Bigg Boss Telugu 9లో అనుకున్నదే జరిగింది. హౌస్ నుంచి ఆయేషా వెళ్లిపోయింది. మరోవైపు తనూజకు ఫెవికిక్‌లా అతుక్కుపోయింది మాధురి. తనకోసం రమ్యతో సైతం గొడవపడింది. తనూజనే ముఖ్యం అంటూ ఏదో నిజమైన అమ్మలా ఫీలైపోయింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (అక్టోబర్ 24వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
రీతూ కంటెండర్.. తట్టుకోలేకపోయిన మాధురి
వాంటెడ్ పేట టాస్క్‌లో సంజనాని పోలీసులకు పట్టించినందుకు తనూజ (Thanuja Puttaswamy) కెప్టెన్సీ కంటెండర్ అయింది. మాస్క్ మాధురి కటౌట్‌పై కిల్ అని రాసినందుకు రీతూ కూడా కంటెండర్ అయంది. కానీ, దీన్ని జీర్ణించుకోలేక రీతూపై విషం ఏదో ఒకరకంగా కక్కుతూనే ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్లు నిఖిల్, కల్యాణ్, దివ్య, ఇమ్మాన్యుయేల్ సైతం కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ గేమ్‌లో చివరి వరకు తనూజ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.

స్పృహ తప్పిన తనూజ.. ఏడ్చేసిన కల్యాణ్
కెప్టెన్సీ చేజారడంతో తనూజ ఎమోషనల్ అయింది. సడన్‌గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను డాక్టర్ రూమ్‌కు తీసుకెళ్లారు. తనూజను అలా చూసి ఇమ్మూ, కల్యాణ్ (Pawan Kalyan Padala) తెగ ఏడ్చేశారు. కల్యాణ్ అయితే.. తనూజకు ఏదో అయిపోయినట్లు వెక్కెక్కి ఏడ్చాడు. అది చూసిన మాధురి.. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? జనాలు చూస్తే నవ్వుతారు. తను వీక్‌నెస్‌తో కళ్లు తిరిగి పడిపోతే నీకెందుకు ఏడుపొస్తుంది.. ఛీఛీ అని చీవాట్లు పెట్టింది.
సేవ్ అయితే ఒకటి చెప్తా!
అర్ధరాత్రి తనూజ.. ఎందుకు ఏడ్చావ్? అని కల్యాణ్‌ను అడిగింది. అందుకతడు ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఉట్టి అబద్ధం అని తెలిసిన తనూజ.. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావ్? అని మరోసారి నిలదీసింది. దీంతో అతడు అది నేను చెప్పలేను.. సర్లే బజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా అంటూ నిద్రపోతున్న తనూజతో అన్నాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషాను మెడికల్ రూమ్‌కు పిలిచారు. టైఫాయిడ్‌తో పాటు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
ఇంకో ఛాన్స్
ఇక బిగ్‌బాస్.. మీ అనారోగ్యం దృష్ట్యా చికిత్స అవసరం. అలాగే ఇతర హౌస్‌మేట్స్ ఆరోగ్య భద్రత కూడా అవసరమే! అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయేషా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్‌బాస్.. ఫ్యూచర్‌లో ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నా.. అంటూ వీడ్కోలు చెప్పింది. ఇక వెళ్లేముందు తనూజతో.. జాగ్రత్త.. మళ్లీ ఫేక్‌దాంట్లో పడొద్దు. ఇదొక్కటే చెప్తున్నా అంటూ పిచ్చి లవ్‌ట్రాకులు వద్దని హెచ్చరించి వెళ్లిపోయింది.


