హీరోయిన్‌గా బిగ్‌బాస్‌ బ్యూటీ రతిక.. ఏకంగా మూడు భాషల్లో! | Bigg Boss Rathika Rose Main Lead In XY Movie Motion Poster Out, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ బ్యూటీ రతిక హీరోయిన్‌గా XY మూవీ

Oct 25 2025 10:19 AM | Updated on Oct 25 2025 10:49 AM

Bigg Boss Rathika Rose Main Lead in XY Movie, Motion Poster Out

తెలుగు బిగ్‌బాస్‌ 7వ సీజన్‌లో పాల్గొని బాగా పాపులర్‌ అయింది రతిక (Rathika Ravinder). ఈ షోలో ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ తనపై వచ్చిన నెగెటివిటీ పోగొట్టుకోలేకపోయింది. ఇక సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు వేసే రతికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎక్స్‌వై. సీవీ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్రానా, అనిజ్‌ ప్రభాకర్‌, శ్రీధర్‌ ఇతర పాత్రలు పోషించారు. ఎంకే సాంబశివం నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది.

సినిమా
ఇటీవల ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. పిజ్జా, సూదు కవ్వుమ్‌, ఇరుది సుట్రు వంటి ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించడంతో పాటు మాయవన్‌ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీవీ కుమార్‌. తాజాగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఆయన దర్శకత్వం వహించిన మరో ప్రయోగాత్మక చిత్రం ఎక్స్‌ వై. ఇదొక డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌ మూవీ అని ప్రేక్షకుల నుంచి కచ్చితంగా కితాబులు అందుకుంటుంది అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: హరిహరన్‌ ఆనందరాజా, సంగీతం: శ్రీకాంత్‌ కృష్ణ.

 

చదవండి: ఆయేషాకు టైఫాయిడ్‌, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement