కల్యాణ్‌, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా? | Bigg Boss 9 Telugu: Emmanuel, Pawan Kalyan Childhood Memories | Sakshi
Sakshi News home page

Bigg Boss 9: 23 ఏళ్లలో 4 ఏళ్లు మాత్రమే పేరెంట్స్‌తో.. కడుపులో ఉన్నప్పుడే వదిలించుకోవాలని..

Nov 15 2025 9:20 AM | Updated on Nov 15 2025 11:16 AM

Bigg Boss 9 Telugu: Emmanuel, Pawan Kalyan Childhood Memories

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) రాజ్యంలో మహారాజుగా ఉన్న నిఖిల్‌, రాణులైన తనూజ, రీతూలకు కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చారు. ఇందులో తనూజ గెలిచి కెప్టెన్‌ అయింది. అది కూడా సరిగ్గా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌ అవడం విశేషం! మరి తర్వాత హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్‌ 14వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

నన్నెందుకు ఎత్తుకోలేదు?
తనూజ కెప్టెన్‌ అవగానే భరణి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ఎత్తుకుని తిప్పారు. అది చూసిన దివ్య.. నేను కెప్టెన్‌ అయినప్పుడు నన్నెందుకు ఎత్తుకోలేదని ప్రశ్నించింది. దానికి సమాదానం చెప్పలేక భరణి నీళ్లు నమిలాడు. తర్వాత హౌస్‌మేట్స్‌ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారి చిన్నప్పటి ఫోటోలను పంపించాడు బిగ్‌బాస్‌. వాటిని చూసిన వెంటనే తనూజ ఎమోషనలైంది. అది గమనించిన కల్యాణ్‌.. ఏడవకు తనూజ అని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే.. ఆవిడ మాత్రం చిటపటలాడింది.

చస్తా..  ఏడుస్తా..
నువ్వు ఏదైనా అడిగినప్పుడు నన్ను పూర్తిగా సమాధానం చెప్పనివ్వు అని మండిపడింది. నువ్వు ఆన్సర్‌ చెప్పట్లేదు, ఏడుస్తున్నావ్‌.. ఏడుపు ఆపేయ్‌ అనడం తప్పా? అని కల్యాణ్‌ (Pawan Kalyan Padala) అడిగాడు. ఇదే నీలో ఉన్న వరస్ట్‌ పార్ట్‌.. ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పనివ్వు. నేను ఏడుస్తానా? చస్తానా? నీకు అనవసరం.. లేకపోతే వదిలెయ్‌ నన్ను అని చిరాకుపడింది.

గుక్కపెట్టి ఏడ్చిన కల్యాణ్‌
తర్వాత కల్యాణ్‌ కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో చూసి ఎమోషనలయ్యాడు. నేను పుట్టినప్పుడు నాన్నకు బిజినెస్‌లో అంతా కలిసొచ్చింది. కొన్నేళ్లకు వాళ్ల ఫ్రెండ్స్‌ వల్ల జీరోకు వచ్చేశాడు. నన్ను ఫస్ట్‌ క్లాస్‌లోనే అత్తయ్య దగ్గరకు పంపారు. తర్వాత హాస్టల్‌లో వేశారు. అమ్మానాన్నతో కలిసి తిరిగింది గుర్తు లేదు. వాళ్లు నా పక్కన లేరని బాధుండేది. నేనేం చేశానని ఇలా దూరం పెడుతున్నారో అర్థమయ్యేది కాదు. హాస్టల్‌ వార్డెన్‌ దగ్గర ప్రతి ఆదివారం వారి నుంచి ఫోన్‌ కోసం ఎదురుచూసేవాడిని. 

ఏడిపించేసిన ఇమ్మూ
కానీ నెలకోసారి మాత్రమే ఫోన్‌ వచ్చేది. నా 23 ఏళ్లలో నేను నాలుగేళ్లు మాత్రమే వాళ్లతో ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్‌కి తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. మా ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు. మాది పాక ఇల్లు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాన్న వద్దన్నాడట. అమ్మమ్మ మాత్రం.. పుట్టబోయే వాడి వల్ల మీ జీవితం మారుతుందని చెప్పి పట్టుబట్టి ఉంచింది. అప్పుడు తిండి లేక అమ్మ పొలం దగ్గర మట్టి బుక్కేది. 

నా జీవితంలో సూపర్‌ హీరో
చిన్నప్పటినుంచే అన్న, నేను పొలం పనులు, పత్తి ఏరడం, సిమెంట్‌ పని.. ఇలా చాలా చేశాం. ఎంతో కష్టపడ్డాం. నా జీవితంలో మా అన్నే సూపర్‌ హీరో. ఇండస్ట్రీకి వచ్చాక నీ తమ్ముడు సక్సెస్‌ అయ్యాడు, నువ్వెందుకు కాలేదు అని అందరూ అనడంతో వాడు ఫీలైపోయేవాడు. కానీ, కచ్చితంగా ఒకరోజు డైరెక్టర్‌ అవుతాడు అంటూ ఏడ్చేశాడు. 

అంతా అమ్మ వల్లే..
తనూజకు అక్కతో దిగిన ఫోటో వచ్చింది. ఆమె మాట్లాడుతూ.. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం.. ముగ్గురు ఆడపిల్లలంటే కష్టమే.. పెళ్లి చేసేయండి అని కొందరు నాన్నతో అనేవాళ్లు. నాన్న కూడా భయపడి వీళ్లను చదివించొద్దు, పెళ్లి చేసేద్దామన్నారు. కానీ, అమ్మ.. మా కోసం నాన్నకు దూరంగా ఉన్నా పర్లేదని హైదరాబాద్‌ వచ్చేసింది. నువ్వు చేయగలవు, ముందుకెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించింది. 

రౌడీగా దివ్య
తర్వాత అమ్మానాన్న కలిసిపోయారనుకోండి. అయినా అమ్మ వల్లే నేనిక్కడ ఉన్నాను అంటూ తనూజ హ్యాపీగా ఫీలైంది. డిమాన్‌ పవన్‌.. చెస్‌ ఛాంపియన్‌గా మెడల్‌ అందుకున్న ఫోటో చూసి మురిసిపోయాడు. దివ్యకు చిన్నప్పుడు గుండుతో రౌడీగా రెడీ చేసినప్పటి ఫోటో వచ్చింది. రీతూ.. తన చిన్నప్పటి ఫోటో చూపిస్తూ భరణిలా విలన్‌ అవుతానంది. సుమన్‌కు చైల్డ్‌హుడ్‌ ఫోటో అందింది. కానీ గౌరవ్‌, సంజనా, భరణి, నిఖిల్‌ ఫోటో స్టోరీలను మాత్రం చూపించలేదు.

చదవండి: తనూజకు భారీ ఓట్లు.. సీక్రెట్‌ ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement