
వైల్డ్ కార్డ్స్ రావడం ఏమో గానీ బిగ్‌బాస్ తెలుగు షోలో కాస్త జోష్ వచ్చింది. మాధురి, రమ్య తదితరుల గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది. వీళ్లతో పాటు వచ్చిన లేడీ వైల్డ్ కార్డ్ ఆయేషా.. నామినేషన్స్‌లో ప్రతాపం చూపించేసింది. తనూజని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. అంతా బాగానే ఉంది గానీ ఇమ్మాన్యుయేల్ ప్లేటు తిప్పేయడం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ 37వ రోజు అసలేం జరిగింది?
సగం నామినేషన్స్‌తో సోమవారం ఎపిసోడ్ ఆగింది. అక్కడనుంచే మంగళవారం(అక్టోబరు 14) ఎపిసోడ్ మొదలైంది. ఈసారి పైనుంచి పడిన పట్టుకున్న మాధురి.. దాన్ని రీతూ చౌదరికి ఇచ్చింది. సమయమొచ్చినప్పుడు అండగా ఉంటానని మాట తప్పినందుకు భరణిని, తర్వాత దివ్యని నామినేట్ చేసింది. దీంతో రీతూ-దివ్య మధ్య చాలాసేపు వాదన నడిచింది. టైమ్ వచ్చినప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా అని చెప్పి కౌంటర్ ఇచ్చింది. నన్ను టార్గెట్ చేసినోళ్లు వెళ్లిపోతున్నారు. కానీ వాళ్లని నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు అని భరణి సీరియస్ అయిపోయాడు. చివరకు మాధురి.. దివ్యని నామినేట్ చేసింది.
(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?)
ఈసారి బంతి గౌరవ్‌కి దొరికింది. దీంతో సంజనకు దాన్ని అందించాడు. నా ఆరోగ్యం బాగోలేదు. మీకు కనిపించలేదా? అంటూ గతవారం సంచాలక్‌గా చేసిన రాముని, తర్వాత భరణిని నామినేట్ చేసింది. ఎప్పటిలానే రాము పెద్దగా ఏం మాట్లాడలేదు. భరణి మాత్రం సంజనపై సీరియస్ అయిపోయాడు. మీరు గూండాలు అనడం సరికాదు, సంజనని వెంటనే బయటకు పంపు అనే మాట అని ఉంటే ఇప్పుడే వాకౌట్ చేస్తా అని భరణి శపథం చేశాడు. అంతా అయిన తర్వాత గౌరవ్.. భరణి పేరు ఫిక్స్ చేశాడు. తర్వాత కూడా గౌరవ్ బంతిని పట్టుకున్నాడు. కానీ అడగటంతో ఆయేషాకి ఇచ్చేశాడు.
ఆయేషా.. బంతిని తీసుకెళ్లి సుమన్ శెట్టికి ఇచ్చింది. అతడేమో తనూజ, సంజనని నామినేట్ చేశాడు. దీంతో ఆయేషా అందుకుంది. నీ వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోంది. నీకున్న బాండింగ్స్ వల్ల ఫేవరిజం జరుగుతోంది. నీ వల్ల భరణి గేమ్ పాడవుతోందనిపిస్తోంది. స్టార్ మాలో సీరియల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ అది అక్కర్లేదు. బాయ్ ఫ్రెండో నాన్నో ఉంటే ఫైనల్ వరకు వచ్చేస్తాం అన్నట్లు ఉంది అని కల్యాణ్, భరణితో బాండింగ్ గుర్తుచేస్తూ తనూజని ఆయేషా టార్గెట్ చేసింది. దీంతో తనూజ కూడా రెచ్చిపోయింది. నువ్వు కూడా ఇంతకుముందు బాల్ కోసం సపోర్ట్ అడిగావ్‌గా అని బయటపెట్టింది. చివరకు నా టార్గెట్ నువ్వే అని తనూజని ఆయేషా నామినేట్ చేసింది. కెప్టెన్ కల్యాణ్.. తన పవర్ ఉపయోగించి రాముని నామినేట్ చేశాడు.
మొత్తంగా ఈ వారం రాము, తనూజ, భరణి, దివ్య, సుమన్ శెట్టి, పవన్ నామినేషన్స్‌లో నిలిచారు. సరే దీని గురించి పక్కనబెడితే మొన్నటివరకు తనూజతో తిరిగిన ఇమ్మాన్యుయేల్.. ఆయేషా ఈసారి తనూజని టార్గెట్ చేసిన తర్వాత ప్లేటు తిప్పేశాడు. తనూజ vs ఆయేషా గొడవ జరుగుతున్నప్పుడు చప్పట్లు కొట్టాడు. అంతా అయిపోయిన తర్వాత 'సూపర్‌గా చెప్పావ్' అని ఆయేషాతో అన్నాడు. ఇదంతా చూస్తుంటే హౌసులో ఈ వారమంతా వాడీవేడీగా ఉండబోతుందనిపిస్తోంది.
(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం)