వెండితెరకు పోటీగా మారింది ఓటీటీ. ఈ క్రమంలోనే తారలు అక్కడ కూడా తమ సత్తా చాటుతున్నారు. సిల్వర్ స్క్రీన్‌కు భిన్నంగా ఓటీటీ వేదికలపై ప్రదర్శితమవుతున్న చిత్రాల్లో మహిళల అభినయ సామర్ధ్యం మరింతగా కనిపిస్తోంది. అదే క్రమంలో ఈ ఏడాది ఓటీటీ చిత్రాల్లో పలువురు తారల నటన వీక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తారలు ఎవరెవరంటే?
సాన్యా మల్హోత్రా
పితృస్వామ్యాన్ని తీవ్రంగా విమర్శించిన మిస్ట్రెస్ చిత్రంలో సాన్యా మల్హోత్రా నటన ఆకట్టుకుంటుంది. సంతోషాల వధువు నుంచి ఒక ఇంటికి బానిసగా మారే క్రమంలో సాన్యా నటన ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 నిర్మించిన చిత్రం ఇది.
యామీ గౌతమ్...
ఉత్కంఠభరితమైన రొమాంటిక్ కామెడీ ధూమ్ ధామ్. ఇందులో నటి యామి గౌతమ్ నవ వధువుగా నటించింది. ఆమె వివాహం జరిగిన రాత్రిని అంచనాను తలక్రిందులుగా చేసి, నెర్వస్‌గా ఉండే తప భర్తతో నగరం అంతటా పిచ్చిగా తిరిగే థూమ్ థామ్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
మియా మేల్జర్...
స్టోలెన్ చిత్రంలో తన బిడ్డ కిడ్నాప్‌కు గురైన పరిస్థితిలో ఒక నిస్సహాయ స్త్రీ పాత్రను మియా మేల్జర్ పోషించింది. తాను ఎదుర్కొంటున్న పరిస్థితి హింసాత్మకంగా మారినప్పుడు అదే నిస్సహాయ మహిళ తెగువను చూపుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
నీనా గుప్తా..
ఆచారీ బా చిత్రంలో గుజరాతీ వితంతువుగా సీనియర్ నటీమణి నీనా గుప్తా నటన మన్ననలు అందుకుంది. జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూడవచ్చు.
షీబా చద్దా
సుగంధ ద్రవ్యాల పట్ల మక్కువ, వివాహ జీవితంలో అసంతృప్తి ఉన్న గృహిణిగా షీబా చద్దా... ఫ్యామిలీ డ్రామా కౌశల్జీ వర్సెస్ కౌశల్ చిత్రంలో అద్భుతమైన నటనను కనబరుస్తుంది. ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో ఉంది.
సబా ఆజాద్
పీరియాడిక్ డ్రామా.. సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్‌లో సబా సంప్రదాయవాద సమాజంలో తన గొంతును వినిపించడానికి పోరాడిన స్త్రీ స్ఫూర్తిగా కనిపిస్తుంది. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో అందిస్తోంది.
ఫరీదా జలాల్
పదునైన, నిర్ణయాత్మక పాత్రలో ఫరీదా ఆకట్టుకుంటుంది. మాతృమూర్తిగా ఆమె కుటుంబం ఆమెను ఆరాధిస్తుంది భయపడుతుంది కూడా. ది గ్రేట్ షంసుద్దీన్ ఫ్యామిలీ సినిమాను జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు.
రాధికా ఆప్టే
సాలీ మొహబ్బత్ అనే డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌లో రాధికా ఆప్టే నటన ప్రశంసలు అందుకుంది. ఆమె ఒక విధేయురాలైన భార్యగా మాత్రమే కాదు అడ్డంకులు ఎదురైనప్పుడు అంతే కఠినంగా, అన్ని సందర్భాల్లోనూ పూర్తిగా అమాయకంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
దీప్తి నావల్
రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్‌లలో నటి దీప్తి నావల్ తనకున్న మంచి మహిళ అనే ఇమేజ్‌కు భిన్నంగా కనిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ రెండు చిత్రాలు చూడవచ్చు.
హుమా ఖురేషి
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ అందిస్తున్న ఢిల్లీ క్రై మ్ సీజన్ 3లో క్రూరమైన మానవ అక్రమ రవాణాదారు మీనా (బడీ దీదీ) పాత్రలో హుమా ఖురేషి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. షెఫాలీ షా, రసికా దుగల్ తదితరులు కూడా నటనకు మార్కులు పడినప్పటికీ, ఖురేషి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించి, ప్రశంసలు పొందింది.


