బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో తనూజ విన్నర్ అవుతుందని చాలామంది చెబుతున్న మాట.. అయితే, అదంతా పీఆర్ టీమ్ మాయా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ కోసం దాదాపుగా ప్రతి కంటెస్టెంట్ పీఆర్‌ను పెట్టుకుంటారు. అలా అని కేవలం వారి మీదనే ఆదారపడితే కుదరదు. హౌస్‌లో కంటెస్టెంట్ సరైన కంటెంట్ ఇవ్వకుంటే ఎంతమంది పీఆర్ టీమ్‌లో ఉన్న సరే ఎలిమినేట్ అయి బయటకు రావాల్సిందే.
తనూజ కోసం రూ. 100 కోట్లు
బిగ్బాస్లో పది వారాలుగా తనూజ టాప్లో ఉంది. సోషల్మీడియా సర్వేలలో చాలామటుకు ఆమె విన్నర్ అంటూ ఓట్లు పడుతున్నాయి. కల్యాణ్ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే, కొందరు తనూజను టార్గెట్ చేస్తూ పీఆర్ టీమ్ సాయంతో నెట్టుకొస్తుందని అంటుంటే... మరికొందరు మాత్రం తనకు బిగ్‌బాస్ టీమ్ సపోర్ట్ ఉందని అంటున్నారు. దాదాపు ఇందులో నిజం ఉండదనే వాదన షో గురించి తెలిసిన వారు చెబుతున్నమాట. ఆమెకు కప్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ టీమ్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందా..? ఒకరి కోసం తమ ప్రతిష్టను దెబ్బతీసుకుంటుందా ..? ఒకవేళ తనూజకు సాయం చేయాలనుకుంటే మరో పది సీరియల్స్‌లలో అవకాశాలు కల్పిస్తారు. అంతే గానీ ఇలా కోట్లలో ఖర్చు పెట్టి ఆమెకు కప్ ఎందుకు ఇస్తారని వాదించేవారు కూడా ఉన్నారు.
తనూజ ఓట్ల సీక్రెట్ ఇదే
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సీరియల్ 'ముద్దమందారం..' 2014 నుంచి 2019 వరకు జీతెలుగులో ఈ సీరియల్ ప్రసారమైంది. ఒకటి రెండు కాదు ఏకంగా 1580 ఎపిసోడ్‌లతో బుల్లితెర హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో పల్లెటూరి పేదింటి అమ్మాయి పాత్రలో తనూజ అదరగొట్టింది. ఈ సీరియల్ చూసిన ప్రతిఒక్కరు ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా చాలా హిట్ అయింది. సీరియల్స్ ఎక్కువగా గృహిణిలే ఫాలో అవుతుంటారు. దీంతో బిగ్బాస్లో ఆమెకు వారి నుంచే మద్ధతు లభించింది. ఆపై చాలా గ్యాప్ తర్వాత బిగ్‌బాస్ వల్ల తనూజ మళ్లీ కనిపించడంతో మొదటి ఎపిసోడ్ నుంచే ఆమెకు భారీగా ఓట్లు పడటం జరుగుతుంది.
ఈ కారణం వల్లనే ఆమెకు ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయి. కేవలం పీఆర్ వల్ల మాత్రమే ఇంత బజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే పొరపాటే.. ముఖ్యంగా ఈ సీజన్‌లో బలమైన కంటెస్ట్‌ట్స్ లేకపోవడం ఆపై చాలా పవర్‌ఫుల్ అనుకున్న భరణి ఆట పేలవంగా ఉండటంతో తనూజకు బాగా కలిసొచ్చింది. ఇమ్మాన్యుయేల్ సత్తా చాటుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలేదు. దీంతో తనకూ ఫ్యాన్ బేస్ లేకుండా పోయింది. ఆపై ప్రేక్షకులను మెప్పిస్తుంది కల్యాణ్ మాత్రమే.. కానీ, అతను కూడా తనూజతో బాగా క్లోజ్గా ఉండటం వల్ల విన్నర్ అయ్యేంత రేంజ్‌లో ఓట్లు పెద్దగా అతనివైపు మొగ్గుచూపడం లేదు.
ఇలా పలు కారణాల వల్ల ప్రస్తుతానికి తనూజ టాప్లో దూసుకుపోతుంది. పీఆర్ టీమ్ కారణంగానే బిగ్‌బాస్ విన్నర్‌గా ఎవరూ కాలేరనేది చాలామంది చెబుతున్నమాట.. అందుకోసం ధైర్యం చేసి అంత ఖర్చు ఎవరూ చేయరని కూడా తెలుపుతున్నారు. కానీ, వారి ఆటకు కాస్త బలాన్ని పీఆర్ టీమ్ ఇస్తుందనేది మాత్రం వాస్తవం అంటారు.


