బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లోకి చివరగా ఇమ్మాన్యుయేల్ తల్లి వచ్చింది. నేను వద్దనుకున్న కొడుకే ఈరోజు నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చాడని తెగ మురిసిపోయింది. కొడుక్కి ప్రేమగా గోరుముద్దలు తినిపించింది. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 21వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...
ఇమ్మూకి డబుల్ ధమాకా
ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు బిగ్‌బాస్ డబుల్ బొనాంజా ఇచ్చాడు. తల్లిని బయటకు పంపించేశాక ప్రియురాలు పంపిన లేఖ, ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఇది చూసి ఇమ్మూ తెగ సంబరపడిపోయాడు. తర్వాత ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ జరిగింది. ముందుగా కెప్టెన్సీకి అనర్హులు అనుకున్నవారిని గేమ్‌లో నుంచి తీసేయాలన్నాడు. దాంతో మొదటగా దివ్య.. తనూజ పేరు చెప్పింది.

పర్సనల్ అటాక్
ఆల్‌రెడీ రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చింది. మళ్లీ ఇంకో వారం ఇమ్యూనిటీ అవసరం లేదంటూ తనూజను తీసేసింది. అది తనూజకు నచ్చలేదు. ఎందుకు నా మీద పడి ఏడుస్తున్నావ్? అంటూ ఒంటికాలిపై లేచింది. దివ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరూ చాలాసేపు అరుచుకున్నారు. బయట రివ్యూలు సరిపోవన్నట్లు ఇక్కడికి వచ్చి చేస్తున్నావ్.. నువ్వే సింపథీ స్టార్ అంటూ తనూజ మరింత అగ్గిరాజేసింది.

గేమ్ కోసం వాడుకోను
నీలాగా మనుషుల్ని గేమ్ కోసం వాడుకోను అని దివ్య.. ఒక మనిషి ఇష్టం లేదంటున్నా వెంటపడుతున్నావ్.. అని తనూజ మధ్యలో భరణిని లాగారు. దాంతో ఆయన మధ్యలో నన్ను లాగొద్దని చెప్పానుగా అని అసహనం వ్యక్తం చేశాడు. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.. నేను నీకంటే బెటర్‌గా ఆడా.. అందరిదగ్గరికెళ్లి కెప్టెన్సీ అడుక్కోలేదు.. నిన్ను భరించలేక నన్ను గతంలో కెప్టెన్ చేశారు. నువ్వేం పొడిచింది లేదు. సీరియల్ స్టార్ అంటూ దివ్య తనూజను ఏకిపారేసింది.

చివరకు ఆ ఇద్దరు
అలా వీరి గొడవతో హౌస్‌ను తగలబెట్టేసినంత పని చేశారు. దివ్య తర్వాత మెజారిటీ ఇంటిసభ్యులు తనూజను కెప్టెన్గా వద్దన్నారు. దీంతో ఆమె గేమ్‌లో లేకుండా పోయింది. అయితే హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విభజించే బాధ్యతను తనూజకు అప్పగించాడు బిగ్‌బాస్. దీంతో ఆమె పవన్, కల్యాణ్, రీతూ, సుమన్‌ను బ్లూ టీమ్‌గా మిగిలినవారిని రెడ్ టీమ్‌గా విభజించింది. వీరికి ఓ మాన్‌స్టర్ గేమ్ ఇచ్చాడు. ఇందులో చివరకు సుమన్, రీతూ మిగిలారు. అయితే రీతూ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది.


