ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2016 నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్స్ వచ్చాయి. అవన్నీ కూడా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. గత నెలలో ఐదో సీజన్ తొలి వాల్యూమ్‌లో నాలుగు ఎపిసోడ్స్, క్రిస్మస్ సందర్భంగా రెండో వాల్యూమ్‌లో మూడు ఎపిసోడ్స్ రిలీజయ్యాయి. సిరీస్ చిట్టచివరి ఎపిసోడ్.. జనవరి 1న రానుంది. దీని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)
ఐదో సీజన్‌లో ఇప్పటివరకు వచ్చిన 7 ఎపిసోడ్స్ గమనిస్తే.. విలన్ వెక్నాతో ఎలెవన్ అండ్ టీమ్ పోరాడటానికి కావాల్సినదంతా సిద్ధం చేశారు. ఇప్పుడు రాబోయే ఫినాలే ఎపిసోడ్‌లో ఎమోషన్‌తో పాటు అదిరిపోయే యాక్షన్ ఉండనుందని ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు.
'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు ఉంటారు. వీళ్లకు ఓ సూపర్ పవర్స్ ఉన్న ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. వీళ్లంతా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఎలెవన్.. తనలాంటి అతీత శక్తులుండే కొందరితో పోరాడాల్సి వస్తుంది. ఇంతకీ వాళ్లెవరు? ఎలెవన్ గతమేంటి అనేదే సిరీస్ ప్లాట్ లైన్. ఫాంటసీ టచ్ ఉండే యాక్షన్, అడ్వెంచర్ స్టోరీలు ఇష్టముంటే ఈ సిరీస్ చూడండి. అస్సలు విడిచిపెట్టరు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: పెళ్లయిన నెలకు సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్)


