సిరీస్‌ను దర్శకుడు జోసెఫ్ క్లింటన్ తెరకెక్కించాడు. ఇందులో ‘కోర్ట్’ మూవీ ఫేం హర్ష్ రోషన్, సునీల్, వైవా హర్ష, సందీప్ రాజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేసింది.

AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్‌కు సోషల్‌మీడియాలో భారీ క్రేజ్ ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. అందుకోసం తమకు స్థోమత లేకపోయినప్పటికీ మంచి కాలేజీలో చేర్పిస్తారు. వారి చదువుల కోసం అప్పులు చేసేందుకు కూడా వెనకాడరు. పిల్లల చదువల కోసం తమ జీవితాల్ని త్యాగం చేసే చాలామంది తల్లిదండ్రులు ఆలోచించేది వారి ర్యాంకుల గురించే.. ఈ కాన్సెప్ట్‌తోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.


